S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/26/2016 - 11:54

ముంబయి: స్వల్ప నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు కొనసాగుతున్నాయి. 15 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్‌, 7 పాయింట్లకు పైగా నష్టంలో నిఫ్టీ ట్రేడవుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 67.36 పైసలు వద్ద కొనసాగుతోంది.

07/26/2016 - 11:44

టక్యో (జపాన్‌) : పశ్చిమ టోక్యోలో సాగమిహరాలో వికలాంగుల ఆశ్రమంపై 26 ఏళ్ల యువకుడు కత్తితో దాడికి దిగాడు. దొరికిన వారిని దొరికినట్టు విచక్షణా రహితంగా నరికేశాడు. ఈ ఘటనలో 19 మంది వికలాంగులు అక్కడికక్కడే మృతిచెందగా, మరో 26 మంది తీవ్రంగా గాయపడ్డారు. నిందితుడు గతంలో ఇదే ఆశ్రమంలో పనిచేసినట్లు, గాయపడిన వారిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

07/26/2016 - 07:05

ఆరిలోవ, జూలై 25: నగరానికి చెందిన రంగసాయి నటక సంఘం ఆధ్వర్యంలో ఆగస్టు 3,4,5 తేదీలలో మద్దిలపాలెం కళాభారతి ఆడిటోరియంలో సురభి నాటక ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు బాదంగీర్ సాయి ( ఎ.వి.వి. ఎస్.మూర్తి) తెలిపారు. తెలుగు నాటక రంగంలో సుదీర్ఘంగా 131 వసంతాల చరిత గల సురభి నాటకాలు విశాఖ ప్రజలకు, నాటక ప్రియులకు కనువిందు చేయనున్నట్లు తెలిపారు.

07/26/2016 - 07:05

కశింకోట, జూలై 25: దివంగత మాజీ ఎంపీ, మాజీ మంత్రి, మాజీ వుడా చైర్మన్ ఆర్‌ఇసిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎస్‌ఆర్‌ఎఎస్ అప్పలనాయుడు ఆర్‌ఇసిఎస్‌ను మొట్టమొదటి సారిగా అనకాపల్లి పరిధిలో స్థాపించగా దీనికి దివంగత మాజీ ఎమ్మెల్యే పివి రమణ అధ్యక్షుడిగా ఉండి అభివృద్ధి బాటలో నడిపించారని వారి ఇద్దరి రుణం ఎప్పటికీ ఐదు మండలాల్లో ఉన్న వినియోగదారులు తీర్చుకోలేనిదని మాజీ మంత్రి, పెందుర్తి శాసనసభ్యుడు బండారు సత్యనారాయణ

07/26/2016 - 07:04

గోపాలపట్నం, జూలై 25: వాయుసేన విమానంలో చెన్నై నుంచి పోర్ట్‌బ్లెయిర్ వెళుతూ గల్లంతైన ఎన్‌ఎడి ఉద్యోగుల కుటుంబాలను వైకాపా అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సోమవారం పరామర్శించారు. ముందుగా 104 ఏరియా ప్రాంతంలో వున్న భూపెంధర్‌సింగ్ గృహానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. భూపేంద్రసింగ్ భార్య సంగీత, కుమారుడు అశుతోష్‌లను ఓదార్చారు.

07/26/2016 - 07:03

నర్సీపట్నం,జూలై 25: బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తలపెట్టిన పాదయాత్రను ఆగస్టు 17వ తేదీకి వాయిదా వేసినట్లు డిసిసి అధ్యక్షుడు పసుపులేటి బాలరాజు తెలిపారు. ఆగస్టు 5వ తేదీన రాజ్యసభ సభ్యుడు కె.వి.పి. రామచంద్రరావు రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లుపై చర్చ జరుగనున్నందున రాహుల్ పాదయాత్రను వాయిదా వేశా రన్నారు.

07/26/2016 - 07:03

విశాఖపట్నం, జూలై 25: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానల వలనే దేశంలో పరిశ్రమలు మూతపడుతున్నాయని సిఐటియు అఖిల భారత కార్యదర్శి స్వదేశ్ దేవారాయ్ ఆందోళన వ్యక్తంచేశారు.విశాఖ సిఐటియు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలు, యాజమాన్యాల వైఖరితోనే పరిశ్రమలు మూతపడుతున్నాయన్నారు.

07/26/2016 - 07:02

విశాఖపట్నం, జూలై 25: విశాఖ జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు తాను టీమ్ లీడర్‌గా టీమ్ వర్క్‌తో పని చేస్తానని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ స్పష్టం చేశారు. కలెక్టర్‌గా పని చేస్తూ కేంద్ర సర్వీసులకు బదిలీపై వెళ్ళిన డాక్టర్ ఎన్.యువరాజ్ నుంచి సోమవారం ప్రవీణ్‌కుమార్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు.

07/26/2016 - 07:00

జలుమూరు, జూలై 25: శ్రీముఖలింగం వంశధార నదికి రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ పిలుపుమేరకు సోమవారం కుంభహారతి ఇచ్చారు. ప్రతీ సోమవారం నదీ తీరంలో ఉన్న క్షేత్రాల్లో హారతి అందజేస్తే సకల సౌభాగ్యాలు, ప్రజలు సంతోషంగా ఉంటారని ఆశయంతో ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినట్టు ఈవో సూర్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చక సంఘ అధ్యక్షుడు పెద్దలింగన్న, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

07/26/2016 - 07:00

ఎచ్చెర్ల, జూలై 25: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల హామీలను పక్కన పెట్టి బడుగు బలహీనవర్గాలకు సంక్షేమ పథకాలు అందని విధంగా పాలన సాగిస్తున్నారని వైసిపి నియోజకవర్గ ఇంచార్జ్ గొర్లె కిరణ్‌కుమార్ విమర్శించారు. సోమవారం సాయంత్రం బడివానిపేట పంచాయితీలో గడపగడపకు వైసిపి కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు.

Pages