S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/26/2016 - 18:49

దిల్లీ: ఎపికి ప్రత్యేకహోదా కోసం తమ పార్టీ ఎంపీ కెవిపి రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేటుబిల్లును చర్చించాల్సిందేనని రాజ్యసభలో మంగళవారం నాడు కాంగ్రెస్ సభ్యులు పట్టుబట్టారు. వెల్‌లోకి వెళ్లి ప్లకార్డులు పట్టుకుని ఆందోళన ప్రారంభించడంతో సభలో గందరగోళం మొదలైంది. వచ్చే శుక్రవారం ఈ బిల్లుపై చర్చిద్దామని డిప్యూటీ చైర్మన్ కురియన్ చెప్పినప్పటికీ కాంగ్రెస్ సభ్యులు వినిపించుకోలేదు.

07/26/2016 - 18:44

విజయవాడ: కృష్ణా పుష్కరాల పనులపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. విజయవాడలో ఈరోజు మంత్రివర్గ సమావేశంలో లో కృష్ణా పుష్కరాలు, వనం-మనం కార్యక్రమాలపై ప్రధానంగా చర్చ సాగింది. కృష్ణా పుష్కరాలకు కేంద్ర ప్రభుత్వం నిధుల ఇవ్వకపోవడం సబబు కాదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రేషన్‌ డీలర్లకు కమీషన్‌ క్వింటాకు రూ.70 పెంపునకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

07/26/2016 - 18:42

దిల్లీ: రెండు రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం, వెండి ధరలుమళ్లీ పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో మంగళవారం బంగారం ధర రూ. 110 పెరిగింది. దీంతో దేశీయ మార్కెట్లో పది గ్రాముల పసిడి ధర రూ. 30,790కి చేరింది. నగల వ్యాపారుల నుంచి డిమాండ్‌ ఎక్కువవడంతో ధరలు పెరిగినట్లు బులియన్‌ మార్కెట్‌ వర్గాలు వెల్లడించాయి. వెండి ధర కూడా నేడు రూ. 320 పెరిగింది. దీంతో బులియన్‌ మార్కెట్లో కేజీ వెండి ధర రూ.

07/26/2016 - 18:41

బెర్లిన్‌: జర్మనీ రాజధాని బెర్లిన్‌లో సమీపంలోని స్టెగ్లిట్జ్‌ ప్రాంతంలోని ఆస్పత్రిలోకి సాయుధుడైన దుండగుడు ప్రవేశించి కాల్పులు జరిపాడు. ఓ వైద్యుడిపై దాడి చేసి అతడిని తీవ్రంగా గాయపరిచాడు. అనంతరం దుండగుడు తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

07/26/2016 - 18:39

కోయంబత్తూర్‌: డీఎండీకే అధినేత, సినీనటుడు విజయ్‌కాంత్‌ దంపతులపై తిరుపూర్‌ ప్రిన్సిపల్‌ న్యాయస్థానం అరెస్టువారెంట్‌ జారీచేసింది. గత మూడు విచారణలకు హాజరుకాని విజయ్‌కాంత్‌ మంగళవారం కూడా హాజరుకాకపోవడంతో కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. పరువు నష్టం కేసులో కోర్టుకు హాజరుకానందుకు విజయ్‌కాంత్‌, ఆయన సతీమణి ప్రేమలతకు న్యాయమూర్తి అలమేలు నటరాజన్‌ వారెంట్‌ జారీ చేశారు.

07/26/2016 - 16:42

హైదరాబాద్: తెలంగాణ సిఎం కెసిఆర్ సొంత నియోజకవర్గంలో రైతులపై లాఠీచార్జి జరగడం దారుణమని సిపిఎం నేత బృందాకారత్ అన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు తమ పార్టీ వ్యతిరేకం కాదని, వాటిలో అక్రమాలను తాము అడ్డుకుంటామని ఆమె అన్నారు. అసైన్డ్ భూములను సాగుచేస్తున్న రైతులకు కూడా న్యాయపరంగా నష్టపరిహారం ఇవ్వాలన్నారు.

07/26/2016 - 16:41

దిల్లీ: తమ పార్టీ ఎంపీ కెవిపి రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుపై చర్చ జరపాలని రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీలు మంగళవారం పట్టబట్టారు. ఈ బిల్లుపై ఇప్పట్లో ఓటింగ్ జరిగే అవకాశం లేదని ఇదివరకే తాను రూలింగ్ ఇచ్చానని, నోటీసు ఇస్తే చర్చకు అనుమతి ఇవ్వాల్సి ఉంటుందని డిప్యూటీ చైర్మన్ కురియన్ అన్నారు. అయినప్పటికీ కాంగ్రెస్ ఎంపీలు వెల్‌లోకి దూసుకుపోయి నిరసన కొనసాగిస్తున్నారు.

07/26/2016 - 16:40

విజయనగరం: పెళ్లికి అంగీకరించలేదని బ్లేడుతో ఓ యువతి గొంతు కోసిన ప్రేమోన్మాది విక్రమ్‌ను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. తనను ప్రేమిస్తూనే మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటూ పెళ్లికి నిరాకరించినందుకే ఆ యువతిపై దాడి చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. హత్యాయత్నం, నిర్భయ చట్టం కింద నిందితుడిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

07/26/2016 - 16:40

విశాఖ: విశాఖ ఏజెన్సీ నుంచి హైదరాబాద్‌కు కారులో సుమారు 10 లక్షల రూపాయల విలువ చేసే గంజాయిని తరలిస్తుండగా నర్సీపట్నం వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన నలుగురు యువకులను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.

07/26/2016 - 16:40

హైదరాబాద్: నగరంలోని జెబిఎస్, ఎంజిబిఎస్ బస్ కాంప్లెక్సులలో కిడ్నాప్‌లకు పాల్పడుతున్న ఓ ముఠా సభ్యులను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వీరు ఇటీవల ఎంజిబిఎస్ బస్ స్టేషన్‌లో ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి హత్య చేశారు. ఉత్తరాదికి చెందిన ఈ ముఠాలో ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే విషయాన్ని పోలీసులు ఆరా తీస్తున్నారు.

Pages