S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/25/2016 - 23:43

జమ్మికుంట, జూలై 25: నగర పంచాయతీ పరిధిలోని ఆబాది జమ్మికుంట సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో జమ్మికుంట క్రిష్ణకాలనికి చెందిన జిక్కిడి క్రాంతికుమార్ (24), గొట్టిముక్కుల శ్రీనివాస్ (22)లు దుర్మరణం పాలయ్యారు. వీణవంక వైపు నుండి జమ్మికుంటకు వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టినట్టు భావిస్తున్నారు.

07/25/2016 - 23:43

వేములవాడ, జూలై 25: వేములవాడ సిరిసిల్ల ప్రదాన రహదారిపై అగ్రహారం వద్ద టివిఎస్ ఎక్సెల్ వాహనంపై రాజన్న దర్శనానికి వస్తున్న దంపతులపై బైక్‌పై వచ్చిన దుండగులు అకస్మాత్తుగా గొలుసు లాక్కున్న సంఘటన సోమవారం సంచలనం సృష్టించింది.

07/25/2016 - 23:43

కరీంనగర్, జూలై 25: ఈనెల 31 నుండి ఆగస్లు 11వరకు జరిగే గోదావరి అంత్యపుష్కరాలకు అదనంగా ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ కె.చంద్రశేఖర్ తెలిపారు. సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ధర్మపురి, కాళేశ్వరం, కోటిలింగాల, మంథని తదితర పుష్కర ఘాట్ల వద్దకు బస్సులు నడుస్తాయని తెలిపారు.

07/25/2016 - 23:42

ధర్మపురి, జూలై 25: ధర్మపురి క్షేత్రంలో గోదావరి అంత్య పుష్కరాలు జూలై 31 నుండి ఆగస్టు 11 వరకు జరుగనున్నాయి. ఈనేపథ్యంలో గత ఏడాది జూలై 14 నుండి 25 వరకు నిర్వహించిన గోదావరి ఆది పుష్కరాల సమయంలో అధికారుల అంచనాలను మించి అత్యధిక సంఖ్యలో భక్తులు క్షేత్రాన్ని దర్శించుకున్నారు. సిఎం కెసిఆర్, స్పీకర్ మధుసూధనాచారి సహా మంత్రులు, ఉన్నతాధికారులు ధర్మపురిలోనే పుష్కర స్నానాలు చేశారు.

07/25/2016 - 23:42

కరీంనగర్, జూలై 25: ఎస్సారెస్పీ ఉప కాలువలతో పాటు ఆయకట్టు ప్రాంతంలోని చెరువులు, కుంటలు నింపేందుకు వీలుగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి వెంటనే నీటిని విడుదల చేయాలని టిడిపి జిల్లా అధ్యక్షుడు చింతకుంట విజయరమణారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

07/25/2016 - 23:41

కరీంనగర్ టౌన్, జూలై 25: జిల్లాలో చేపట్టాల్సిన రెండు పడక గదుల ఇళ్ళ పథకం ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆమె అధికారులతో డబుల్ బెడ్‌రూం ఇళ్ళపై సమీక్షించారు.

07/25/2016 - 23:41

కాల్వశ్రీరాంపూర్, జూలై 25: ప్రతిపక్షం లేకుండా చేయాలనుకోవడం కెసిఆర్ అవివేకమని బిజెపి జాతీయ నాయకుడు చందుపట్ల జంగారెడ్డి అన్నారు. ఆయన మండల కేంద్రంలో సోమవారం మాట్లాడుతూ సోనియా గాంధీ తెలంగాణ బిల్లుకు ఆమోదం తెలిపితే పార్టీని విలీనం చేస్తానని, బిల్లు ఆమోదం వచ్చాక సోనియా గాంధీని కెసిఆర్ మోసం చేశారని విమర్శించారు.

07/25/2016 - 23:40

కరీంనగర్ టౌన్, జూలై 25: మెట్ట ప్రాంతంలో నిర్మిస్తున్న గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టుల కింద భూములు కోల్పోతున్న నిర్వాసితుల కోసం ఎంతకైనా తెగిస్తామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్ స్పష్టంచేశారు. ఆయా గ్రామాల ప్రజలతో పాటు భూనిర్వాసితులు సిపిఐ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

07/25/2016 - 23:40

జగిత్యాలటౌన్, జూలై 25: మల్లన్న సాగర్ భూ నిర్వాసితుల హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు ఇప్పటికైన కండ్లు తెరవాలని సిఎల్‌పి ఉపనేత తాటిపర్తి జీవన్‌రెడ్డి హితవు పలికారు. మెదక్ జిల్లా ప్రజలే నీకు రాజకీయ భిక్ష పెట్టిన విషయం గుర్తించు కోవాలన్నారు.

07/25/2016 - 23:38

ఆదిలాబాద్, జూలై 25: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యత తీసుకోకపోవడంపై ఆదిలాబాద్ డిఎఫ్‌వో మోహన్‌పై రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగురామన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆదిలాబాద్ పట్టణంతో పాటు జైనథ్, ఆదిలాబాద్ మండలాల్లో హరితహారం కింద భారీ ఎత్తున అధికారులతో కలిసి మంత్రి రామన్న మొక్కలు నాటారు.

Pages