S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/25/2016 - 03:41

మచిలీపట్నం, జూలై 24: పట్టణంలో వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి పర్చేందుకు అన్నివిధాలా కృషి చేస్తున్నట్లు రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. స్థానిక 16వ వార్డులో ఆదివారం ఆయన సైకిల్ యాత్ర నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణంలోని ప్రతి వార్డులో రహదారి, డ్రైనేజీ, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు.

07/25/2016 - 03:40

మచిలీపట్నం (కోనేరుసెంటర్), జూలై 24: వాతావరణ మార్పులు ఆక్వా రైతులను గడగడలాడిస్తున్నాయి. వారం రోజులుగా ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు పడటం, ఉక్కపోత కారణంగా ఆక్సిజన్ అందక రొయ్యలు, చేపలు మృత్యువాత పడుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధిక లీజు, పెరిగిన మేత ధరలతో సతమతమవుతున్న తరుణంలో వాతావరణ మార్పులు ఆందోళన కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

07/25/2016 - 03:40

కూచిపూడి, జూలై 24: తెలుగుదేశం పార్టీలో చేరిన వైకాపా నాయకులు అక్కడ ఇమడలేక తిరిగి తమ పార్టీలోకి వస్తారని పామర్రు శాసనసభ్యురాలు ఉప్పులేటి కల్పన అన్నారు. మొవ్వ మండల వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక సీతామహాలక్ష్మి ఫంక్షన్ హాలులో పార్టీ మండల అధ్యక్షులు రాజులపాటి రాఘవరావు అధ్యక్షతన జరిగిన కార్యవర్గ సమావేశంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

07/25/2016 - 03:40

బంటుమిల్లి, జూలై 24: బంటుమిల్లిలో ప్రధాన సమస్య అయిన బంటుమిల్లి - శింగరాయిపాలెం ఆర్ అండ్ బి రోడ్డు విస్తరణ, నిర్మాణ పనులు చేపట్టాలని, బంటుమిల్లి ప్రధాన కాలువకు పుష్కలంగా సాగునీరు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆదివారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో తీర్మానించారు.

07/25/2016 - 03:39

అవనిగడ్డ, జూలై 24: స్థానిక కొత్త ఎడ్లలంకలోని రెండు కుటుంబాల మధ్య నివేశన స్థలం, భవనం విక్రయానికి సంబంధించి జరిగిన ఘర్షణలో ఐదుగురు గాయాలపాలయ్యారు. ఆదివారం రాత్రి 8గంటల సమయంలో ఈ ఘర్షణ జరిగింది. క్షతగాత్రులందరినీ స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

07/25/2016 - 03:38

విజయవాడ, జూలై 24: నకిలీ బ్రాహ్మణ సంఘాలతో బ్రాహ్మణ సమాజానికే ఎంతో ప్రమాదమని వీటి పట్ల బ్రాహ్మణులు అప్రమత్తంగా వుండాలని బ్రాహ్మణ సమాఖ్య జాతీయ అధ్యక్షుడు డాక్టర్ బిసి మిశ్రా తెలిపారు. నిధుల కైంకర్యం ఆరోపణపై ఏనాడో బ్రాహ్మణ సమాఖ్య నుంచి ప్రాథమిక సభ్యులతో సహా తొలగించబడిన కోట శంకరశర్మ సమాఖ్య గౌరవ సలహాదారునిగా ప్రచారం చేసుకుంటూ అనధికార కమిటీతో ఇటీవల విప్రోత్సవం నిర్వహించారని అన్నారు.

07/25/2016 - 03:38

విజయవాడ, జూలై 24: వైద్య వృత్తిలోకి అడుగుపెట్టేందుకై విద్యార్థినీ విద్యార్థులు ఎంసెట్ తర్వాత నీట్ పరీక్ష రాసేందుకై గత రెండు నెలలుగా ఎంతో శ్రమపడ్డారు. తర్వాత పరీక్ష రాసే సమయంలో పరీక్షా కేంద్రాల్లో అధికారులు సరికొత్త పనికిమాలిన ఆంక్షలతో వారిని వేధింపులకు గురి చేయటంతో ప్రతి ఒక్కరూ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ప్రతి ఒక్కరూ చెప్పులు, బూట్లు వెలుపల వదలి రావాలన్నారు. అంత వరకు బాగుంది.

07/25/2016 - 03:37

విజయవాడ, జూలై 24: కృష్ణా పుష్కరాల సందర్భంగా నగరంలోని ప్రధాన ముఖ్య రహదారులన్నీ విస్తరించబడుతున్నాయి. ఈ నేపధ్యంలో పాత ప్రభుత్వాసుపత్రి ఎదుట రైవస్ కాలువ గట్టుపై గల అనేక నివాస గృహాలు, దుకాణాలను ఆదివారం ప్రొక్లెయినర్లతో తొలగించారు. ఈ సందర్భంగా ప్రతిఘటన ఎదురుకావటంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. కాలువగట్టు అంచు వరకు రహదారిని విస్తరిస్తామని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు.

07/25/2016 - 03:36

విజయవాడ, జూలై 24: కృష్ణా పుష్కరాలకు కౌంట్‌డౌన్ ప్రారంభం కావటంతో వివిధ ప్రభుత్వ శాఖలు యుద్ధప్రాతిపదికన తమతమ పరిధుల్లోని పనులు పనులు చేస్తున్నారు. కలెక్టర్ బాబు ఎ ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులు సిబ్బంది నిబద్ధతో రాత్రి, పగలు తేడా లేకుండా 24 గంటలు పని చేస్తున్నారు.
ఇరిగేషన్ శాఖ

07/25/2016 - 03:36

విజయవాడ (కార్పొరేషన్), జూలై 24: ఇప్పటివరకూ ఎమ్మెల్యేలకే పరిమితమైన ‘ఆపరేషన్ ఆకర్ష్’ కార్పొరేటర్ల స్థాయికి పాకింది. నగరంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ అధికార తెలుగుదేశం పార్టీలో చేరిన నష్టం నుంచి తేరుకోకముందే విజయవాడ నగరపాలక సంస్థలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కార్పొరేటర్ వీరమాచినేని లలిత టిడిపిలో చేరడంతో విఎంసి రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కాయి.

Pages