S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/25/2016 - 03:09

వేదాయపాళెం, జూలై 24: నెల్లూరు జిల్లాలో పచారి (నిత్యావసరాలు) సామాన్ల అక్రమ వ్యాపారం జోరుగా సాగుతోంది. నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో జిల్లాకు చెందిన కొందరు వ్యాపారులు ఇతర జిల్లాల నుంచి నాశిరకం సరుకులు పార్శిల్ లారీల ద్వారా దిగుమతి చేసుకుని యథేచ్ఛగా విక్రయాలు సాగిస్తున్నారు.

07/25/2016 - 03:07

ఖమ్మం(కల్చరల్), జూలై 24: ఆనాటి నాటక అనుభవమే నేటి భుక్తికి మార్గమైందని ప్రముఖ సినీ నటుడు వైజాగ్ ప్రసాదరావు వెల్లండించారు.

07/25/2016 - 03:05

కొత్తగూడెం, జూలై 24: ప్రమాదం జరిగిన పివికె-5 ఇంక్లైన్ భూగర్భ గనిలో పరిస్థితి అదుపులోకి వస్తోంది. ఘటన జరిగి రెండు వారాలలో నిర్వహించిన నిర్విరామ కృషిఫలితంగా గని లోపల విషవాయువుల లీకేజి చాలావరకు తగ్గించగలిగారు. రెస్క్యూ సిబ్బంది గనిలోపలికి వెళ్లి శాంపిల్‌లు సేకరిస్తూ ఎప్పటికప్పుడు టెస్టింగ్‌కు పంపిస్తున్నారు.

07/25/2016 - 03:05

ఎర్రుపాలెం, జూలై 24: మండల పరిధిలోని రేమిడిచర్ల గ్రామంలో ఆదివారం గ్రామ సర్పంచ్ బొజ్జగాని లక్ష్మయ్య, ఉప సర్పంచ్ చెన్నమరాజు పురుషోత్తమరాజుల ఆధ్వర్యంలో గ్రామ దేవత ముత్యాలమ్మకు గ్రామస్తులు పెద్ద ఎత్తున బోనాలు సమర్పించి పూజలు చేశారు. పెద్ద ఎత్తున వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, గ్రామమంతా సుభిక్షంగా ఉండాలని గ్రామ దేవతకు ప్రతి ఇంటి నుండి బోనాలతో వెళ్ళి మొక్కులు తీర్చుకున్నారు.

07/25/2016 - 03:04

ఖమ్మం(క్రైం), జూలై 24: మొక్కలు నాటడమే ప్రధానం కాదని, వాటిని బతికించడం ఎంతో ముఖ్యమని జిల్లా ఎస్పీ షానవాజ్‌ఖాసీం పేర్కొన్నారు. ఆదివారం స్థానిక పోలీస్ కార్వర్టర్స్‌లో హరితహారంలో భాగంగా నాటిన మొక్కలకు పాదులు సరిజేసి నీరు పోసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పోలీస్ సిబ్బంది గతవారం నాటిన మొక్కలకు పాదులు సరిజేసి అవి వంగిపోకుండా ఎదురు బద్దలు కట్టి నీరు పోశారు.

07/25/2016 - 03:04

జూలూరుపాడు, జూలై 24: గిరిజన సంస్కృతీ, సాంప్రదాయాల ప్రకారం ప్రతి ఏటా గిరిజన (లంబాడీ) యువతులు జరుపుకునే తీజ్ పండుగ సంబురాలను మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం ఉత్సాహంగా జరుపుకున్నారు. గ్రామ పెద్దల సమక్షంలో జరుపుకునే పండుగకు వారం రోజులుగా గ్రామ కూడళ్లల్లో కూటములను ఏర్పాటు చేసుకుని యువతులు వారి ఇష్ట దైవాన్ని కొలుచుకుంటూ నృత్యాలు చేశారు.

07/25/2016 - 03:03

నేలకొండపల్లి, జూలై 24: హరితహారం ఒక్కరోజు కార్యక్రమం కాదని, ఇది నిరంతర కార్యక్రమమని, హరితహారం కార్యక్రమాన్ని జనహారంగా ప్రజలు చేపట్టాలని ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం నేలకొండపల్లి, నాచేపల్లి, రామచంద్రాపురం, ముఠాపురం గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా నేలకొండపల్లిలోని టిఆర్‌ఎస్ జిల్లా నాయకుడు మానుకొండ దుర్గారావు ఇంటి ఆవరణలో ఆయన మొక్కలు నాటారు.

07/25/2016 - 03:03

తిరుమలాయపాలెం, జూలై 24: గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు యుద్ధ ప్రాతిపదికన లపరిష్కరించాని రోడ్లు, భవనాలు, స్ర్తి, శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మండల పరిధిలోని మర్రితండాలో ఆ గ్రామం నుండి లకావత్‌తండా ద్వారా పాతర్లపాడు వరకు 2.15కిలోమీటర్ల పొడవున 1.50కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న బిటి రోడ్డు నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.

07/25/2016 - 03:02

ఖమ్మం, జూలై 24: జిల్లా సమస్యలపై సుదీర్ఘంగా చర్చ జరపడమే కాకుండా, వాటికి పరిష్కారం లభిస్తుందని ప్రజలంతా భావిస్తున్న సమావేశాలకు ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు గైర్హాజరవడం గమనార్హం.

07/25/2016 - 03:01

ఖమ్మం(మామిళ్ళగూడెం), జూలై 24: జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశంలో జడ్పిటిసి, ఎంపిపి, శాసనసభ్యులు జిల్లాలోని స్థానిక సంస్థల్లోని సమస్యలపై అధికారులను నిలదీశారు. సమావేశంలో ప్రగతి నివేదికలను చదివి వినపించడమేకాని అవి అమలు జరుగుతున్న విధానంలో లోపాలను సరిచేయకపోవడంపై పలువురు ప్రజాప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారు.

Pages