S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/25/2016 - 03:26

లావేరు, జూలై 24: కాపులను బీసీ జాబితాలో చేర్చాలని ఉద్యమం చేపట్టిన ముద్రగడ పద్మనాభాన్ని జిల్లాకు చెందిన తెలగసంక్షేమసంఘం సభ్యులు ముద్రగడ స్వగ్రామమైన కిర్లంపూడిలో కమిటీ తమ సంఘీభావం ప్రకటించారు.

07/25/2016 - 03:23

శ్రీకాకుళం(టౌన్), జూలై 24: ఆదినారాయణుడు, ఆరోగ్య ప్రధాత అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దర్శనానికి ఆదివారం భక్తులు సందడి అంతంతమాత్రంగానే ఉంది. స్వామివారికి ప్రీతికరమైన ఆదివారం ఎపుడూ భక్తులు పోటెత్తుట తెలిసిందే. అయితే ఆషాడమాసం, చిన్నచిన్న చినుకులతో ఆధిత్యుని దర్శనానికి భక్తుల సంఖ్య తగ్గింది.

07/25/2016 - 03:22

నరసన్నపేట, జూలై 24: మండలానికి చెందిన ప్రముఖ రచయిత భమిడిపాటి గౌరీశంకర్‌కు ఉత్తమ కథాపురస్కారం లభించింది. హైదరాబాద్‌లోని త్యాగరాజా గానసభ కళావేదికలో ఆదివారం నెలవంక సాహితీ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉభయ రాష్ట్రాలనుండి ఈ ఏడాది ఈ పురస్కారాన్ని ఆయనకు ప్రదానం చేశారు.

07/25/2016 - 03:21

జలుమూరు, జూలై 24: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీముఖలింగంలో కొలువైయున్న మధుకేశ్వరస్వామిని జిల్లా రెవెన్యూ అధికారిణి కృష్ణ్భారతీ ఆదివారం సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ముఖ మండపంలో ఆమెను అర్చకులు ఆశీర్వచనాలు పలికి చరిత్ర, శిల్పసంపదల అంశాలను క్షుణ్ణంగా వివరించారు. ఆలయ ప్రాంగాణంలో కొలువైయున్న వారాహి అమ్మవారిని దర్శించి కుంకుమ పూజలు చేపట్టారు.

07/25/2016 - 03:21

శ్రీకాకుళం(టౌన్), జూలై 24: ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వ విధానాలపై చైతన్య వంతం కావాలని, లేదంటే రాష్ట్రాన్ని తాకట్టుపెట్టడానికి సైతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెనుకాడరని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు అన్నారు.

07/25/2016 - 03:19

ముండ్లమూరు, జూలై 24: రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమమే టిడిపి ధ్యేయంగా భావించి అభివృద్ధి, సంక్షేమ పథకాలను నిర్వహిస్తున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి శిద్దా రాఘవరావు స్పష్టం చేశారు. మండలంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు.

07/25/2016 - 03:19

ఒంగోలు, జూలై 24: జిల్లాలోని గిద్దలూరు, అద్దంకి, కందుకూరు నియోజకవర్గాల తెలుగుతమ్ముళ్ల విభేదాల మధ్య జిల్లా తెలుగుదేశంపార్టీ సమన్వయకమిటీ సమావేశం నేడు జరగనుంది. సోమవారం ఉదయం 10.30 గంటలకు స్థానిక ఒంగోలు డెయిరీ ప్రాంగణంలో ఈ సమావేశం జిల్లా ఇన్‌చార్జీ మంత్రి రావెల కిశోర్‌బాబు అధ్యక్షతన జరగనుంది.

07/25/2016 - 03:18

గిద్దలూరు, జూలై 24: గిద్దలూరు - నంద్యాల హైవేరోడ్డులో పాత ప్రభుత్వ వైద్యశాల సమీపంలోగల ఎస్సీ బాలికల వసతిగృహంలో మెనూ సక్రమంగా అమలు చేయించండి అన్నందుకు ఏడుగురు విద్యార్థినులను వసతిగృహ సంక్షేమాధికారి బయటకు గెంటివేసిన సంఘటన చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గిద్దలూరులోని పిఆర్‌కాలనీలోగల ప్రభుత్వ బాలసదనంలో గతంలో ఈ విద్యార్థినులు ఉంటూ విద్యను కొనసాగించేవారు.

07/25/2016 - 03:18

ఒంగోలు అర్బన్, జూలై 24: ప్రభుత్వానికి, మహిళలకు మధ్య వారధిగా పనిచేసేందుకు మంచి అవకాశం వచ్చిందని రాష్టమ్రహిళా కమిషన్ సభ్యురాలు తమ్మిశెట్టి రమాదేవి వెల్లడించారు. ఈసందర్భంగా ఆమె ఆదివారం విలేఖర్లతో మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు తమవంతు ప్రయత్నం చేస్తామన్నారు. మహిళలపై ఎక్కడ అన్యాయం జరిగినా వెంటనే నివారించి బాధితులపై కఠినచర్యలు తీసుకుని, మహిళలకు న్యాయం చేస్తామన్నారు.

07/25/2016 - 03:17

ఒంగోలు, జూలై 24: జిల్లా వ్యాప్తంగా భారీవర్షాలు కురిసి మంచినీటి చెరువులతోపాటు జలాశయాలన్నీ నీటితో కళకళలాడాల్సి ఉండగా, అందుకు భిన్నంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడటంతో మంచినీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాకు తక్షణమే నాలుగు టిఎంసిల నీరు విడుదల చేయాలని ఇటీవల రాష్ట్ర రవాణాశాఖ మంత్రి శిద్దా రాఘవరావుతోపాటు, జిల్లా యంత్రాంగం కూడా ప్రభుత్వానికి లేఖ రాశారు.

Pages