S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/24/2016 - 01:35

న్యూఢిల్లీ, జూలై 23: కాశ్మీర్ ముమ్మాటికీ భారత్‌లో అంతర్భాగమేనని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తెగేసి చెప్పారు. కాశ్మీర్‌పై పాక్ ప్రధాని నవాజ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన సుష్మ ‘ఎన్ని యుగాలైనా కాశ్మీర్ భారత్‌దే.. ఈ విషయంలో పాకిస్తాన్‌వి పగటి కలలే’నని అన్నారు. ఏదో ఒక రోజు కాశ్మీర్ పాకిస్తాన్‌లో భాగం అవుతుందంటూ నవాజ్ చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ..

07/24/2016 - 01:33

హైదరాబాద్, జులై 23: దేశవ్యాప్తంగా ఆదివారం ‘నీట్-2’ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 10నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల్లోనూ అధికారులు పగడ్బందీ ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు 9.30లోగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. 10 గంటల పరీక్షకు నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించేది లేదని చెబుతున్నారు.

07/24/2016 - 01:32

కదిరి టౌన్/ ముదిగుబ్బ, జూలై 23: అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం సంకేపల్లి క్రాస్ వద్ద శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. టవేరా వాహనాన్ని లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో మూడేళ్ల చిన్నారి కూడా ఉంది. కర్నాటకకు చెందిన వీరంతా తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్తూ మృత్యువాత పడ్డారు.

07/24/2016 - 01:28

విజయవాడ, జూలై 23: నూతన ఇన్‌చార్జి డిజిపిగా పదవి చేపట్టిన నండూరి సాంబశివరావు మర్యాద పూర్వకంగా ముఖ్యమంత్రి చంద్రబాబుని శనివారం సాయంత్రం ఆయన కార్యాలయంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా సిఎంకి పుష్పగుచ్చం అందజేశారు. నండూరి సాంబశివరావు నవ్యాంధ్రప్రదేశ్ అగ్నిమాపకశాఖ డీజిగా మెరుగైన సంస్కరణలు చేపట్టడంతోపాటు ప్రప్రథమంగా రాష్ట్ర స్థాయి అగ్నిమాపక కార్యాలయాన్ని నగరంలో ఏర్పాటు చేశారు.

07/24/2016 - 01:13

కొన్ని విషయాలు ముందుగానే తెలిసిపోతే పెద్ద ఆశ్చర్యం ఉండదు. కానీ మీడియా మిడిమేళం, నేతల హడావిడి వల్ల అలాంటి అంశాలు కూడా ఉత్కంఠగా మారుతుంటాయి. ప్రత్యేక హోదా వ్యవహారం కూడా అలాంటిదే. హోదా వస్తే తప్ప ఏపీకి తెరవు లేదని తెలుసు. కానీ కేంద్రం ఇప్పట్లో ఇవ్వదనీ తెలుసు. తెలుగుదేశం పార్టీ దానిపై ఢిల్లీని గద్దించలేని నిస్సహాయురాలనీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో విగతజీవురాలయింది.

07/24/2016 - 01:04

ఈరోజు హైదరాబాదులో 3మిత్ర2 రాసిన 3‘‘కైతల కవాతు’’2 పొత్తం ఆవిష్కరణ సభ.
3మిత్ర అనే కవిని దశాబ్దాలనుండి చూస్తున్నాం అని అనకూడదు. వింటున్నాం అనాలి. అతని పాటలు, రూపకాలు ప్రజారాశులలో అత్యంత ప్రచారం పొందాయి.

07/24/2016 - 01:02

‘‘అబ్బాయి కమల్ హాసన్ అంత అందగాడు. ఐటి కంపెనీ ఉద్యోగం
నెలకు లక్ష.. డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్స్ రెండు, బ్యాంకులో డిపాజిట్. ఐనా అమ్మాయి నో చెప్పింది’’
‘‘ఎందుకు? ’’
‘‘కబాలి మొదటి రోజు మొదటి ఆటకు టికెట్ సంపాదించగలవా? అని పెళ్లి చూపుల్లో అమ్మాయి అడిగితే నా అబ్బాయి నా వల్ల కాదు అన్నాడట! దాంతో ననే్నం సుఖపెడతావు సంబంధం క్యాన్సిల్ అంది’’

07/24/2016 - 01:00

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గడచిన రెండేళ్లుగా ఎప్పుడు మీడియాతో భేటీ అయినా, రాజకీయపరమైన సభ అయినా, కాకపోయినా, మరెలాంటి సభ అయినా కావచ్చు.. ముందుగా రెండు అంశాలను ప్రముఖంగా ప్రస్తావించడం సర్వసాధారణమైంది. ఆయన మిత్రపక్షం బిజెపి పూర్తి మద్దతుతో విభజన బిల్లును నాడు పార్లమెంట్‌లో ఆమోదం పొందింపజేసి ‘కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించింది.

07/24/2016 - 00:52

చండీగఢ్, జూలై 23: శ్రీనగర్‌లో జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వేర్పాటువాదులకు పంజాబ్ టీనేజర్ సవాల్ విసిరింది. జమ్మూకాశ్మీర్‌లో చీటికి మాటికి పాకిస్తాన్ జాతీయ పతాకాలు ఎగరవేయడాన్ని 15 ఏళ్ల ఝాన్వి బెహల్ గర్హించింది. ఆగస్టు 15న శ్రీనగర్‌లోని లాల్‌చౌక్‌లో భారత జాతీయ పతాకాన్ని ఎగరవేస్తానని, ఎవరు ఆపుతారో చూస్తానని ఆమె సవాల్ చేసింది.

,
07/24/2016 - 00:50

న్యూఢిల్లీ, జూలై 23: దేశంలో అతిపెద్ద రాష్టమ్రైన ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ శనివారం శ్రీకారం చుట్టింది. ‘27సాల్ యూపీ బేహాల్’ (27ఏళ్లలో ఉత్తర ప్రదేశ్ అస్తవ్యస్తం) అన్న నినాదంతో మూడు రోజుల బస్సు యాత్ర మొదలుపెట్టింది.

Pages