S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/23/2016 - 22:32

థియేటర్స్ లీజు, డిజిటల్ టెక్నాలజీపై చిన్న నిర్మాతలు ధర్నా చేశారు. క్యూబ్, యుఎస్‌ఒ రేట్లు తగ్గించాలని పోరాటం చేస్తున్న నిర్మాత ఆర్.కె.గౌడ్‌కు మిగతా నిర్మాతలు సంఘీభావం ప్రకటించారు. శనివారం ఉదయం హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్ దగ్గర ధర్నా నిర్వహించారు.

07/23/2016 - 18:23

చెన్నై : ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఏఎన్-32 విమానం గల్లంతై 30గంటలైనా ఆచూకీ లభించలేదు. శనివారం తాంబరం ఎయిర్‌వేస్‌కు చేరుకున్న రక్షణ మంత్రి మనోహర్ పారికర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏరియల్ సర్వే నిర్వహించారు. విమానం కోసం జరుగుతున్న గాలింపు వివరాలను తెలుసుకున్నారు. చెన్నైకి 280 కిలోమీటర్ల దూరంలో విమానం కూలిందని భావిస్తున్నా ఇప్పటి వరకు దానికి సంబంధించి ఎలాంటి జాడ దొరకలేదు.

07/23/2016 - 18:18

లూధియానా: జమ్ముకాశ్మీర్ రాజధాని శ్రీనగర్ లాల్‌చౌక్‌లో ఆగస్ట్15న భారత జెండాను ఎగరేస్తానని, దమ్ముంటే ఆపమని పంజాబ్ లూధియానాకు చెందిన 15 ఏళ్ల విద్యార్ధిని ఝాన్వీ బెహల్ సవాల్ విసిరారు. జమ్ముకాశ్మీర్ వాసుల్లో కొందరు కావాలనే భారత జెండాను అవమానిస్తూ, పాక్ జెండాలను ఎగురవేస్తున్నారని, వారికి బుద్ధి చెప్పేందుకే తాను లాల్‌చౌక్‌లో తిరంగా ఎగురవేయాలనుకుంటున్నానని చెప్పారు.

07/23/2016 - 18:13

డార్జిలింగ్: పశ్చిమ బెంగాల్ లో సంభవించిన వరదల్లో ఒక భవంతి కూలి ముగ్గురు మృతి చెందారు. మరో తొమ్మిది మంది గాయపడ్డారు. ఇందులో మరి కొంతమంది చిక్కుకున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. స్థానికులతో కలిసి పోలీసులు సహాయక చర్యలు చేపడుతున్నారు.

07/23/2016 - 18:10

హైదరాబాద్: నిబంధనలు ఉల్లంఘించిన 250 మంది వాహనదారులకు శనివారం గోషామహల్ ట్రాఫిక్ శిక్షణ కేంద్రంలో పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. కౌన్సిలింగ్‌లో ఏసీపీ జైపాల్‌ మాట్లాడుతూ, తాగి వాహనం నడుపుతూ పట్టుబడిన ఉద్యోగులను వారి ఉద్యోగాల నుంచి తొలగించాలని, విద్యార్థులు అయితే కాలేజ్ల నుంచి పంపించేలా సంబంధిత అధికారులకు లేఖలు రాస్తామని అన్నారు.

07/23/2016 - 18:06

విశాఖ: సీఎం చంద్రబాబు శనివారం బ్రాండెక్స్‌ కార్మికులతో సమావేశాన్ని నిర్వహించారు. పరిశ్రమలు అభివృద్ధి చెందాలని, కార్మికులు బాగుండాలని చెప్పారు. బ్రాండెక్స్‌ కార్మికులకు రూ.1000 పెంచేందుకు యాజమాన్యం అంగీకరించిందని తెలిపారు. జీతాల పెంపుపై కమిటీ వేశామని, కమిటీ సూచన మేరకు జీతాల పెంచుతామని ఆయన పేర్కొన్నారు.

07/23/2016 - 18:03

హైదరాబాద్: ఆగస్టు 7న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ వస్తారని బీజేపీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ తెలిపారు. ప్రధాని పర్యటన పార్టీకి ఉపయోగపడేలా మలుచుకుంటామన్నారు. మోదీ పర్యటనతో ఎస్సీ వర్గీకరణ, హైకోర్టు విభజన సమస్యలకు పరిష్కారమవడం ఖాయమని ప్రభాకర్‌ అన్నారు. హైదరాబాద్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు
బీజేపీ కార్యకర్తల సమావేశంలో మోదీ పాల్గొననున్నారని ఆయన చెప్పారు.

07/23/2016 - 18:00

పోలవరం (ప.గో): చర్చలు సఫలం కావడంతో పోలవరం ప్రాజెక్టు కార్మికులు విధులకు హాజరైనారు. పోలవరం ప్రాజెక్టు కార్మికులతో ఇంచార్జ్‌ సీఈ రమేష్‌బాబు చర్చలు సఫలమయ్యాయి. రెండు నెలల జీతాలు వెంటనే చెల్లించేందుకు, ఆగస్టు 15 నాటికి అన్ని బకాయిలు పూర్తిచేస్తామని వెల్లడించారు.

07/23/2016 - 17:45

వరంగల్‌: హౌరా ఎక్స్‌ప్రెస్‌లో కోల్‌కతా నుంచి సికింద్రాబాద్‌కు బాలకార్మికులను తరలిస్తుండగా 50 మంది బాలకార్మికులను వరంగల్‌ రైల్వే పోలీసులు పట్టుకున్నారు. బాలలను తరలిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

07/23/2016 - 17:43

ఒంగోలు: ఒంగోలు జనార్దన్‌కాలనీలో మూగ యువతిపై దుండగులు శనివారం నాడు సామూహిక అత్యాచారం చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు పై పోలీసులు బాధితురాలని వైద్య పరీక్షల కోసం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. నిందితుల కోసం పోలీసుల గాలింపు చేపట్టారు.

Pages