S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

04/10/2017 - 22:37

భిన్నమైన పాత్రలు చేసి నటీనటులుగా నిరూపించేందుకు కొందరు స్టార్‌లు గట్టి ప్రయత్నాలే చేస్తుంటారు. మరికొందరేమో.. తనకు వచ్చిన ఈ ఇమేజ్ చాలు, దాన్ని పాడుచేసుకోకుండా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తుంటారు. లేటెస్టుగా భిన్నమైన పాత్రలు చేయడానికి సిద్ధమైంది గ్లామర్ భామ రాశిఖన్నా.

04/10/2017 - 22:27

ఒక్కో హీరోయిన్ ఒక్కోలా మాట్లాడుతూ అందరినీ తికమకెపెడుతుంటారు? అసలు వాళ్లా ఎందుకు మాట్లాడారోనని అర్థం చేసుకోవడం కష్టమే. అయితే ఆ మాటల వెనుక చాలా అర్థాలే ఉంటాయన్నది తరువాత తెలుస్తుంది. కన్నడ హీరోయిన్ ఐశ్వర్యమీనన్ తెలుసుగా.. తెలుగు స్ట్రెయిట్ సినిమాల్లో కనిపించలేదు కానీ డబ్బింగ్ చిత్రాల ద్వారా బాగానే పరిచయమైంది. ఈ అందగత్తె తన మార్కెట్ పెంచుకోవడానికి కొత్త కొత్త ఐడియాలను తెరపైకి తెస్తుంది.

04/10/2017 - 22:25

ఈమధ్య హీరోయిన్స్ రెచ్చిపోతున్నారు. అందాల ఆరబోతతో ప్రేక్షకులకు పిచ్చెక్కిస్తూనే మరోవైపు అవకాశాలు పట్టేస్తున్నారు. ఒకరిని మించి ఒకరు బికినీలు, హాట్ షోలంటూ రెచ్చిపోతున్నారు. లేటెస్టుగా ఈ అమ్మడూ అందాలు ఆరబోసి షాకిచ్చింది? ఆ ఫొటోలు చూసి, మరీ ఇంతగానా? అంటూ షాక్ అవుతున్నారు జనం. ఆ అందగత్తె ఎవరో తెలుసా.. గ్లామర్ భామ సమీక్ష. గుర్తురాలేదా?

04/10/2017 - 22:21

సంక్రాంతి గడిచి మూడు నెలలవుతున్నా -తెలుగు పరిశ్రమలో పెద్ద హిట్టంటూ ఒక్కటీ పడలేదు. బాలకృష్ణ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’, చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ మంచి టాక్ తెచ్చుకున్నాయి. తరువాత వేసవి సీజన్‌ను టార్గెట్ చేస్తూ వచ్చిన సినిమాలూ అదే ఫలితాన్ని ఆశించాయి. కానీ, ఆశాభంగమే అయ్యింది. గతంలో అయితే, వేసవి సీజన్ సినిమాలను విద్యార్థుల పరీక్షలు దృష్టిలో పెట్టుకుని థియేటర్లకు తీసుకొచ్చేవారు.

04/10/2017 - 21:03

కళ్లున్నోడు సినిమా చూస్తాడు. దునియా ఉన్నోడు -సినిమా చూపిస్తాడు.
అయోధ్యకుమార్ రెండోదే చేశాడు. చీకటిలో మిణుకుమిణుకు మంటున్న వెల్తుర్ని సినిమా చేసి దర్శకుడయ్యాడు. తలెత్తుకునే చిన్న సినిమా నిర్మించి తరువాతి తరానికి -దార్శనికుడయ్యాడు. కొంచెం కొత్తదనం. కొండంత చిక్కదనం. ఇదీ అతని సిగ్నేచర్. 2012 క్యాటగిరీలో ఏడు నందులు సాధించిన ‘మిణుగురులు’కు ఇతను దివిటీ.

04/10/2017 - 20:56

అందమైన చిరునవ్వు -స్వాతి. అందం.. అమాయకత్వం.. కొంటెతనం.. అల్లరితనం.. ఒకటేమిటి ఎన్నో షేడ్స్‌ను అలవోకగా పలికించి మెప్పించిన హీరోయిన్. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి కూడా. కాకపోతే, చాలాకాలంగా స్క్రీన్‌కు దూరంగానే ఉండిపోయింది. చేసినవి కొన్ని చిత్రాలైనా గుర్తింపు కలిగిన పాత్రల్లో కనిపించిన స్వాతి -‘త్రిపుర’ తరువాత మళ్లీ సినిమా చేయలేదు.

04/10/2017 - 20:54

భారత జాతీయ పతాకాన్ని రూపకల్పన చేసిన వ్యక్తి, తెలుగువారంతా గర్వించే మహానుభావుడు పింగళి వెంకయ్య. దేశభక్తి గీతం ‘వందేమాతరం’ రచించినది బంకించంద్ర చటోపాధ్యాయ. దేశ ప్రజలంతా గౌరవించే జాతీయ గీతం ‘జనగణమన’ రచించింది విశ్వకవి రవీంద్రనాథ్ ఠాకూర్. ఈ ముగ్గురు మహానుభావుల గురించి తెలియచేస్తూ నిర్మించిన తెలుగు డాక్యుమెంటరీ చిత్రం ‘్భరత కీర్తిమంతులు’.

04/10/2017 - 20:52

కొత్త అందాలను స్క్రీన్‌కు తీసుకురావడం తెలుగు పరిశ్రమ తరువాతే ఎవరైనా. కాస్త నదురుగా కనిపిస్తే చాలు, రెమ్యూనరేషన్ భారీగా ఆఫర్ చేసైనా తెలుగు తెరకు తరలించుకు వస్తారు. ఇటీవలి కాలంలో తమిళ, కన్నడ పరిశ్రమల నుంచే కాదు, మరాఠీ హీరోయిన్లూ తెలుగు స్క్రీన్‌పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా మరాఠీలో మంచి పేరు తెచ్చుకుంటున్న వైభవి శాండిల్య కూడా తెలుగు తెరకు త్వరలోనే పరిచయం కాబోతోంది.

04/10/2017 - 20:50

పదహారణాల తెలుగు చిత్రం. చారిత్రక అంశంతో కూడిన కథ కావడంతో తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసిన చిత్రం. ఆనాటి కళాకారులు -తెలుగువారి శాసనాన్ని ఏకం చేయటానికే అన్నట్టు కలిసికట్టుగా పనిచేసి విజయపతాక ఎగురవేసిన చిత్రం. అదే -శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు కథ.

04/10/2017 - 20:48

కొన్ని పాటలు వినడానికి బావుంటాయి. కొన్ని పాటలు వినేకొద్దీ బావుంటాయి. కొన్ని పాటలుంటాయి. అవి ఒక్కసారి వింటే -జీవితమంతా వెంటాడుతుంటాయి. అది ఆ పాటలోని శబ్ద సౌందర్యం కావొచ్చు. భాషా సొగసు కావొచ్చ. సంగీత మాధుర్యం కావొచ్చు. ఇవన్నీ సరైన సమపాళ్లలో అమిరిన పాట మాత్రం -ఎప్పటికీ మనల్ని వీడిపోదు. అలాంటి వాటిలో ‘తూర్పుపడమర’ చిత్రంలోని ‘శివరంజని నవరాగిణి’ పాటను ప్రస్తావించుకోవచ్చు.

Pages