S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/06/2016 - 00:36

బిక్కవోలు, డిసెంమర్ 5: బిక్కవోలు శ్రీకుమార సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి షష్ఠి మహోత్సవం సోమవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామి వారి తీర్థాన్ని వీక్షించడానికి జిల్లా నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వచ్చారు. సోమవారం తెల్లవారు జాము నుంచి ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచి గోదావరి కాలువలో స్నానఘట్టాలు భక్తులతో నిండిపోయాయి.

12/06/2016 - 00:35

రావులపాలెం, డిసెంబర్ 5: భూసారాన్ని పెంపొందించుకునేందుకు రైతులు సేంద్రీయ ఎరువుల వాడకాన్ని అలవరచుకోవాలని ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు. ప్రపంచ నేల దినోత్సవం సందర్భంగా సోమవారం రావులపాలెం అరటి మార్కెట్ యార్డులో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని నాలుగు మండలాల రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.

12/06/2016 - 00:35

కాకినాడ సిటీ, డిసెంబర్ 5: జిల్లాలో సింగిల్ డెస్క్ పాలసీలో పరిశ్రమల అనుమతులకు దరఖాస్తుచేసుకున్న వారికి సకాలంలో అనమతులు ఇవ్వాలని సంబంధిత శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్ కోర్టుహాలులో సోమవారం సాయంత్రం జిల్లా పరిశ్రమ ప్రమోషన్ కమిటీ సమావేశం జిరిగింది.

12/06/2016 - 00:33

అత్తిలి, డిసెంబర్ 5 : అత్తిలిలో శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణం అనంతరం ఆదివారం రాత్రి నుంచే స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. అత్తిలి మాజీ ఎమ్మెల్యే చెరకువాడ శ్రీరంగనాథరాజు (రంగరాజు) స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలోని నాగేంద్రుని విగ్రహానికి భక్తులు పూజలు జరిపారు.

12/06/2016 - 00:33

భీమవరం, డిసెంబర్ 5: రానున్న 2019 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని టిడిపి అధిష్ఠానం సభ్యత్వ నమోదుపై ప్రత్యేక దృష్టిసారిస్తే, జిల్లాలో మాత్రం సభ్యత్వ నమోదు అంతంతమాత్రంగా సాగుతోంది. నవంబర్ 30 నాటికి సభ్యత్వ నమోదు కార్యక్రమం ముగియాల్సివుండగా మరో పక్షం రోజులు పెంచారు. డిసెంబర్ 15తో సభ్యత్వ నమోదు ముగుస్తుంది. అయితే గత ఏడాది కన్నా ఈ ఏడాది సభ్యత్వ నమోదు మందగించిందని చెప్పవచ్చు.

12/06/2016 - 00:32

ద్వారకాతిరుమల, డిసెంబర్ 5: శ్రీవారికి భక్తులు సమర్పించే తలనీలాల టిక్కెట్ల రుసుము పెరగనుంది. ఇప్పటి వరకు రూ.10 ఉన్న టిక్కెట్టు రూ.15లకు పెంచేందుకు చిన వెంకన్న ట్రస్టు బోర్డు గతంలోనే నిర్ణయించగా రెండు రోజుల క్రితం రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ వైవి అనూరాధ ఆమోద ముద్రవేశారు. దీంతో ప్రస్తుతం రూ.10లు ఉన్న పూర్తిక్షవరం, మూడు కత్తెరింపుల టిక్కెట్ల ధరలు రూ.15కు పెంచుతున్నారు.

12/06/2016 - 00:31

ఏలూరు, డిసెంబర్ 5 : పెద్దనోట్ల రద్దు నేపధ్యంలో గత రెండు మూడు వారాలుగా సాగుతున్న నోట్ల కష్టాలు సా...గుతూనే వున్నాయి. సోమవారం కూడా సగం మంది జనం బ్యాంకులు, ఎటి ఎంల వద్దే క్యూలలో నిలబడి సగం పనిదినాన్ని కానిచ్చేశారు. దీనికి తోడు టోల్‌గేట్ల ఇబ్బందులు కూడా తోడయ్యాయి.

12/06/2016 - 00:31

తాడేపల్లిగూడెం, డిసెంబర్ 5: పంటలకు అధిక దిగుబడులు, ఆదాయం వచ్చేందుకు భూసారం పెంచుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు పేర్కొన్నారు. సోమవారం రూరల్ మండలం వెంకట్రామన్నగూడెం డాక్టర్ వైఎస్‌ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో ప్రపంచ నేలల దినోత్సవం, కిసాన్ సమ్మేళన్ కార్యక్రమం జరిగింది.

12/06/2016 - 00:30

జంగారెడ్డిగూడెం, డిసెంబర్ 5: పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో నెలకొన్న నగదు కొరతతో పింఛనుదారుల తలరాతలు మారడంలేదు. ఐదు రోజులైనా పింఛన్ల కోసం బ్యాంకుల చుట్టూ కాళ్లు అరిగేలా వృద్ధులు, వికలాంగులు, వితంతువులు తిరుగుతూనే ఉన్నారు. బ్యాంకుల్లో ఊపిరాడని పరిస్థితి నెలకొంటే, నేటికీ ఎటిఎంలు తెరుచుకోలేదు. నగదు కోసం ఖాతాదారులతో పాటు పింఛన్ల కోసం వృద్ధులు, వికలాంగులు, వితంతువులు అనేక అగచాట్లు పడుతున్నారు.

12/06/2016 - 00:30

ఏలూరు, డిసెంబర్ 5 : జిల్లాలో సంక్షేమ హాస్టల్స్‌లో మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి హాస్టల్స్‌ను మరింత పటిష్టవంతంగా నిర్వహించడానికి 47 మంది స్పెషల్ ఆఫీసర్లను నియమించామని, ప్రతీ వారం అధికారి హాస్టల్‌లో రాత్రి మకాం చేసి విద్యార్ధినీ విద్యార్ధులో మమేకం కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం జిల్లాస్థాయి అధికారుల సమన్వయ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు.

Pages