S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/23/2018 - 02:38

గుంటూరు, మార్చి 22: రాష్ట్రంలో బలహీనవర్గాల సంక్షేమానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఉప్పుపాతర వేశారని మంత్రి అచ్చన్నాయుడు మండిపడ్డారు. తమ ప్రభుత్వం బీసీల సంక్షేమానికి అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని పదేళ్ల క్రితం నిర్వీర్యమైన ఆదరణ పథకాన్ని 750 కోట్లతో పునరుద్ధరించి కులవృత్తుల వారికి అండగా నిలిచిందన్నారు. బీసీ కార్పొరేషన్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని విమర్శించారు.

03/23/2018 - 02:37

గుంటూరు, మార్చి 22: పట్టిసీమతో పాటు పోలవరం ప్రాజెక్టు పనుల్లో నిబంధనల మేరకే కాంట్రాక్టు సంస్థలకు చెల్లింపులు జరిపామని జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి పారుదల వ్యవస్థను వైఎస్ హయాంలో నిర్వీర్యం చేశారని, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పవిత్ర సంగమం ద్వారా పట్టిసీమతో కృష్ణాడెల్టాను ఆదుకుందని తెలిపారు.

03/23/2018 - 01:33

విశాఖపట్నం, మార్చి 22: రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం రాష్టవ్య్రాప్తంగా గురువారం తలపెట్టిన జాతీయ రహదారుల దిగ్బంధం విజయవంతమైంది. విశాఖలోని హనుమంతవాక, మద్దిలపాలెం, సీతమ్మధార, ఎన్‌ఏడీ కొత్తరోడ్డు ప్రాంతాల్లో అఖిలపక్ష నాయకులు జాతీయ రహదారిపై బైఠాయించి హోదా కోసం నినదించారు.

03/23/2018 - 01:17

అమరావతి, మార్చి 22: అవిశ్వాసం చేపట్టకుండా కేంద్రం పదేపదే వాయిదాలు వేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే వాయిదాల పర్వాన్ని కొనసాగిస్తున్నారనేది ప్రజలు గమనిస్తున్నారన్నారు. గురువారం ఉదయం ఆయన ఎంపీలు, మంత్రులు, వ్యూహబృందంతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్రం ప్రవర్తన గత కొంతకాలంగా భిన్నంగా ఉందని, ఆంధ్రప్రదేశ్‌ను ఇబ్బంది పెట్టాలని చూస్తోందన్నారు.

03/23/2018 - 01:24

పలాస, మార్చి 22: సాంకేతిక లోపంతో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన హెలికాప్టర్ శ్రీకాకుళం జిల్లా, సోంపేట మండలం, శారదాపురం గ్రామ సమీపంలోని పొలాల్లో గురువారం ల్యాండైంది. ఈ హెలికాప్టర్ పశ్చిమ బెంగాల్‌లోని బొకార్‌పూర్ నుంచి చెన్నైకు వెళ్తుండగా మార్గమధ్యలో సాంకేతిక లోపాన్ని గుర్తించిన పైలట్‌లు గురుప్రీత్‌సింగ్, ప్రశాంత్, కిరణ్‌ఠాకూర్ అత్యవసరంగా ఇక్కడి పంట పొలాల్లో దించారు.

03/23/2018 - 01:13

విజయవాడ, మార్చి 22: తెలుగు వైభవాన్ని ప్రతిబింబించే శిల్పారామాలు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నామని ఏపీ పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి భూమా అఖిలప్రియ తెలిపారు. గతంలో హైదరాబాద్‌లో మాత్రమే ఉన్న శిల్పారామాన్ని విభజన తర్వాత ఇక్కడ అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంకల్పించారన్నారు.

03/23/2018 - 01:11

అడ్డతీగల, మార్చి 22: తన సహ చిరుద్యోగి బిల్లులు ఖజనా కార్యాలయానికి సమర్పించడానికి రూ.11వేలు లంచం తీసుకుంటున్న ఐసీడీఎస్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్‌ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు వలపన్ని పట్టుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా అడ్డతీగల ఐసీడీఎస్ కార్యాలయంలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలిలావున్నాయి...

03/23/2018 - 00:03

విజయవాడ, మార్చి 22: ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర శాసన మండలిలో సభ్యులు గురువారం నీటి సంరక్షణ ప్రతిజ్ఞ చేశారు. తొలుత ముందుగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రతిజ్ఞ చేసేందుకు సిద్ధమై వచ్చారు. కానీ ఆ తరువాత ఆ ప్రతిని మండలి చైర్మన్ ఎన్‌ఎండి ఫరూఖ్‌కు ఇచ్చి, ఆయనను చేయించమనన్నారు. చైర్మన్ ప్రతిజ్ఞను చదువగా, సీఎం సహా సభ్యులందరూ ప్రతిజ్ఞ చేశారు.

03/23/2018 - 00:03

విజయవాడ, మార్చి 22: భవిష్యత్తులో రాష్ట్రానికి బీజేపీ నుంచి మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉందన్న అభిప్రాయాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఆవరణలో గురువారం మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్‌లో పరిస్థితి చూస్తుంటే, విభజన నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు.

03/23/2018 - 00:02

విజయవాడ, మార్చి 22: ప్రత్యేక హోదా సాధనలో పొడిచేస్తానని బయల్దేరిన జనసేన నేత పవన్ కళ్యాణ్ ఉత్తర కుమారుడిలా ఎందుకు తోకముడిచారో ప్రజలకు చెప్పాలని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఆవరణలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అవిశ్వాసం పెడితే సంఖ్యాబలం కూడగడతానని ఘోషించిన పెద్దమనిషి, ప్రత్యేక హోదా కోసం ఆమరణ దీక్షకైనా సిద్ధమని చెప్పిన వ్యక్తి ఇప్పుడేమైపోయారని ప్రశ్నించారు.

Pages