S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/03/2016 - 05:26

హైదరాబాద్, ఆగస్టు 2: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి తుంగలో తొక్కిన బిజెపి వైఖరిని చూసి ఐదు కోట్ల ఆంధ్రుల రక్తం మరుగుతోందని వైకాపా అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదాను ఆంధ్రాకు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఇచ్చిన రాష్ట్ర బంద్ పిలుపు విజయవంతమైందన్నారు.

08/02/2016 - 18:00

విజయవాడ : అనంతపురం పట్టణానికి చెందిన ఓ వ్యక్తిపై గన్నవరం విమానాశ్రయం వద్ద మంగళవారం హత్యాయత్నం జరిగింది. ఎవరో ఉద్దేశపూర్వకంగానే అతడి గొంతు కోసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతపురం నుంచి నెల్లూరు వెళ్లేందుకు బాధితుడు అశోక్‌ లారీ ఎక్కాడని, గన్నవరం వరకు తీసుకొచ్చి గొంతు కోసినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది.

08/02/2016 - 17:43

తిరుపతి : కృష్ణా పుష్కరాల సందర్భంగా విజయవాడలో శ్రీవారి నమునా ఆలయం, రోజుకు లక్షమంది భక్తులు దర్శనం చేసుకునేలా టీటీడీ ఏర్పాట్లు చేయనుంది. బుధవారం పుష్కర యాత్ర తిరుమలలో ప్రారంభమై 7వ తేదీకి విజయవాడకు చేరనుంది. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి మంగళవారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

08/02/2016 - 17:38

విశాఖ : పరవాడలో జూనియర్‌ ఆర్టిస్టుల ఏజెంట్లు తనపై దాడి చేశారంటూ సినీ నిర్మాత అచ్చిబాబు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మంచు మనోజ్‌ కథానాయకుడుగా అచ్చిబాబు నిర్మాణంలో సినిమాకు సంబంధించి పరవాడలో కొద్ది రోజులుగా షూటింగ్‌ జరుగుతోంది.

08/02/2016 - 17:35

గుంటూరు : బొల్లాపల్లి మండలం మేళ్లవాగు వద్ద ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను ఎదురుగా వచ్చిన ఆయిల్‌ ట్యాంకర్‌ ఢీకొని వద్దాలపు నాగరాజు అనే యువకుడు మృతిచెందాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఆయిల్‌ ట్యాంకర్‌ కూచనపల్లి వద్ద అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో డ్రైవర్‌ తీవ్రంగా గాయపడ్డాడు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

08/02/2016 - 17:29

విశాఖ: అల్పపీడనంతో రుతుపవనాలు చురుగ్గా మారనున్నాయి. తూర్పు మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర బంగాళాఖాతంలో స్థిరంగా ఉంది. దీనిపై ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. రెండు రోజుల్లో ఇది బలపడి తీవ్ర అల్పపీడనంగా మారి, పరిస్థితులను బట్టి వాయుగుండంగా మారవచ్చని అంచనా. కోస్తాలో పలుచోట్ల భారీనుంచి అతిభారీ వర్షాలు , రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

08/02/2016 - 17:26

అనంతపురం: ఉరవకొండ మండలం పెద్దమొస్తూరులో ఫ్యాక్షన్ గొడవలతో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ దాడిలోఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి.. మరోముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. పొలంలో పిల్లలు వేరుశనగ మొక్కలు తొక్కారని ఈ ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఇరువర్గీయులను చెదరగొట్టి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

08/02/2016 - 12:50

తిరుపతి : తితిదే అధ్యక్షుడు చదల వాడ కృష్ణమూర్తి అధ్యక్షతన తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశం మంగళవారం ప్రారంభమైంది. ఈవో సాంబశివరావు, పాలకమండలి సభ్యులు కె.రాఘవేంద్రరావు, జె.శేఖర్‌, ఏవీరమణ, భానుప్రకాశ్‌రెడ్డి, యల్లా సుచిత్ర, కృష్ణమూర్తి సమావేశానికి హాజరయ్యారు. అజెండాలోని 22 అంశాలకు సంబంధించి చర్చిస్తున్నారు.

08/02/2016 - 12:02

విజయవాడ: ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విపక్షాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం ఉదయం నుంచి బంద్ కొనసాగుతోంది. వైకాపా, వామపక్ష పార్టీలు బంద్‌కు పిలుపు ఇవ్వగా కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. విజయవాడ, విశాఖ, రాజమండ్రి, కాకినాడ, విజయనగరం, అనంతపురం, కడప, కర్నూలు, ఒంగోలు, శ్రీకాకుళం తదితర ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచే ఆర్టీసీ బస్సులను ఆందోళనకారులు అడ్డుకున్నారు.

08/02/2016 - 11:51

గుంటూరు : పొన్నూరు తెదేపా ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఒక రోజు నిరసన దీక్ష చేపట్టారు. దీక్షకు మద్దతు తెలిపేందుకు తెదేపా శ్రేణులు భారీగా తరలివచ్చారు. పొన్నూరులోని ఆచార్య ఎన్జీరంగా విగ్రహం వద్ద సాయంత్రం 5గంటల వరకు దీక్ష కొనసాగనుంది. ప్రత్యేక హోదాపై కేంద్రం స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని నరేంద్రడిమాండ్‌ చేశారు.

Pages