S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

10/09/2016 - 04:27

హైదరాబాద్, అక్టోబర్ 8: కుల రాజకీయాలకు కేంద్రమైన ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ విజయం సాధించేందుకు తెదేపా అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుల ఓటు బ్యాంకులను తయారుచేసుకునే పనిలో ఉన్నారు. ఎన్నికల్లో విజయాన్ని ప్రభావితం చేసే కొన్ని కులాలపై దృష్టి సారిస్తున్నారు. వారికి నిధులు, కొత్తగా కార్పొరేషన్లు ఏర్పాటుచేయడం ద్వారా రానున్న ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చే ప్రణాళికకు పదును పెడుతున్నారు.

10/09/2016 - 04:26

విశాఖపట్నం, అక్టోబర్ 8: ఎస్సీ, ఎస్టీలు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు జాతీయ బ్యాంకులు సహకరించట్లేదని ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ ఆరోపించారు. జిల్లా పర్యటనలో భాగంగా ప్రభుత్వ అతిధిగృహంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వీరు ఆర్థికంగా అభివృద్ధి సాదించడంలో బ్యాంకులు అవరోధంగా మారాయని విమర్శించారు.

10/09/2016 - 04:26

విశాఖపట్నం, అక్టోబర్ 8: ఒడిశా పరిసర ప్రాంతాలను ఆనుకుని ఏర్పడిన ఉపరితల ఆవర్తనం శనివారం కూడా కొనసాగుతోంది. ఇది నైరుతి బంగాళాతంవైపుగా వాలి ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. ఇది సముద్ర ఉపరితలానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఆవర్తనం ఏర్పడిందని తెలిపారు. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తాంధ్రలో పలు చోట్ల వర్షం కురియవచ్చు.

10/09/2016 - 04:25

కర్నూలు సిటీ, అక్టోబర్ 8: కర్నూలు నగర శివారులోని అనుటెక్ గ్లిజరిన్ పరిశ్రమలో శనివారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కూలింగ్ రియాక్టర్‌లో రసాయన పదార్థం లీక్‌కావడంతో ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఆస్తినష్టం భారీగా ఉంటుందని భావిస్తున్నారు. తుంగభద్రనది ఆవలి ఒడ్డున ఉన్న అనుటెక్ గ్లిజరిన్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం సంభవించడంతో మంటలు ఎగిసిపడ్డాయి.

10/08/2016 - 06:39

హైదరాబాద్, అక్టోబర్ 7: పోతిరెడ్డిపాడు ద్వారా ఆంధ్రప్రదేశ్ జల చౌర్యానికి పాల్పడుతోందని తెలంగాణ చేసిన ఫిర్యాదుతో కృష్ణా యజామాన్య బోర్డు ఉమ్మడి పర్యవేక్షణ ఏర్పాటు చేసింది. ఉమ్మడి పర్యవేక్షణ మంచి ఫలితాలను ఇస్తోందని తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు.

10/08/2016 - 06:35

హైదరాబాద్, అక్టోబర్ 7: తెలుగు రాష్ట్రాల్లో ఐదో తరగతి నుండి విద్యారంగంలో అన్ని అంశాల్లోనూ ఆధార్‌నే ఆధారంగా చేసుకోవాలని రెండు ప్రభుత్వాలూ నిర్ణయించాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రతి విద్యార్థి ఆధార్ సంఖ్య ఆధారంగానే ప్రవేశపరీక్ష నిర్వహణ, అడ్మిషన్లు, స్కాలర్‌షిప్ మంజూరు, అటెండెన్స్ పర్యవేక్షణ కూడా కొనసాగనుంది.

10/08/2016 - 06:33

తిరుపతి, అక్టోబర్ 7: ముగ్ధమనోహర రూపంతో శ్రీ స్వామివారు మోహినీ అవతారంలో శ్రీ కృష్ణుడు వెంటరాగా తిరుమల మాడ వీధులలో ఊరేగుతూ భక్తులను సమ్మోహితులను చేశారు. తిరుమలలో జరుగుతున్న నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజైన శుక్రవారం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు శ్రీ స్వామివారు మోహినీ అవతారంలో భక్తులకు అభయప్రదానం చేశారు.

10/08/2016 - 06:32

విజయవాడ, అక్టోబర్ 7: ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న శ్రీ దుర్ముఖనామ సంవత్సర దసరా మహోత్సవాల్లో ఏడో రోజైన ఆశ్వయుజ శుద్ధ షష్టి శుక్రవారం కావటంతో మహిళలకు ఎంతో ప్రీతిపాత్రమైన బెజవాడ దుర్గమ్మ శ్రీ మహాలక్ష్మిదేవిగా ఆశీనులై భక్తజనానికి దర్శనమిచ్చింది. దసరా సెలవులు.. అన్నింటిని మించి మహిళలకు పవిత్రమైన దినం కావటంతో తెల్లవారుఝాము నుంచే వేల సంఖ్యలో భక్తులు ఆబాల గోపాలంతో క్యూలైన్లలో బారులు దీరారు.

10/08/2016 - 06:14

పెదవేగి, అక్టోబర్ 7 : పాఠశాలకు వెళ్లలేదనే కారణంతో కన్నతండ్రి తీవ్రం గా కొట్టడంతో ఒక బాలిక మృతిచెందింది. మృతదేహాన్ని రహస్యంగా ఖననంచేసిన ఆ కిరాతకుడు విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని భార్యను కూడా బెదిరించాడు. గత నెల 22వ తేదీన చోటుచేసుకున్న ఈ ఘటన గురువారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది.

10/08/2016 - 06:14

జంగారెడ్డిగూడెం/ కొయ్యలగూడెం, అక్టోబర్ 7: కుటుంబ కలహాలతో ముక్కుపచ్చలారని ఇద్దరు చిన్నారులకు విషమిచ్చి, తాను కూడా విషం తాగి ఆత్మహత్యకు పాల్పడిన తండ్రి ఉదంతమిది. తండ్రి, రెండేళ్ల కుమార్తె మృతిచెందగా, ఏడు నెలల పసికందైన మరో కుమార్తె మృత్యువుతో పోరాడుతోంది. ద్వారకాతిరుమల మండలం దోరసానిపాడుకు చెందిన లక్కాబత్తుల లూథిరాజుకు, కొయ్యలగూడెం మండలం రామానుజపురానికి చెందిన స్వాతికి మూడేళ్ల క్రితం వివాహమైంది.

Pages