S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

10/07/2016 - 02:59

ఏలూరు, అక్టోబర్ 6 : రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను పూర్తిస్థాయిలో ఆధునికీకరించడమే కాక, ప్రజలకు సేవే లక్ష్యంగా సిబ్బంది పనిచేసేలా సంస్కరణలు అమలుచేస్తున్నట్లు రాష్ట్ర డిజిపి ఎన్ సాంబశివరావు తెలిపారు. దీనిలో భాగంగా రాష్ట్రంలో త్వరలో మోడల్ పోలీస్‌స్టేషన్ల ఏర్పాటుతో పాటు డిజిటల్ వాచ్‌కు సన్నాహాలుచేస్తున్నామన్నారు. అలాగే మొబైల్ కంట్రోల్ రూం ఏర్పాటుపై ప్రధానంగా దృష్టి పెట్టామన్నారు.

10/07/2016 - 02:58

విశాఖపట్నం, గూడెంకొత్తవీధి, అక్టోబర్ 6: విశాఖ ఏజన్సీ గూడెంకొత్తవీధి మండలంలో బుధవారం సాయంత్రం మావోయిస్టులు, గ్రేహౌండ్స్ బలగాల మధ్య హోరాహోరీ ఎదురుకాల్పులు జరిగాయి. ఈసంఘటనలో ముగ్గురు మావోయిస్టులకు గాయాలయ్యాయి. గురువారం ఉదయం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గూడెంకొత్తవీధి మండలంలోని పెదపాడు, కుంకుపూడి అటవీ ప్రాంతంలో మావోయిస్టుల సమావేశమయ్యారని పోలీసులకు సమాచారం అందింది.

10/07/2016 - 02:56

కొల్లిపర, అక్టోబర్ 6: ప్రముఖ కాంగ్రెస్ నేత, రాజకీయ దురంధరుడు, నాలుగుసార్లు గుంటూరు జిల్లా దుగ్గిరాల నియోజకవర్గం నుండి ఎన్నికైన మాజీ శాసనసభ్యుడు గుదిబండి వెంకటరెడ్డి (74) గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కొద్ది రోజులుగా తీవ్ర అస్వస్థతతో గుంటూరులోని ప్రైవేటు వైద్యశాలలో ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రజల సందర్శనార్థం గుదిబండి పార్థివదేహాన్ని కొల్లిపరలోని స్వగృహంలో ఉంచారు.

10/07/2016 - 02:55

అనకాపల్లిరూరల్, అక్టోబర్ 6: విశాఖ జిల్లా రూరల్ అనకాపల్లి పరిధి తుమ్మపాల సుగర్ ఫ్యాక్టరీ మూసివేత దిశగా వెళ్తోంది. ఇక్కడకు వచ్చే చెరకును సమీపంలోని ఏటికొప్పాక సుగర్ ఫ్యాక్టరీకి తరలించాలని రాష్ట్ర సుగర్స్ డైరక్టర్ నుండి ఈ మేరకు సమాచారం అందినట్లు తెలిసింది. దీంతో కార్మికులు, రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

10/07/2016 - 02:54

ఒంగోలు/నెల్లూరు , అక్టోబర్ 6:ప్రకాశం జిల్లా ఇన్‌చార్జి డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ కె రాంప్రసాద్ ఇంటిపై అతని బంధువుల ఇళ్ళపై గురువారం ఉదయం నుంచి ఏకకాలంలో అవినీతి నిరోధకశాఖాధికారులు ముమ్మరంగా దాడులు నిర్వహించారు. రాంప్రసాద్ సొంత ఇళ్ళపైనే కాకుండా ఒంగోలు, వినుకొండ, నెల్లూరులో ఉన్న ఆయన బంధువుల ఇళ్ళపైన, ఒంగోలులోని ఆర్‌టిఒ కార్యాలయంలోను సోదాలు నిర్వహించి కీలకమైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

10/07/2016 - 02:52

విశాఖపట్నం (గోపాలపట్నం), అక్టోబర్ 6: గల్లంతైన ఎయిర్‌ఫోర్స్ విమానం ఎఎన్ 32తో పాటు తమవారి జాడ తెలియక గత మూడు నెలలుగా మానసిక క్షోభకు గురైన ఎన్‌ఎడి ఉద్యోగుల కుటుంబాలను ఉన్నతాధికారులు ఒక్కసారిగా నైరాశ్యంలోకి నెట్టేశారు.

10/07/2016 - 02:51

మడకశిర, అక్టోబర్ 6: సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈనెల 17వ తేదీ వరకు తమిళనాడు రాష్ట్రానికి కావేరి నదీజలాలు విడుదల చేయనున్నట్లు కర్నాటక రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కృష్ణ బైరేగౌడ్ తెలిపారు. గురువారం అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, తమిళనాడు, కర్నాటక ప్రజలు ఎవరూ కావేరి జలాల కోసం ఘర్షణలు జరగాలని కోరుకోవడం లేదన్నారు.

10/07/2016 - 02:50

విశాఖపట్నం, అక్టోబర్ 6: పరవాడలోని జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీ (జెఎన్‌పిసి)లో ఒక ఔషధ కంపెనీలో సుమారు 2.6 కోట్ల రూపాయల విలువ చేసే అనుమతి లేని మాదక ఔషధాన్ని ఔషధ నియంత్రణ మండలి అధికారులు బుధవారం దాడి చేసి స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఈ ఔషధాన్ని తయారు చేసేందుకు ఫార్మాసిటీలో గల ఆ ఔషధ కంపెనీకి అనుమతి లేదు.

10/07/2016 - 02:50

మండపేట, అక్టోబర్ 6: కాపులను బీసీల్లో చేర్చాలనే డిమాండుతో త్వరలో శాంతియుత ఉద్యమానికి కార్యాచరణ రూపొందిస్తున్నామని మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తెలిపారు. కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల ముందు హామీయిచ్చిన చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చాక కరివేపాకులా తీసిపారేస్తున్నారని ఆరోపించారు.

10/07/2016 - 02:45

హైదరాబాద్, అక్టోబర్ 6: నవ్యాంధ్ర రాజధాని నగర కమిటీ అధ్యక్షుడిని సస్పెండ్ చేస్తూ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు తీసుకున్న నిర్ణయంపై ఆ పార్టీలో అగ్గి రాజుకుంది.

Pages