S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

06/19/2017 - 03:32

విశాఖపట్నం, జూన్ 18: ప్రశాంత విశాఖ నగరంలో ఉద్రిక్తతతలకు తెరతీసే కార్యక్రమాలకు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నిస్తున్నాయన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. విశాఖ భూ కుంభకోణంపై సిబిఐ దర్యాప్తు జరపాలన్న ప్రధాన డిమాండ్‌తో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 22న విశాఖ కలెక్టర్ కార్యాలయం ఎదుట మహా ధర్నా నిర్వహించాలని నిర్ణయించింది. రెండు రోజుల కిందటే ఆ పార్టీ ప్రతినిధులు ఈ విషయాన్ని ప్రకటించారు.

06/19/2017 - 03:30

పుట్టపర్తి, జూన్ 18 : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వైద్య పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ పూనం మాలకొండయ్య తెలిపారు. ఆమె ఆదివారం అనంతపురం జిల్లాలోని పుట్టపర్తిలో సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. అలాగే సత్యసాయి జనరల్ ఆసుపత్రి, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను సందర్శించి అక్కడ రోగులకు అందిస్తున్న వైద్య సేవల గురించి తెలుసుకుని అభినందించారు.

06/19/2017 - 03:28

కుప్పం, జూన్ 18: చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ప్రవహిస్తున్న పాలారు నదిపై ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న చెక్‌డ్యాంలను వెంటనే నిలిపివేయాలని తమిళనాడు రాష్ట్ర డిఎంకె అధ్యక్షుడు స్టాలిన్ డిమాండ్ చేశారు.

06/19/2017 - 03:26

విజయవాడ, జూన్ 18: రాజధాని అమరావతిలోనే అభివృద్ధిని కేంద్రీకరిస్తే ప్రత్యేక తెలంగాణ మాదిరిగా రాష్ట్రంలో మరో ఉద్యమం ఊపిరి పోసుకోవడం ఖాయమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ హెచ్చరించారు. వెనుకబడిన జిల్లాలపై కూడా ప్రభుత్వం దృష్టిని సారించాలని హితవు పలికారు. పార్టీ రాష్ట్ర కార్యాలయం దాసరి భవన్‌లో ఆదివారం ఆయన పార్టీ కార్యదర్శివర్గ సభ్యుడు పుట్టా హరినాథరెడ్డితో కలిసి విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.

06/19/2017 - 03:25

తిరుపతి, జూన్ 18: వేసవి సెలవులు ముగుస్తున్నప్పటికీ శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య ఏమాత్రం తరగడం లేదు. ఆదివారం సర్వదర్శనానికి 12 గంటలు, కాలినడక భక్తులకు 10 గంటల సమయం పడుతోంది. ఆదివారం తెల్లవారుజాము 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 68,912 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. మరో 30 వేల మంది స్వామివారి దర్శనంకోసం వేచి ఉన్నారు.

06/19/2017 - 03:33

గుంటూరు, జూన్ 18: ప్రభుత్వ ఉద్యోగులకు పిఆర్‌సి వేతన బకాయిలపై కమిటీని నియమించేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చిందని, దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఏపి ఎన్జీవో జెఎసి అధ్యక్షుడు పి అశోక్‌బాబు తెలిపారు. ఆదివారం గుంటూరు జిల్లా ఎన్జీవో అసోసియేషన్ హాలులో జిల్లా నూతన కార్యవర్గ ఎన్నిక జరిగింది.

06/19/2017 - 02:36

కాకినాడ, జూన్ 18: కేంద్ర ప్రభుత్వం నేరుగా మంజూరు చేసిన వివిధ కీలక సంస్థల ఏర్పాటుతో తూర్పు గోదావరి జిల్లాకు మహర్దశ పట్టనుంది. గతంలో లేని విధంగా కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక సహకారంతో కొన్ని కీలక సంస్థలు ఈ జిల్లాలో ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నుండి గ్రీన్‌సిగ్నల్ లభించింది.

06/19/2017 - 02:33

రాజమహేంద్రవరం, జూన్ 18: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఒఎన్‌జిసి బేస్ కాంప్లెక్సు ప్రాంగణంలో రెండు రోజుల పాటు నిర్వహించిన జాతీయ స్థాయి విలువిద్య పోటీలు ఆదివారంతో ముగిశాయి. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 126వ జయంతోత్సవాలను పురస్కరించుకుని ఏకలవ్య గిరిజన విలువిద్య పోటీల పేరుతో ఈ పోటీలను ఒఎన్‌జిసి ఎస్సీ, ఎస్టీ ఎంప్లారుూస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

06/19/2017 - 02:30

విజయవాడ (క్రైం), జూన్ 18: విజయవాడలోని పవిత్రాత్మ నికేతన్ ఆశ్రమం నుంచి అదృశ్యమైన ఇద్దరు బాలికల ఆచూకీ లభ్యమైంది. ఇద్దరినీ కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని బంధువుల ఇంటి వద్ద గుర్తించినట్లు డిసిపిలు జి పాలరాజు, క్రాంతిరాణా టాటా తెలిపారు.

06/19/2017 - 01:24

విజయవాడ, జూన్ 18: పట్టణ ప్రాంతాల్లో నివసించే ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోసం నిర్మించబోయే బహుళ అంతస్తుల గృహ సముదాయాలకు ముఖ్యమంత్రి నా రా చంద్రబాబునాయుడు, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు కలిసి సోమవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి రిమోట్ వీడియో లింక్ ద్వారా ఒకేసారి రాష్ట్రంలోని 28 పట్టణ ప్రాంతాల్లో శంకుస్థాపన చేయనున్నారు.

Pages