S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

06/20/2017 - 01:51

విజయవాడ, జూన్ 19: వెలగపూడి సచివాలయంలోని ఫైల్స్ అన్నీ ఇ-ఆఫీస్ పద్ధతిలో నిర్వహించాలని, పరిపాలనలో భౌతికమైన ఫైల్స్ (పేపర్ లెస్) లేకుండా సచివాలయ అధికారులు కట్టుదిట్టంగా వ్యవహరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ఇ-ఆఫీస్ నిర్వహణ, త్వరితగతిన పైళ్ల పరిష్కారం, తదితర అంశాలపై సచివాలయ ఉన్నతాధికారులకు సిఎస్ కొన్ని సూచనలు చేశారు.

06/20/2017 - 01:50

హైదరాబాద్, జూన్ 19: భూ కుంభకోణాల్లో తన పేరు ఉన్నట్లు నిరూపిస్తే రాజకీయాలకు స్వస్తి చెబుతానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ అధ్వర్యంలో జరిగిన అతి పెద్ద భూ కుంభకోణమని బొత్స సోమవారం విలేఖరుల సమావేశంలో విమర్శించారు.

06/20/2017 - 01:50

కాకినాడ, జూన్ 19: కాకినాడ పోర్టుకు చెందిన భూములను ఎట్టకేలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకాలకు వినియోగించేందుకు మార్గం సుగమం అయ్యింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ‘2022 నాటికి అందరికీ ఇళ్ళు’ లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా తూర్పు గోదావరి జిల్లాలో బడుగు, బలహీన వర్గాల గృహ నిర్మాణానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది.

06/20/2017 - 00:25

విజయవాడ, జూన్ 19: గిరిజన ప్రాంతాల్లో మంచినీటి అవసరాల కోసం ముఖ్యమంత్రి ప్రత్యేక అభివృద్ధి నిధి నుంచి రూ. 105 కోట్లు విడుదల చేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ తెలిపారు. వెలగపూడి సచివాలయం బ్లాక్ 1లోని సమావేశమందిరంలో సోమవారం సాయంత్రం వివిధ సంక్షేమ శాఖలు, గురుకుల పాఠశాలలు, విద్యార్థి వసతి గృహాలకు సంబంధించిన అంశాలను సమీక్షించారు.

06/20/2017 - 00:24

విజయవాడ, జూన్ 19: రాష్ట్ర గోదాములు, గిడ్డంగుల సంస్థకు నలుగురు డైరెక్టర్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. వీరిలో బిఎల్‌ఎన్ మణిశంకర్‌నాయుడు (విశాఖ జిల్లా), మెట్ల వెంకటరమణ (తూ.గో.జిల్లా), గంగోడు నాగేశ్వరరావు (నెల్లూరు జిల్లా), డి.రాజవర్ధనరెడ్డి (కర్నూలు) ఉన్నారు.

06/20/2017 - 00:24

విజయవాడ, జూన్ 19: ఎన్‌డిఏ రాష్టప్రతి అభ్యర్థిగా రామ్‌నాథ్ కోవింద్ ఎంపిక పూర్తయిన మరుక్షణమే బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సోమవారం రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌కు ఫోన్ ద్వారా ఆ విషయాన్ని తెలియపరిచారు. వెంటనే జగన్ స్పందిస్తూ అత్యున్నత పదవికి అత్యున్నత ఎంపిక అంటూ తప్పక మద్దతు నివ్వగలనన్నారు.

06/20/2017 - 00:23

విజయవాడ, జూన్ 19: తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు.. ట్రావెల్స్‌పై చట్ట వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నాయని ప్రైవేట్ బస్సు యజమానుల సంఘం ఉపాధ్యక్షుడు సునీల్ ఆరోపించారు. తాము నిబంధనల మేరకే బస్సులు నడుపుతున్నామని, అయినా ఒక వ్యక్తి ఒత్తిడికి లొంగి తమను ఇబ్బందులపాలు చేస్తున్నారని ఆరోపించారు. ఏపి ప్రభుత్వంపై త్వరలో కోర్టుకు వెళతామని స్పష్టం చేశారు.

06/20/2017 - 00:23

విజయవాడ, జూన్ 19: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జాతీయ, రాష్ట్ర రహదారుల వెంబడి 500 మీటర్ల పరిధిలోని మద్యం దుకాణాల తొలగింపునకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ప్రధాన రహదారుల వెంబడి సర్వీస్ రోడ్లను కూడా పరిగణనలోకి తీసుకుని అక్కడ నుంచి 500 మీటర్ల దూరంలో వైన్‌షాపులు గాని, బార్ అండ్ రెస్టారెంట్లు గాని ఉండకూడదంటూ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొన్ని నెలల క్రితమే ఆదేశాలు జారీ చేసింది.

06/19/2017 - 04:20

గుంటూరు, జూన్ 18: తెలంగాణ ప్రభుత్వం తొలగించిన 1250 మంది విద్యుత్ ఉద్యోగులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని, ఏపి సర్కార్ తక్షణమే వారి సమస్యను పరిష్కరించాలని ఏపి జెఎసి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఆదివారం ఏపి జెఎసి అమరావతి పేరిట జిల్లా శాఖను ఏర్పాటు చేశారు.

06/19/2017 - 04:19

రాజమహేంద్రవరం, జూన్ 18: విశాఖ భూకుంభకోణంలో అన్ని పార్టీల నాయకులకు వాటా ఉందని, దీనిపై సిబిఐతో విచారణ జరిపించాలని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే అఖిలపక్షంతో బహిరంగ చర్చ జరపాలన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆదివారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు.

Pages