S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

02/25/2017 - 03:19

విజయవాడ, ఫిబ్రవరి 24: ప్రజల ఆరోగ్య పరిరక్షణలో క్రియాశీలక పాత్ర వహించే వైద్యులు ఉన్నత విలువలను కాపాడేలా ప్రధానంగా వైద్య పరీక్షలు, శస్తచ్రికిత్సలో పారదర్శకత ఉండేలా కేంద్ర ప్రభుత్వం మారుతున్న కాలానుగుణంగా ఎప్పటికప్పుడు చట్టాలు చేస్తున్నది. అయితే ఆ చట్టాలు కొందరి పాలిట చుట్టాలుగా మారుతున్నాయి.

02/25/2017 - 03:01

మహాశివరాత్రి సందర్భంగా శ్రీ కాళహస్తిలో ఇంద్రవిమానంపై ఊరేగుతున్న గంగాదేవి సమేతుడైన సోమస్కందమూర్తి,
సప్పర వాహనంపై పురవీధుల్లో తిరుగాడిన జ్ఞాన ప్రసూనాంబ

02/25/2017 - 02:53

మడకశిర, ఫిబ్రవరి 24: ప్రత్యేక హోదా కోసం రెండు కోట్ల మందితో ఈనెల 26వ తేదీ ప్రజాబ్యాలెట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి తెలిపారు. శుక్రవారం అనంతపురం జిల్లా నీలకంఠాపురంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2017 సంవత్సరాన్ని ఉద్యమ నామసంవత్సరంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందన్నారు.

02/25/2017 - 02:50

కాకినాడ, ఫిబ్రవరి 24: రాష్టవ్య్రాప్తంగా జరుగుతున్న వివిధ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాల సందర్భంగా ప్రకటిస్తున్న పరిహారాలు కొందరికి మోదం, మరికొందరికి ఖేదం కలిగిస్తున్నాయి. చిత్రంగా ఒక్కో ప్రాజెక్టు పరిధిలో ప్రకటించిన పరిహారం అక్కడి రైతులకు సంతృప్తిని కలిగించకపోగా, వేరే ప్రాజెక్టు పరిధిలోని రైతులు తమకు అదే ప్యాకేజీ ఇవ్వాలని కోరుతుండటం విశేషం.

02/25/2017 - 02:49

విశాఖపట్నం, ఫిబ్రవరి 24: రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధి విస్తృతం కావాలంటే విదేశీ పర్యాటకుల ఆకర్షణ లక్ష్యంగా వౌలిక సదుపాయాలు, వసతులు కల్పిచాలని పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్ శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు. విదేశీ పర్యాటకులను ఆకర్షించడంలో ఎపి వెనుకబడి ఉందని, ప్రత్యేక పర్యాటక ప్యాకేజీలతో వీరిని ఆకట్టుకోవాలని టూర్ ఆపరేటర్లతో విశాఖలో శుక్రవారం జరిగిన సమావేశంలో అభిప్రాయపడ్డారు.

02/24/2017 - 05:20

విజయవాడ, ఫిబ్రవరి 23: వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఇజ్రాయల్ దేశ రాయబారి డానియల్ కార్మన్ గురువారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. వివిధ అంశాలపై వారు చర్చించారు. అంతర్గత భద్రత, సైబర్ సెక్యూరిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, వ్యవసాయం, విద్య, నీరు, ఆరోగ్య రంగాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందచేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధమని సిఎంకు డానియల్ తెలిపారు.

02/24/2017 - 05:18

ఆమదాలవలస, ఫిబ్రవరి 23: శ్రీకాకుళం జిల్లా పొందూరు రైల్వేస్టేషన్ సమీపంలోని మొదలవలస రైల్వేగేటు వద్ద గురువారం అప్‌లైన్‌లో ఉన్న రైలుట్రాక్ విరిగింది. ఈ విషయాన్ని రైల్వే సిబ్బంది సకాలంలో గుర్తించడంతో భారీ ప్రమాదం తప్పిందని రైల్వే అధికారులు తెలిపారు. దీంతో సుమారు మూడు గంటల పాటు రైళ్ల రాకపోకలు నిలిపివేసి మరమ్మతులు పూర్తి చేసి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు.

02/24/2017 - 05:17

అనంతపురం, ఫిబ్రవరి 23:అనంతపురం జిల్లాను ఈ ఏడాది కూడా క్షామం వెంటాడుతోంది. ఖరీఫ్, రబీ సీజన్‌లో వర్షాలు సరిగా కురవకపోవడంతో పంటలు ఎండిపోయా యి. పశుగ్రాసం సైతం కరువైంది. జిల్లాలో సుమారు 6.2 లక్షల హెక్టార్లలో ఖరీఫ్ వేరుశెనగ సాగు చేశారు. రబీలో వరితో పాటు వివిధ పంటలు వేశారు. వరుణుడు కరుణించకపోవడంతో పంటలు నిలువునా ఎండిపోయాయి. దీంతో వేరుశనగ కట్టె (గ్రాసం) అరకొరగానే దక్కింది.
గ్రామాలు ఖాళీ

02/24/2017 - 05:17

విజయవాడ, ఫిబ్రవరి 23: కలహాలు మరిచి వివిధ అంశాల్లో కలిసి పనిచేస్తున్న ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు, ఈసారి రహదారుల కోసం చేతులు కలుపనున్నాయి. అమరావతి- హైదరాబాద్ అనుసంధానిస్తూ ఆరు లైన్ల ఎక్స్‌ప్రెస్‌వేపై కేంద్రం గతంలో ఇచ్చిన హామీ వాస్తవ రూపం దాల్చేందుకు రెండు ప్రభుత్వాలు రంగంలోకి దిగనున్నాయి. హైదరాబాద్, అమరావతిలను కలుపుతూ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉంది.

02/24/2017 - 05:16

విశాఖపట్నం, ఫిబ్రవరి 23: ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడన్న అభియోగంపై ఎసిబి అధికారులు బుధవారం జరిపిన దాడుల్లో ఐదు కోట్లకు పైగా అక్రమాస్తులు కూడబెట్టిన భీమిలి తహశీల్దార్ రామారావును అరెస్ట్ చేసి గురువారం రిమాండ్‌కు తరలించారు. వచ్చే నెల ఎనిమిదో తేదీ వరకూ రామారావుకు రిమాం డ్ విధించారు. రామారావు ఆస్తులపై బుధవారం అర్థరాత్రి దాటే వరకూ ఏసిబి అధికారులు సోదాలు నిర్వహించారు.

Pages