S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

02/25/2017 - 03:34

గుంటూరు (నాగార్జున విశ్వవిద్యాలయం), ఫిబ్రవరి 24: సామాజిక విప్లవాన్ని కాంక్షించిన బుద్ధుని బోధనలను నేటి యువత ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు అన్నారు.

02/25/2017 - 03:32

విశాఖపట్నం, ఫిబ్రవరి 24: ప్రతి ఏడాది మహాశివరాత్రి సందర్భంగా సాగరతీరంలో కోటి శివలింగాల ప్రతిష్ఠ, మహాకుంభాభిషేకం నిర్వహించడం రాజ్యసభ సభ్యుడు డాక్టర్ టి.సుబ్బరామిరెడ్డి పూర్వ జన్మ సుకృతమని విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. విశాఖ ఆర్‌కె బీచ్‌లో శుక్రవారం నిర్వహించిన మహాకుంబాభిషేకంలో భాగంగా తొలి శివుని లింగానికి స్వరూపా నందేంద్ర సరస్వతి అభిషేకం జరిపారు.

02/25/2017 - 03:28

ఏలూరు, ఫిబ్రవరి 24 : స్థానిక అంబికా దర్బార్ అగర్‌బత్తి సంస్థ ఏర్పడి 70 సంవత్సరాలు పూర్తిచేసుకుని, 71 సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా శుక్రవారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని 108 పుణ్యక్షేత్రాల్లో అంబికా మహా ధూపాలను ఏకకాలంలో ఏర్పాటు చేసినట్లు అంబికా దర్బార్ బత్తి అధినేతలు తెలిపారు. ఈ ప్రక్రియలో భాగంగా 24 గంటలపాటు వెలిగే ఈ ధూపాలను వెలిగించామన్నారు.

02/25/2017 - 03:26

విశాఖపట్నం, ఫిబ్రవరి 24: దేశంలో డిజిటల్ విప్లవం ఊపందుకుంటోందని, త్వరలోనే ఇది అన్ని రంగాలకు విస్తరించనుందని స్టీల్ ప్లాంట్ సిఎండి పి మధుసూదన్ చెప్పారు. డిజిటల్ ఇండియా ఇన్ గ్లోబల్ ఐటి స్పెక్ట్రమ్ అన్న అంశంపై కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా, విశాఖ స్టీల్‌ప్లాంట్ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు జరిగే అంతర్జాతీయ సదస్సు శుక్రవారం ప్రారంభమైంది.

02/25/2017 - 03:24

విశాఖపట్నం, ఫిబ్రవరి 24: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా టి.సుబ్బరామిరెడ్డి లలిత కళాపరిషత్ ఆధ్వర్యంలో శుక్రవారం సుబ్బరామిరెడ్డి, శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, మంత్రి గంటా శ్రీనివాసరావు, ప్రముఖ సినీ నటుడు రాజశేఖర్ నటుడు సుమన్‌కు ఆధ్యాత్మిక నట ప్రవీణ బిరుదు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా స్వర్ణ కంకణధారణతో ఘనంగా సత్కరించారు.

02/25/2017 - 03:22

విజయవాడ, ఫిబ్రవరి 24: పేరుకుపోయిన విద్యుత్ బిల్లులు రాష్ట్రంలోని వివిధ పంచాయతీలకు భారంగా పరిణమించాయి. అరకొర ఆదాయంతో పూర్తి స్థాయిలో విద్యుత్ బిల్లులు చెల్లించలేకపోవడంతో అనేక పంచాయతీల్లో చీకట్లు అలముకున్నాయి. విద్యుత్ బకాయిలు దాదాపు 1350 కోట్ల రూపాయల మేరకు పేరుకుపోగా, సర్‌చార్జి భారం దాదాపు 40 కోట్ల రూపాయల వరకూ ఉంది. రాష్ట్రంలో 12,920 పంచాయితీలు ఉన్నాయి.

02/25/2017 - 03:21

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 24: తూర్పు గోదావరి జిల్లాలో శుక్రవారం గోదావరి నదిలో శివరాత్రి స్నానాలు ఆచరించే చోట అపశృతి చోటుచేసుకుంది. రాజమహేంద్రవరం పుష్కర ఘాట్‌లో విద్యుత్ షాక్‌కు గురై ఒక వ్యక్తి మృతిచెందాడు. గొలగోటి రాంబాబు (32) విద్యుత్ షాక్‌కు గురికాగా, ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు.

02/25/2017 - 03:20

విజయవాడ (ఇంద్రకీలాద్రి), ఫిబ్రవరి 24: విజయవాడలోని శ్రీకనకదుర్గమ్మ మహాప్రసాదాలైన పులిహారలో ఇసుక, లడ్డూలో రాళ్ళు రావటంతో పలువురు భక్తులు కొండపైన ఉన్న దేవస్థాన సమాచార కేంద్రం వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో షుర్షణకు దిగటంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

02/25/2017 - 03:20

విజయవాడ, ఫిబ్రవరి 24: ప్రజారోగ్యాన్ని హరింప చేస్తున్న అమ్మకాల విషయం అటుంచి ఆహార పదార్థాల కల్తీని అట్టడుగు స్థాయి నుంచి పూర్తిస్థాయిలో అరికట్టే నాథుడు కన్పించటం లేదు. ఆరోగ్యశ్రీ పథకం కింద తెల్లకార్డుదారులకు, హెల్త్‌కార్డుల ద్వారా ఉద్యోగులు, తాజాగా అన్ని స్థాయిల్లోని వారికి ఆరోగ్య పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం వందలు, వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నది.

02/25/2017 - 03:19

విజయవాడ (కల్చరల్), ఫిబ్రవరి 24: విజయవాడ ఫిలిమ్ సొసైటీ తమ సభ్యుల కోసం మార్చి 1 నుండి 5 వరకు చైనా దేశపు చలన చిత్రాలను ప్రదర్శించనున్నది.

Pages