S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

10/16/2016 - 08:30

విజయవాడ, అక్టోబర్ 15: పరిసరాల పరిశుభ్రత - దోమలపై దండయాత్ర, వనం - మనం తదితర కార్యక్రమాలు విజయవంతం కావడం వల్లే గడిచిన 5 వారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అంటువ్యాధులు గణనీయంగా తగ్గాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శనివారం ఉండవల్లిలోని తన నివాసం నుంచి విద్యాశాఖ, వైద్యశాఖ, మున్సిపల్, పంచాయతీరాజ్, తాగునీటి సరఫరా శాఖల అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

10/16/2016 - 08:29

భీమవరం, అక్టోబర్ 15: గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్కు వ్యవహారం ముదురుతోంది. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హెచ్చరించడం, ఫుడ్ పార్క్ ప్రాంతంలో ఈనెల 19న పర్యటించాలని వైకాపా అధినేత వైఎస్ జగన్ నిర్ణయంచడంతో రాజకీయం వేడెక్కనుంది.

10/16/2016 - 08:29

విజయవాడ, అక్టోబర్ 15: ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడమే ఒక చరిత్ర అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్‌తో పని చేసి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని ఆయన గుర్తు చేసుకున్నారు. ఏపి రాజధాని అమరావతిని ప్రపంచంలో మేటినగరంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం పొట్టిపాడులో సిఎం చంద్రబాబు దివంగత ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.

10/16/2016 - 08:22

రాజమహేంద్రవరం, అక్టోబర్ 15: దేశంలో ఏ నదికీ లేని విధంగా రెండు రుతు పవనాలు ఒక్క గోదావరి నదికే సొంతం. ఆవాసిత ప్రాంతం కూడా అత్యధికం. అందుకే ఇది జీవనది. గత 40 ఏళ్ళలో ఎపుడూ లేని విధంగా రికార్డుస్థాయిలో ఈ ఏడాది గోదావరి నదికి వరద సీజన్ పెరిగింది. ఆవాసిత ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా గోదావరి నదిలో వరద జలాల లభ్యత పెరిగింది. సాధారణంగా గోదావరి నదికి కేవలం మూడు నెలల కాలం పాటే వరద సీజన్‌గా వుంటుంది.

10/16/2016 - 08:00

చాగలమర్రి, అక్టోబర్ 15: కర్నూలు జిల్లా చాగలమర్రి వద్ద జాతీయ రహదారిపై శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా హైదరాబాద్‌కు చెందిన వారు. స్కార్పియో వాహనం డివైడర్‌ను ఢీకొని బోల్తాపడడంతో ఈ ప్రమాదం జరిగింది.

10/16/2016 - 07:59

ఒంగోలు, అక్టోబర్ 15: శబరి ఎక్స్‌ప్రెస్ రైలు తెనాలి వద్ద ఆగినప్పుడు ఎస్-6 బోగీలో కొంతమంది ప్రయాణికులు తెనాలిలోని తమ బంధువులతో కలిసి దాడి చేసిన సంఘటనలో ప్రకాశం జిల్లా కరేడు పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం వూళ్లపాలెం గ్రామానికి చెందిన తొమ్మిది మంది షిర్డీ వెళ్లారు. తిరుగుప్రయాణంలో శుక్రవారం ఉదయం సికింద్రాబాద్ నుంచి సొంతూరు రావడానికి శబరి ఎక్స్‌ప్రెస్ ఎక్కారు.

10/16/2016 - 04:57

విజయవాడ, అక్టోబర్ 15: ఆంధ్రప్రదేశ్‌ను నాలెడ్జ్ స్టేట్‌గా తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. చదువుతోపాటు విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాముఖ్యత ఇవ్వాలని ఆయన సూచించారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు జిల్లా పరిషత్ హైస్కూల్‌లో ‘వరల్డ్ హ్యాండ్ వాష్ డే’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. వందలమంది విద్యార్థులతో కలిసి ఆయన చేతులు శుభ్రం చేసుకున్నారు.

10/16/2016 - 04:46

హైదరాబాద్, అక్టోబర్ 15: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలంలోని తుందుర్రు, బేతపూడి, జొన్నల గరువు ప్రాంతంలో చిచ్చు రేపుతున్న గోదావరి మెగా ఆక్వా పార్కు నిర్మాణాన్ని అక్కడి నుండి తక్షణమే తరలించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమస్యపై తక్షణమే ఆలోచించకపోతే నందిగ్రామ్ పరిస్థితి పునరావృతం అవుతుందని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

10/16/2016 - 04:40

విజయవాడ, అక్టోబర్ 15: ఏపి అభివృద్ధికి సంబంధించి భారత్, రష్యాల మధ్య కీలక ఒప్పందం జరిగింది. తొలిరోజు సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్‌ల మధ్య పలు కీలక అంశాలపై చర్చలు సాగాయి. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు, రష్యన్ కార్పొరేషన్ సంస్థల మధ్య అభివృద్ధి అంశాలకు సంబంధించి రెండు ఎంవోయులు కుదిరాయి.

10/16/2016 - 04:39

విజయవాడ, అక్టోబర్ 15: రాష్ట్రంలో స్థానిక పాలనను మూడంచెల వ్యవస్థగా కుదించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పావులు కదుపుతోంది. ఈ మేరకు ఇప్పటికే కేంద్రానికి లేఖ రాసింది. అనుమతి రాగానే జడ్‌పిటిసి, ఎంపిటీసీల వ్యవస్థను రద్దు చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన. జడ్పీటిసి, ఎంపిటిసి వ్యవస్థను రద్దచేయాలని కేంద్రానికి ఏపి ప్రభుత్వం సిఫార్సు చేసింది.

Pages