S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

10/15/2016 - 08:24

గుంటూరు, అక్టోబర్ 14: పేదవాడికి ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రతి కుటుంబానికి నెలకు రూ.10వేల కనీస ఆదాయం లభించేలా చూడాలని ప్రభుత్వం సంకల్పించింది. సంక్షేమ కార్యక్రమాల అమలుకు ఇకపై జిల్లా కమిటీలను నియమించి పర్యవేక్షించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాల అమలుతీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో శుక్రవారం రాత్రి ఉన్నతాధికారులతో సమీక్షించారు.

10/15/2016 - 08:08

విశాఖపట్నం, అక్టోబర్ 14: నిత్యం వేల సంఖ్యలో పర్యాటకులు, స్థానికులు సేదదీరే సాగర తీరం ఆర్‌కె బీచ్. దూరం నుంచి చూసే వారికి తెల్లని కెరటాలతో కనువిందు చేస్తుంది. అదే సరదాపడి సముద్రంలో కాలు పెడితే.. కన్ను మూసి తెరిచేలోగా గల్లంతైపోతారు. క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ప్రతి ఏటా అనేక మంది ఇక్కడి సముద్రంలో స్నానానికి వెళ్లి మృత్యువాత పడుతున్నారు.

10/15/2016 - 08:07

విజయవాడ, అక్టోబర్ 14: ప్రజాసాధికార సర్వేను ఎట్టిపరిస్థితుల్లో ఈ నెలాఖరు నాటికి పూర్తిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పాలనలో జవాబుదారీతనం, పారదర్శకతను పెంచి నిజమైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందించాలనే ఉద్దేశ్యంతో చేపట్టిన సర్వేను త్వరితగతిన పూర్తిచేయాల్సిన అవసరం వుందన్నారు.

10/15/2016 - 08:03

రాజమహేంద్రవరం, అక్టోబర్ 14: ఇసుక మాఫియా కంబంధ హస్తాల్లో గోదావరి తీరం గుల్లవుతోంది. ఉచితం మాటున ప్రభుత్వ ఖజానా డొల్లవుతోంది. ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా ప్రజలకు ఉచితంగా ఇసుక అందిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వ పెద్దలు క్షేత్రస్థాయిలో జరుగుతున్న వ్యవహారాలు ఏమీ తెలియనట్టుగా కళ్లు మూసుకుంటున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ‘ఏ ర్యాంపులో చూసినా కానరాదు ఉచిత ఇసుక...

10/15/2016 - 08:03

రాజమహేంద్రవరం, అక్టోబర్ 14: ఇసుక మాఫియా కంబంధ హస్తాల్లో గోదావరి తీరం గుల్లవుతోంది. ఉచితం మాటున ప్రభుత్వ ఖజానా డొల్లవుతోంది. ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా ప్రజలకు ఉచితంగా ఇసుక అందిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వ పెద్దలు క్షేత్రస్థాయిలో జరుగుతున్న వ్యవహారాలు ఏమీ తెలియనట్టుగా కళ్లు మూసుకుంటున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ‘ఏ ర్యాంపులో చూసినా కానరాదు ఉచిత ఇసుక...

10/15/2016 - 07:48

విశాఖపట్నం, అక్టోబర్ 14: చలామణి కాలం ముగిసిన నోట్లను మార్చేందుకు క్యాషియర్‌తో ఒప్పందం కుదుర్చుకున్న దొంగల ముఠా ఒక బ్యాంకుకు రూ.30 లక్షలకు టోకరా వేసింది. విశాఖలో గురువారం జరిగిన ఈ సంఘటనపై బ్యాంకు ఉన్నతాధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, క్యాషియర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి.

10/15/2016 - 06:36

ప్రత్తిపాడు, అక్టోబర్ 14: కాపులకు బిసి రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీ తీర్మానం చేసి, 9వ షెడ్యూలులో చేర్చడానికి కేంద్రానికి ప్రతిపాదన పంపిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ని నిలబెట్టుకోనందుకు నిరసనగా కాపు సత్యగ్రహ యాత్ర చేపట్టనున్నట్లు మాజీమంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప్రకటించారు. నవంబర్ 16న తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం నుండి అంతర్వేదివరకు పాదయాత్ర చేపడుతున్నట్లు తెలిపారు.

10/15/2016 - 06:34

విశాఖపట్నం(క్రైం), అక్టోబర్ 14: పూటుగా మద్యం సేవించిన ఓ సైకో నడిరోడ్డుపై కత్తులతో వీరంగం వేయడంతో ఏడుగురు తీవ్రగాయాల పాలయ్యారు. ఈ సంఘటనతో కోపోద్రిక్తులైన స్థానికులు ఎదురుదాడికి దిగడంతో ఆ సైకో మృతి చెందాడు.

10/14/2016 - 04:29

నెల్లూరు, అక్టోబర్ 13: నెల్లూరు నగరంలో జరుగుతున్న రొట్టెల పండగకు హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్భ్రావృద్ధి రొట్టెను మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి నుంచి స్వీకరించారు.

10/14/2016 - 04:27

హైదరాబాద్, అక్టోబర్ 13: ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధిపై అంకెల గారడీ జరుగుతోందని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, వైకాపా ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. గురువారం ఆయన ఇక్కడ లోటస్‌పాండ్‌లో విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేస్తూ రాష్ట్రాన్ని తప్పుదోవబట్టిస్తున్నారన్నారు.

Pages