S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

06/07/2016 - 12:29

అనంతపురం: చేనేత కార్మికులకు భారీగా బకాయిలు పడిన కేసులో కళానికేతన్ వస్తద్రుకాణం ఎండి లక్ష్మీశారదకు ధర్మవరం కోర్టు రెండు వారాల పాటు రిమాండ్ విధించింది. హైదరాబాద్‌లో అరెస్టు చేసిన ఆమెను మంగళవారం ధర్మవరం కోర్టులో పోలీసులు హాజరు పరిచారు. తమ వద్ద పట్టుచీరలు తీసుకుని 9 కోట్ల రూపాయలు బకాయి పడడంతో లక్ష్మీశారదపై స్థానిక చేనేత వ్యాపారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

06/07/2016 - 12:28

కాకినాడ: కాపుగర్జన సందర్భంగా ఇటీవల తునిలో జరిగిన విధ్వంసకాండకు సంబంధించి సిఐడి పోలీసులు మంగళవారం నాడు మరో ఏడుగురిని అరెస్టు చేశారు. సిసి టీవీ ఫుటేజి, వీడియోలు, ఫొటోల ఆధారంగా నిందితులను గుర్తించారు. కాగా, తనను అరెస్టు చేయాలంటూ అమలాపురం పోలీస్ స్టేషన్‌లో హంగామా సృష్టిస్తున్న కాపు ఉద్యమనేతతో చర్చలు జరపాలంటూ తూ.గో. జిల్లా ఎస్పీ రవిప్రకాష్‌ను ప్రభుత్వం ఆదేశించింది.

06/07/2016 - 12:04

విజయవాడ: నదీ జలాల వాటాలో అన్యాయం జరిగిందంటూ తెలంగాణ నేతలు దేశ రాజధానిలో అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఎపి ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమా మంగళవారం ఇక్కడ మీడియాతో అన్నారు. బచావత్ అవార్డు ప్రకారమే ఎపి, తెలంగాణలకు నీటిని కేటాయిస్తున్నారన్నారు. విభజన చట్టానికి నాడు అంగీకరించిన టి.నేతలు ఇపుడు కృష్ణా రివర్ బోర్డు నిర్ణయాలను అంగీకరించమంటూ ప్రకటనలు చేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు.

06/07/2016 - 11:58

కాకినాడ: తుని విధ్వంసకాండకు సంబంధించి తాజాగా అరెస్టు చేసిన నిందితుల వివరాలను ఎపి సిఐడి పోలీసులు బహిర్గతం చేయడం లేదు. పదిమందిని అరెస్టు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నా సిఐడి అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు. కడప, గుంటూరు జిల్లాల్లో కూడా నిందితులను గుర్తించినట్లు సమాచారం. నేడో, రేపో మరో 20 మందిని అరెస్టు చేస్తారన్న వార్తలు వినిపిస్తున్నాయి.

06/07/2016 - 11:57

కాకినాడ: తుని విధ్వంసకాండకు సంబంధించి కొంతమంది నిందితులను అరెస్టు చేయడంతో తనను కూడా అరెస్టు చేయాలంటూ కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మంగళవారం ఉదయం అమలాపురం పోలీస్ స్టేషన్‌లో బైఠాయించారు. ఆయన అనుచరులు కూడా పోలీస్ స్టేషన్ ఆవరణలో బైఠాయించడంతో ఏం చేయాలో తోచక పోలీసులు తలలు పట్టుకున్నారు. స్థానిక పోలీసులు జిల్లా కేంద్రంలోని ఉన్నతాధికారులతో సంప్రదిస్తున్నారు.

06/07/2016 - 07:47

విశాఖపట్నం/విజయవాడ, జూన్ 6: వివిధ ఇంజనీరింగ్ కళాశాలల్లోకి ప్రవేశాలకు సంబంధించి సోమవారం ప్రారంభమైన ఎంసెట్-2016 కౌనె్సలింగ్ ప్రక్రియలో విజయవాడ, విశాఖపట్నం పట్టణా ల్లో తొలిరోజు గందరగోళ పరిస్థితి నెలకొంది. సాయంత్రం వరకూ ఇదే పరిస్థితి కొనసాగింది.

06/07/2016 - 07:12

అనంతపురం సిటీ, జూన్ 6: పదేళ్లపాటు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం దేశాన్ని అవినీతిలో ముంచెత్తిందని కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ అన్నారు. సోమవారం అనంతపురం నగరంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కుంభకోణాల్లో కూరుకుపోయిందన్నారు. 2జి, బొగ్గు, స్పెక్ట్రమ్, భూగర్భజలాలు, విమానయానరంగం, పంచభూతాలను సైతం వదలకుండా కాంగ్రెస్ మంత్రులు వేల కోట్ల దోచుకున్నారని ధ్వజమెత్తారు.

06/07/2016 - 07:10

విజయవాడ , జూన్ 6: ఏడాది కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నట్లు రాష్ట్ర డిజిపి జెవి రాముడు సోమవారం ఇక్కడ విలేఖర్ల సమావేశంలో ప్రకటించారు. నక్సల్స్ కార్యకలాపాలను పూర్తిగా అదుపు చేశామని స్పష్టం చేశారు. పొరుగు రాష్ట్రాలతో పొలిస్తే రాష్ట్రంలో క్రైంరేటు ఈ సంవత్సరం తగ్గుముఖం పట్టినా ఇంకా తగ్గాల్సి ఉందన్నారు.

06/07/2016 - 07:06

నూజివీడు, జూన్ 6: కృష్ణా జిల్లా ఆగిరిపల్లిలో దళితరత్న అవార్డు గ్రహీత, మంత్రి రావెల కిషోర్‌బాబు, ఏలూరు ఎంపి మాగంటి వెంకటేశ్వరరావు ముఖ్య అనుచరుడిగా ఉంటూ ప్రైవేటు దందాలు చేస్తున్న పాలేటి మహేశ్వరరావు, అతని అనుచరులు సోమవారం పోలీసులపై దాడికి పాల్పడ్డారు. సాక్షాత్తూ ఎస్‌ఐపై దాడి చేయబోగా అడ్డుగా వచ్చిన కానిస్టేబుళ్లపై వారు దాడులకు తెగబడ్డారు. ఈ సంఘటన ఆగిరిపల్లిలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

06/07/2016 - 06:57

హైదరాబాద్, జూన్ 6: నవ్యాంధ్రలో ఉన్న సమస్యలకు కులాల తలనొప్పి తోడవడంతో, దానికి తెరదించేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సర్వే నిర్వహణకు తెరలేపినట్లు కనిపిస్తోంది. జనాభా సంఖ్య ప్రాతిపదిక న్యాయం చేయాలన్న డిమాండ్లు పెరగడం, అసలు ఏ కులానికి ఎంత జనాభా ఉందో తెలియక ఇప్పటివరకూ తర్జనభర్జన జరుగుతోంది.

Pages