S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

06/07/2016 - 18:00

విశాఖ: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఇంకా కొనసాగతుండగా, మరోవైపు క్యుములోనింబస్ మేఘాల వల్ల ఎపి,తెలంగాణల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఇక్కడి వాతావరణ కేంద్రం మంగళవారం తెలిపింది. ఉరుములు, మెరుపులతో, ఈదురుగాలులతో వర్షం కురుస్తుంది. తెలంగాణలో వడగళ్ల వాన కురుస్తుంది.

06/07/2016 - 17:59

గుంటూరు: కాపుగర్జన సందర్భంగా రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ రైలును దగ్ధం చేసినవారిని చట్ట ప్రకారం శిక్షించాలా? వద్దా?- అని ఎపి మంత్రి నారాయణ కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభంను మంగళవారం ప్రశ్నించారు. నిందితులపై పోలీసులు చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తారని, ఇందులో ప్రభుత్వ ప్రమేయం ఏమీ ఉండదన్నారు. కాపులకు సిఎం చంద్రబాబు చేస్తున్న మేలును చూసి ఓర్వలేకే ముద్రగడ అరాచక శక్తులతో చేతులు కలిపారని ఆయన ఆరోపించారు.

06/07/2016 - 17:59

విజయవాడ: 2013లో ఓ బాలికపై అత్యాచారానికి సంబంధించి ఇక్కడి మహిళా సెషన్స్ కోర్టు మంగళవారం సంచలనాత్మక తీర్పు ఇచ్చింది. సునీల్ అనే నిందితుడికి మరణించేవరకూ జీవితఖైదు శిక్షను అమలు చేయాలని కోర్టు ఆదేశించింది. రెండు రోజులపాటు బాలికను నిర్బంధించి సునీల్ అత్యాచారం చేసినట్లు సాక్ష్యాధారాలు లభించడంతో న్యాయమూర్తి ఈ శిక్ష విధించారు.

06/07/2016 - 17:56

కాకినాడ: తుని విధ్వంసకాండకు సంబంధించి అరెస్టు చేసిన వారిని విడిచిపెట్టేంత వరకూ తాను పోలీస్ వ్యాన్ దిగేది లేదని కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం పట్టువీడక పోవడంతో కిర్లంపూడిలో ఉద్రిక్తత ఏర్పడింది. అమలాపురం నుంచి ఆయనను సిఐడి పోలీసులు కిర్లంపూడికి వ్యాన్‌లో తీసుకుని వచ్చారు. ఇంటి వద్ద ఆయనను విడిచిపెట్టేందుకు పోలీసులు ప్రయత్నించినా వ్యాన్ దిగేందుకు ముద్రగడ నిరాకరించారు.

06/07/2016 - 17:55

గుంటూరు: తుని విధ్వంసకాండలో నిందితులందరిపైనా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, ఇకముందు ఇలాంటి ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండేందుకే కేసులు పెడుతున్నామని ఎపి హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప మంగళవారం ఇక్కడ మీడియాకు తెలిపారు. తుని ఘటనలో నిందితులంతా నేరచరిత్ర ఉన్నవారేనని అన్నారు. రౌడీషీటర్లు, వైకాపాతో సంబంధాలున్నవారు తుని వద్ద విధ్వంసానికి పాల్పడ్డారని తెలిపారు.

06/07/2016 - 15:29

కాకినాడ: కాపుగర్జన సందర్భంగా తుని వద్ద జరిగిన విధ్వంసకాండలో అరెస్టు చేసిన అయిదుగురి వివరాలను సిఐడి పోలీసులు మంగళవారం మీడియాకు వెల్లడించారు. వీరిని కాకినాడ కోర్టులో హాజరు పరిచారు. నిందితుల పేర్లు: దూడల మహేంద్ర(అమలాపురం) , కూరాకుల దొరబాబు(పిఠాపురం) , మహేష్‌ (గుంటూరు), పవన్‌కుమార్‌(గుంటూరు) , నక్కా సాయి(తూర్పుగోదావరి).

06/07/2016 - 15:27

కాకినాడ: తుని విధ్వంసకాండకు సంబంధించి ఆరుగురిని అమలాపురం పోలీసులు అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ పోలీస్ స్టేషన్‌లో బైఠాయించిన కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభంను పోలీసులు కిర్లంపూడికి తరలించారు. కేసులు రైల్వేశాఖ పరిధిలో ఉన్నాయని చెబుతున్న స్థానిక పోలీసులు అరెస్టులు ఎలా చేస్తారని ముద్రగడ స్థానిక డిఎస్పీతో వాదనకు దిగారు. అరెస్టు చేసినవారిని ఎక్కడికి తీసుకెళ్లారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

06/07/2016 - 15:25

కాకినాడ: కాపుగర్జన సందర్భంగా తుని వద్ద జరిగిన విధ్వంసకాండలో నిందితులకు సంబంధించి తమ వద్ద బలమైన సాక్ష్యాధారాలున్నాయని సిఐడి పోలీసులు మంగళవారం మీడియాకు వివరించారు. రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ దగ్ధమైనపుడు వీడియోలు, ఫొటోల ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్టు చేస్తున్నామని వారు తెలిపారు. తుని ఘటనలో అరెస్ట్ చేసిన దూడల మణీంద్ర అమలాపురంలో రౌడీషీటర్ అని సీఐడీ తేల్చింది.

06/07/2016 - 15:22

కాకినాడ: రాజకీయ కక్షలతో విపక్షపార్టీల కార్యకర్తలను తుని విధ్వంసకాండలో నిందితులుగా పేర్కొంటూ అరెస్టులు చేస్తున్నారని వైకాపా ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా మంగళవారం ఆరోపించారు. ఈ రోజు సిఐడి పోలీసులు అరెస్టు చేసిన ఏడుగురిలో ఇద్దరు అమాయకులున్నారని ఆయన అన్నారు. తుని వద్ద విధ్వంసం జరిగినపుడు ఆ ఇద్దరు ఆ ప్రాంతంలోనే లేరని తెలిపారు.

06/07/2016 - 12:30

విశాఖ: ఇక్కడి రామకృష్ణా బీచ్ వద్ద మంగళవారం ఉదయం సముద్రం ముందుకు వచ్చింది. తీరంలోని సబ్ మెరైన్ మ్యూజియంను అలలు తాకుతున్నాయి. వైఎంసిఎ వైపు సుమారు 50 అడుగుల మేరకు సముద్రం ముందుకు చొచ్చుకుని రావడంతో స్థానికులు భయాందోళనలకు లోనయ్యారు. ఇటీవలి కాలంలో సముద్రం ముందుకు రావడం, బీచ్ కోతకు గురికావడంతో శాస్తవ్రేత్తలు కొంతకాలంగా అధ్యయనం చేస్తున్నారు.

Pages