S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

06/08/2016 - 08:16

గుంటూరు, జూన్ 7: తూర్పు గోదావరి జిల్లా తునిలో రైలు దగ్ధం కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఆరుగురిని సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారని, ఘటనకు బాధ్యులైన మరికొందరిని కూడా అరెస్ట్ చేయనున్నట్లు హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పష్టం చేశారు. మంగళవారం గుంటూరులో మీడియాతో ఆయన మాట్లాడుతూ అమాయకులపై ఎలాంటి వేధింపులకు ప్రభుత్వం తావివ్వదని, ఘటన వెనుక రౌడీషీటర్ల ప్రమేయం ఉన్నట్లు తేలిందన్నారు.

06/08/2016 - 08:15

హైదరాబాద్, జూన్ 7 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి తెలుగు ప్రజలంతా సహకారం అందించాలని విశ్వయోగి విశ్వంజీ విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆయన ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ, బుధవారం మహాసంకల్ప దీక్ష తీసుకుంటున్న సందర్భంగా, రాష్ట్ర పాలకులు, ప్రజలకు ఆశీస్సులు అందిస్తున్నానని చెప్పారు.

06/08/2016 - 08:14

విశాఖపట్నం, జూన్ 7: రాష్ట్ర విభజనతో మూడు కళాశాలలకు చెందిన ఆర్కిటెక్చర్ విద్యార్థులు రోడ్డున పడ్డారు. వీటికి హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (జెఎన్‌ఎఎఫ్‌యు) అనుబంధ కళాశాలల గుర్తింపును రద్దు చేయడంతో పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.

06/08/2016 - 08:04

విజయవాడ, జూన్ 7: ప్రపంచ ప్రఖ్యాతి పొందిన స్టాన్‌ఫోర్డ్, యేల్, హార్వర్డ్ యూనివర్సిటీలు భారతదేశంలో తమ విభాగాలను ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాయని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ తెలియచేశారు. ఈ విభాగాలను రాజధాని అమరావతిలో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన అభ్యర్థనకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు.

06/08/2016 - 08:04

విజయవాడ, జూన్ 7: మనకు నచ్చని వారి గురించి ఎక్కువగా మాట్లాడం... వారి పేరును ప్రస్తావించడానికి కూడా ఇబ్బంది పడుతుంటాం. తాజా రాజకీయాల్లో సీనియర్ నాయకులు ఇదే పంథాను అనుసరిస్తున్నారు. అలాంటిది చిరకాల రాజకీయ ప్రత్యర్థిని ఏదైనా సందర్భంలో పొగడాల్సి వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? తమ రాజకీయ జీవితంలో అలాంటి అవసరం రాకూడదనే చాలామంది నాయకులు భావిస్తుంటారు.

06/08/2016 - 08:03

కాకినాడ, జూన్ 7: తునిలో కాపుల ఐక్యగర్జన సభ సందర్భంగా చోటుచేసుకున్న అల్లర్లు ముఖ్యమంత్రి చంద్రబాబే సృష్టించారని మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఆరోపించారు. తునిలో జరిగిన హింసాత్మక సంఘటనలకు ఆయనే బాధ్యుడన్నారు. తుని ఘటనలో జరుగుతున్న అరెస్టులకు నిరసనగా మంగళవారం ఉదయం నుండి ఆందోళనకు దిగిన ముద్రగడ రాత్రి 8 గంటల సమయంలో విరమించారు.

06/08/2016 - 06:50

విజయవాడ, జూన్ 7: బచావత్ ట్రిబ్యునల్ తీర్పుననుసరించి నీటి కేటాయింపుల ప్రకారం రాష్ట్ర వాటాను కచ్చితంగా కోరుకుంటున్నామని, తెలంగాణకు చెందిన నీటిని కోరుకోవడం లేదని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు.

06/08/2016 - 06:08

విజయవాడ, జూన్ 7: రాష్ట్ర విభజన కార్చిచ్చు ప్రభుత్వోద్యోగుల మెడకు పామైచుట్టుకుంది. ఉద్యోగుల సంసారాలను నిలువునా చీల్చేసింది. విభజన తరువాత కొత్త రాజధాని ఎక్కడ ఏర్పడితే అక్కడికి తరలి వెళ్లిపోవాలన్న విషయం ఉద్యోగులకు తెలియంది కాదు. ఇందుకు చాలామంది ఉద్యోగులు మానసికంగా సిద్ధపడ్డారు కూడా. కాకపోతే దాని తీవ్రత ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. తరలింపు వ్యవహారం కుటుంబాలు చిన్నాభిన్నమయ్యే పరిస్థితిని తెస్తోంది.

06/08/2016 - 07:21

కాకినాడ/రాజమహేంద్రవరం, జూన్ 7: తుని విధ్వసం ఘటన నేపథ్యంలో జరుగుతున్న అరెస్టులు మంగళవారం తూర్పు గోదావరి జిల్లాలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ముందుగా తనను అరెస్టుచేయాలంటూ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరికొందరు నేతలతో కలిసి ఉదయం అమలాపురం పోలీసు స్టేషన్‌లో బైఠాయించడంతో మొదలైన హైడ్రామా ఆయనను పోలీసు వ్యాన్‌లో స్వగ్రామం కిర్లంపూడి తరలించడంతో ఊహించని మలుపుతిరిగింది.

06/08/2016 - 05:54

విజయవాడ, జూన్ 7: చంద్రబాబు నాయుడు అధికార పగ్గాలు చేపట్టి సరిగ్గా నేటికి రెండేళ్లు. సమస్యలు, సవాళ్లు చంద్రబాబుకు స్వాగతం పలికాయి. విభజన నేపథ్యంలో కట్టుబట్టలతో బయటపడ్డ ఆంధ్రప్రదేశ్‌ను ఒక గాడిలో పెట్టేందుకు ముళ్ల కిరీటాన్ని తలకెత్తుకున్నారు చంద్రబాబు. భారీ ఆర్థిక లోటుతో ప్రభుత్వ కార్యకలాపాలను ఆయన ప్రారంభించాల్సి వచ్చింది.

Pages