S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

06/07/2016 - 06:56

హైదరాబాద్, జూన్ 6: నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్‌ఐఓఎస్) ఇంటర్ ఫలితాలను విడుదల చేసినట్టు జాతీయ డైరెక్టర్ (ఎవాల్యూయేషన్) ధరుమన్ తెలిపారు. జాతీయ స్థాయిలో 2,03,481 మంది రిజిస్టర్ చేసుకోగా అందులో పరీక్షలకు 1,83,733 మంది హాజరుకాగా వారిలో 71,489 మంది ఉత్తీర్ణులయ్యారని చెప్పారు.

06/07/2016 - 06:55

హైదరాబాద్, జూన్ 6: ప్రతిపక్ష నాయకుడు వై ఎస్ జగన్మోహన్‌రెడ్డి కనీసం ప్రజాతీర్పును గౌరవించే పరిస్థితిలో లేడని తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రిని హేళన చేయడం, అవమానకరంగా మాట్లాడటం అంటే ఆయనపై విశ్వాసంతో అధికారాన్ని అందించిన ప్రజలను అవమానించడమేనని అన్నారు.

06/07/2016 - 06:52

హైదరాబాద్, జూన్ 6: కార్మికుల సంక్షేమానికి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తున్నదని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. జెనివాలో 7 నుంచి 9వ తేదీ వరకు జరగనున్న అంతర్జాతీయ కార్మికుల సదస్సుకు హాజరయ్యేందుకు దత్తాత్రేయ నేతృత్వంలో ప్రతినిధుల బృందం బయలుదేరి వెళ్ళింది.

06/07/2016 - 06:52

శ్రీకాకుళం, జూన్ 6: విద్యార్థుల చదువులు ఆగిపోతున్నాయి.. ఈడొచ్చిన పిల్లలకు పెళ్లిళ్లూ కావడం లేదు. ఎవరికైనా రోగమో రొచ్చో వస్తే.. వైద్యం చేయించుకునే పరిస్థితి లేదు. ఇదీ శ్రీకాకుళం జిల్లాలోని భావనపాడు పోర్టు నిర్మాణానికి భూసేకరణ చేయనున్న తీరప్రాంత గ్రామాల ప్రజల దుస్థితి.

06/07/2016 - 06:51

కనగానపల్లి/తుగ్గలి, జూన్ 6: సీమలో రెండు ఘటనల్లో నలుగురు చిన్నారులు మృతి చెందారు. అనంతపురం జిల్లా తూముచెర్లలో సోమవారం ఈతకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు నీట మునిగి చనిపోయారు. మల్లేషు, నిర్మలమ్మ దంపతుల కుమారులు తేజ(10), తరుణ్(8) మరికొంతమంది పిల్లలతో కలిసి పారంఫాండ్‌లో నిలిచిన నీళ్లలో ఈత కొట్టేందుకు వెళ్లారు. వీరిద్దరికీ ఈత రాకపోవడంతో నీట మునిగారు.

06/07/2016 - 06:51

గుంటూరు, జూన్ 6: రాజకీయాల్లో పెచ్చుమీరుతున్న దూషణల పర్వాన్ని నియంత్రించేందుకు అంబుడ్స్‌మెన్ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు.

06/07/2016 - 06:50

మార్కాపురం, జూన్ 6: అవినీతి నిరోధక శాఖ అధికారులు సోమవారం సాయంత్రం ప్రకాశం జిల్లా మార్కాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై దాడులు నిర్వహించారు. అనధికారికంగా ఉన్న 2,95,250 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎసిబి డిఎస్పీ ఆర్‌విఎస్‌ఎన్ మూర్తి మాట్లాడుతూ మార్కాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై తమ కార్యాలయానికి అనేక ఫిర్యాదులు అందాయని, దీంతో దాడులు నిర్వహించామని తెలిపారు.

06/07/2016 - 06:50

సామర్లకోట, జూన్ 6: సిపిఐ ఎంఎల్ ప్రతిఘటన కేంద్ర కమిటీ సభ్యుడు, కమ్యూనిస్టు యోధుడు మొగులూరి సోమాచారి (95) సోమవారం మధ్యాహ్నం తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలోని తన ఇంట్లో తుది శ్వాస విడిచారు. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ నాటి 1938 కాలంలో సామర్లకోట కార్యదర్శిగా పనిచేస్తూ సామర్లకోట డెక్కన్ సుగర్స్ ఫ్యాక్టరీలో పనిచేశారు.

06/07/2016 - 06:49

అనంతపురం, జూన్ 6: వైకాపా అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సైకోలా వ్యవహరిస్తున్నారని మంత్రులు కామినేని శ్రీనివాస్, పల్లె రఘునాథ్‌రెడ్డి అన్నారు. తనస్థాయి మరిచి బాధ్యతాయుతమైన సిఎం పదవిలో ఉన్న చంద్రబాబునాయుడుపై అనుచితవ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. సోమవారం అనంతపురం నగరంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రజలను రెచ్చగొట్టేలా చెప్పులు, చీపుళ్లు వంటి భాషను సిఎంపై వాడడం సిగ్గుచేటన్నారు.

06/07/2016 - 06:49

చంద్రగిరి, జూన్ 6: ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను చంద్రబాబు నాయుడు నెరవేర్చలేదంటు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సోమవారం చిత్తూరు జిల్లా చంద్రగిరి పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. బాబు ఇచ్చిన హామీలు నెరవేర్చని కారణంగా ఈనెల 9వ తేదీన రాష్టవ్య్రాప్తంగా అన్ని పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదులు చేయాలని వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందేనన్నారు.

Pages