S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

10/13/2018 - 01:56

విజయవాడ, అక్టోబర్ 12: రాష్ట్రంలో పాఠశాల విద్యలో ప్రమాణాల పెంపునకు అనేక వినూత్న సంస్కరణలు ప్రవేశపెడుతున్నామని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. విజయవాడలో పలు స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో చేపడుతున్న పథకాలపై శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు.

10/13/2018 - 01:54

రావులపాలెం, అక్టోబర్ 12: ఆంధ్ర - ఒడిసా సరిహద్దుల్లో శుక్రవారం ఉదయం జరిగిన మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌ను ఇటీవల జరిగిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమా హత్యలకు ప్రతీకారంగా భావించనవసరం లేదని ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో కొత్తగా నిర్మించిన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయ భవనాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు.

10/13/2018 - 01:52

విజయవాడ, అక్టోబర్ 12: రాష్ట్రంలోని వివిధ జిల్లాల కలెక్టర్లతో సదస్సును ఈ నెల 24, 25 తేదీల్లో ప్రభుత్వం నిర్వహించనుంది. ఉండవల్లిలోని గ్రీవెన్స్ హాల్‌లో ఈ సదస్సు నిర్వహిస్తారు. వివిధ పథకాల అమలు తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష చేసి, అధికారులకు దిశానిర్దేశం చేస్తారు. ఇకపై ప్రతినెలా జిల్లా కలెక్టర్లతో సదస్సులు నిర్వహించాలని ఇప్పటికే సీఎం నిర్ణయించారు.

10/13/2018 - 01:51

బుట్టాయగూడెం, అక్టోబర్ 12: గృహ నిర్మాణానికి అనుకాని స్థలాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా కడుతున్న పునరావాస గృహసముదాయాలకు వ్యతిరేకంగా పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు జరుపుతున్న ఆందోళన శుక్రవారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

10/13/2018 - 01:49

న్యూఢిల్లీ, అక్టోబర్ 12: ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం కేంద్రాన్ని నిలదీసినందుకే బీజేపీ ప్రభుత్వం తనపై కుట్ర పూరితంగా ఆదాయపన్ను శాఖ(ఐటీ) దాడులు చేయిస్తోందని టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ ఆరోపించారు. హైదరాబాద్, కడప నగరాల్లో రమేశ్ నివాసాలు, కార్యాలయాల్లో శుక్రవారం ఐటీ శాఖ అధికారులు విస్తృత సోదాలు జరిపారు.

10/13/2018 - 01:48

విజయవాడ, అక్టోబర్ 12: గిరిజన ఉత్పత్తులను పట్టణ ప్రాంత వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చేందుకు రాష్టవ్య్రాప్తంగా 100 రిటైల్ షాపులు ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు వెల్లడించారు. వెలగపూడి సచివాలయం మూడో బ్లాక్‌లో గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ఏర్పాటు చేసిన రిటైల్ స్టాల్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించారు.

10/13/2018 - 01:47

విజయవాడ, అక్టోబర్ 12: శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో మంచినీటి సరఫరా పథకాలు పనిచేసేందుకు వీలుగా 16 భారీ జనరేటర్లను అక్కడికి తరలించారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు అధికారులు ఈ ఏర్పాట్లు చేశారు. తిత్లీ తుపాను ప్రభావిత రెండు జిల్లాల్లో సహాయక చర్యలపై ఢిల్లీ నుంచి మంత్రి శుక్రవారం సమీక్షించారు.

10/13/2018 - 01:47

విజయవాడ, అక్టోబర్ 12: జీఎస్టీ విధానంలో తాము జోక్యం చేసుకోలేమని 15వ ఆర్థిక సంఘం చైర్మన్ నంద్‌కిశోర్ సింగ్ స్పష్టం చేశారు. వెలగపూడి సచివాలయంలో నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలకు చెందిన ప్రజాప్రతినిధులతో శుక్రవారం ఆయన సమావేశమయ్యారు. నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల అవసరాలు, నిధుల కేటాయింపులపై అభిప్రాయాలను సేకరించారు.

10/12/2018 - 07:09

శ్రీకాకుళం, అక్టోబర్ 11: పెను తుపాను తిత్లీ శ్రీకాకుళం జిల్లాపై విరుచుకుపడింది. జిల్లాలోని వజ్రపుకొత్తూరు మండలం గొల్లపాడు, పల్లిసారధి మధ్య గురువారం తెల్లవారుజామున తీరాన్ని తాకి, గంటకు 160 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న తుపాను పెనుగాలులతో సిక్కోల్‌ను అతలాకుతలం చేసింది. ప్రచండ వేగంతో గాలులు విరుచుకుపడడంతో ఉద్దానంపై మరోసారి ప్రకృతి కరాళనృత్యం చేసింది.

10/12/2018 - 07:07

కాకినాడ, అక్టోబర్ 11: రియల్ మాఫియా ఆగడాలపై గోదావరి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (గుడా) ఎట్టకేలకు ఉక్కుపాదం మోపింది. తూర్పు గోదావరి జిల్లాలో నిబంధనలకు పూర్తి విరుద్ధంగా వేసిన అనధికార లే-అవుట్లపై గుడా అధికారులు గురువారం నుంచి ప్రత్యక్ష చర్యలకు నడుంబిగించారు.

Pages