S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

10/12/2018 - 07:06

రేణిగుంట, అక్టోబర్ 11: చిత్తూరు జిల్లా రేణిగుంట మండల పరిధిలోని కరకంబాడి, తిరుపతి మార్గమధ్యంలోని ఎల్‌ఐసీ భవనం వెనుక అడవిలోకి ప్రవేశిస్తున్న స్మగ్లర్లను అడ్డుకున్న టాస్క్ఫోర్స్ సిబ్బందిపై స్మగ్లర్లు దాడికి యత్నించారు. దీంతో టాస్క్ఫోర్స్ సిబ్బంది ఆత్మరక్షణ కోసం రెండు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒక స్మగ్లర్‌ను అరెస్ట్‌చేసిన సంఘటన బుధవారం తెల్లవారుజామున కరకంబాడి వద్ద జరిగింది.

10/12/2018 - 07:05

విజయవాడ, అక్టోబర్ 11: వివిధ రాజకీయ పార్టీలు చెప్పిన విషయాలు విన్నాక, ఏపీ ఇబ్బందులు తెలుస్తున్నాయని 15వ ఆర్థిక సంఘం చైర్మన్ నంద్ కిషోర్ సింగ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పర్యటిస్తున్న 15వ ఆర్థిక సంఘం వెలగపూడి సచివాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో గురువారం సమావేశమైంది. ఆయా పార్టీల నుంచి ఆ సంఘం సలహాలు, సూచనలు స్వీకరించింది.

10/12/2018 - 07:04

విజయవాడ(సిటీ), అక్టోబర్ 11: ప్రత్యేక హోదా కోసం మొదటి నుండి పోరాట చేస్తున్నది రాష్ట్రంలో ఒక్క వైకాపానేనని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. వైకాపా ఏంపీలు హోదా కోసం రాజీనామాలు చేసి ఆమరణ దీక్ష చేశారని, గుంటూరులో తమపార్టీ అధినేత జగన్ ఆమరణ దీక్ష చేస్తే దాన్ని భగ్నం చేసింది చంద్రబాబేనన్నారు.

10/12/2018 - 04:08

విజయవాడ, అక్టోబర్ 11: కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఒక రోజు పర్యటన నిమిత్తం హైదరాబాద్ నుండి గురువారం విమానంలో గన్నవరం చేరుకుని తిరిగి బయలుదేరి వెళ్లిన ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌కు ఘన స్వాగతం, వీడ్కోలు లభించింది.

10/12/2018 - 04:06

విశాఖపట్నం, అక్టోబర్ 11: నైరుతి రుతుపవనాలు నిష్క్రమించి, ఈశాన్య రుతుపవనాలు ఆరంభమయ్యాయంటే, ఏపీలోని కోస్తా తీర ప్రాంతవాసుల్లో ఎక్కడిలేని భయం అలముకుంటుంది. గడచిన 30 సంవత్సరాల నుంచి అనేక తుపాన్లను, హరికేన్లను కోస్తా ప్రజలు కళ్లారా చూశారు. ఈ 30 ఏళ్లలో వేలాది మంది ప్రాణాలను తుపానులు పొట్టనపెట్టుకున్నాయి. చేతికందిన పంట వరదపాలైంది. ఆవాసాలు కూలిపోయి లక్షల్లో జనం నిరాశ్రయులయ్యారు.

10/12/2018 - 04:03

పూసపాటిరేగ, అక్టోబర్ 11: తిత్లీ తుపాను ప్రభావంతో విజయనగరం జిల్లాకు చెందిన ముగ్గురు మత్స్యకారులు గల్లంతయ్యారు. బుధవారం రాత్రి 11 గంటల సమయంలో ఒడిశాలోని రామయ్యపట్నం వద్ద పడవ బోల్తా పడిన సంఘటనలో ఈ ముగ్గురూ గల్లంతు కాగా, మరో ఇద్దరు గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు.

10/12/2018 - 04:01

హైదరాబాద్, అక్టోబర్ 11: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హంద్రీనీవా బ్రాంచ్ కెనాల్‌కు శంకుస్థాపన చేసిన గంటల వ్యవధిలోనే ఆ పనులు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజక వర్గాల్లో హంద్రీనీవా ప్రాజెక్టు ప్రధాన కాలువ నుంచి బ్రాంచ్ కాలువలకు గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు.

10/12/2018 - 04:01

విజయవాడ, అక్టోబర్ 11: ప్రధాని నరేంద్రమోదీని ప్రశ్నించే ధైర్యం రాష్ట్రంలోని ప్రతిపక్ష నేతలకు లేదని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామిని ఎద్దేవా చేశారు.

10/12/2018 - 04:00

న్యూఢిల్లీ, అక్టోబర్ 11: నాదెండ్ల మనోహర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం వల్లన పార్టీకి ఎటువంటి నష్టం లేదని కాంగ్రెస్ ఏపీ శాఖ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి అన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ ఉమెన్ చాందీ, ఏఐసీసీ కార్యదర్శులు కృష్ణొపర్ తిలక్, సీడీ మెయప్పన్ తదితరులతోపాటు రఘువీరా రాష్ట్రంలో పార్టీ వ్యవహారాలపై గురువారం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో చర్చలు జరిపారు.

10/12/2018 - 03:59

విజయవాడ, అక్టోబర్ 11: రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు నాలుగు నెలలుగా చెల్లించాల్సిన బిల్లులు, వేతనాలు చెల్లించకుండా కార్మికులను అవమానాలకు గురి చేయడం ప్రభుత్వానికి తగదని, తక్షణమే బిల్లులు, వేతనాలు విడుదల చేయాలని ఏఐటీయుసి అనుబంధ ఏపీ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కే శైలజ, ఎం రమేష్‌లు డిమాండ్ చేశారు.

Pages