S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

10/08/2018 - 12:33

అమరావతి: సమర్థవంతమైన నీటి నిర్వహణతోనే దిగుబడులు సాధిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన నీరు-ప్రగతి, వ్యవసాయంపై టెలీకాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ గత మూడేళ్ల నుంచి వర్షపాతం లోటు ఉన్నా తట్టుకోగలిగామని చెప్పారు.

10/08/2018 - 12:31

పగిడ్యాల: కర్నూలు జిల్లా జూపాడుబంగ్లా లో తన ఇద్దరి పిల్లలను బ్లేడుతో గొంతుకోసి చంపిన తండ్రి ఉదంతం ఇది. జూపాడుబంగ్లాకు చెందిన బానోజీరావుకి ఝాన్సీలక్ష్మీబాయితో వివాహం జరిగింది. వీరికి లిఖిత(7), మధు (4) అనే ఇద్దరు పిల్లలు. భార్యభర్తల మధ్య విపరీతమైన గొడవలు జరుగుతుండేవి. ఈ నేపథ్యంలో భార్య భర్త, పిల్లలను వదిలేసి వేరొక వ్యక్తితో వెళ్లిపోయింది.

10/08/2018 - 12:31

అమరావతి: నగరి టిక్కెట్టు ఎవ్వరికి ఇచ్చినా కలిసి పనిచేస్తామని గాలి కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తెలిపారు. సోమవారంనాడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు భార్య, తనయులు ప్రభుత్వ విప్ బుద్దా వెంకన్నతో కలిసి చంద్రబాబునాయుడ్ని కలిశారు. నియోజకవర్గం నుంచి దాదాపు 350 మంది ముఖ్యనేతలు, కార్యకర్తల అభిప్రాయాలను చంద్రబాబు సేకరించారు.

10/08/2018 - 12:30

హైదరాబాద్: ఓటర్ల జాబితాలో అవకతవకలు చోటుచేసుకున్నాయని వేసిన పిటిషన్‌పై సోమవారంనాడు హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ తరపున న్యాయవాది జంధ్యాల రవి శంకర ప్రసాద్ వాదనలు వినిపించారు. విచారణలో భాగంగా ఈసీ ఓటర్ల తుది జాబితాను సమర్పించింది. దీనిపై మరిన్ని వివరణలు అందించేందుకు గడువు కావాలని పిటిషనర్ తరపున న్యాయవాది కోరటంతో విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది.

10/08/2018 - 02:19

విశాఖపట్నం, అక్టోబర్ 7: గీతం విద్యా సంస్థల చైర్మన్, ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి అంత్యక్రియలు విశాఖలో ఆదివారం జరిగాయి. మూర్తి పెద్ద కుమారుడు పట్ట్భా రామారావు తండ్రి చితికి నిప్పంటించారు. మూర్తి కుటుంబీకులతోపాటు ముఖ్యమంత్రి చంద్రబాబు సహా పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ నాయకులు, అభిమానులు, గీతం విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

10/08/2018 - 02:15

ఆలమూరు, అక్టోబర్ 7: కాపు రిజర్వేషన్లకు స్పష్టమైన హామీయిచ్చే పార్టీకే తమ మద్దతు ఇస్తామని, అప్పటి వరకూ వేచి చూస్తామని రాష్ట్ర కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అన్నారు. తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం చెముడులంకలో ఆదివారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. ఇప్పటికే రాష్ట్రంలో ఏడు జిల్లాల్లో పర్యటించి కాపు ఉద్యమ నేతలతో చర్చించామన్నారు.

10/08/2018 - 02:13

రాజమహేంద్రవరం, అక్టోబర్ 7: చిరు వ్యాపారులకు ముద్రా పథకం కింద హామీల్లేని రుణాలందించి వారి జీవన ప్రమాణాలు పెరగడానికి అర్బన్ బ్యాంకులు దోహదపడాలని ఏపీ రాష్ట్ర మార్కెటింగ్, గిడ్డంగులు, సహకార, మత్య్స శాఖ మంత్రి సిహెచ్ ఆదినారాయణరెడ్డి అన్నారు. రాష్ట్రంలోని అన్ని అర్బన్ బ్యాంకుల్లో పోస్టుల భర్తీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ ఇస్తామని మంత్రి పేర్కొన్నారు.

10/08/2018 - 02:11

కాకినాడ, అక్టోబర్ 7: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం శబరిమలైలో శ్రీ స్వామి అయ్యప్ప ఆలయ పవిత్రతను కాపాడాలని కోరుతూ వందలాది మంది అయ్యప్ప మాల ధరించిన స్వాములు, భక్తులు తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో ఆదివారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. నగరంలోని పోలీస్ రిజర్వ్డ్ లైన్‌లోని శ్రీ అయ్యప్ప ఆలయం నుండి ప్రారంభమైన ర్యాలీ జగన్నాథపురం వంతెన వరకూ సాగింది.

10/08/2018 - 02:10

గుడిబండ, అక్టోబర్ 7 : రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదాతోనే సాధ్యమని పీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి పేర్కొన్నారు. అనంతపురం జిల్లా గుడిబండ మండల పరిధిలోని జంబులబండ గ్రామంలో ఆదివారం ఇంటింటికీ కాంగ్రెస్ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రఘువీరా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాల గురించి ప్రజలకు వివరించారు.

10/08/2018 - 02:05

విజయవాడ (క్రైం): ‘ప్రపంచం నిద్రపోవాలంటే పోలీసు మేల్కోవాలి. నిరంతరం సమాజం కోసం పనిచేసే పోలీసు అంటే నాకు ఇష్టం’ అని ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు అన్నారు. అయితే పోలీసులు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఒత్తిళ్ళకు లొంగకూడదని, రాజకీయ ఒత్తిళ్ళకు అసలే తలొగ్గవద్దని, చట్టం, రాజ్యాంగమే మనకు బాస్ అని ఉద్ఘాటించారు. పోలీసులు ప్రజల స్నేహితులనే భావన వారిలో కలిగించే బాధ్యత అందరిపై ఉందన్నారు.

Pages