S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

10/09/2018 - 01:44

అమరావతి, అక్టోబర్ 8: ప్రభుత్వ సాయం కోసం పెద్దఎత్తున తరలివచ్చిన ఆపన్నులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభయహస్తం అందించారు.
సోమవారం ఉండవల్లి ప్రజావేదికలో పలువురికి ఆర్థికసాయం ప్రకటించారు. ఫించన్లు, ఉపకారవేతనాలు, ఇళ్లస్థలాలు, గృహ నిర్మాణం, వైద్యసేవల కోసం అర్థించగా, వారికి తక్షణం ఆర్థికసాయం అందించి సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
కేరళ వరద బాధితులకు ‘సెర్ప్’ సాయం

10/09/2018 - 00:14

విజయవాడ, అక్టోబర్ 8: మున్సిపల్ కార్మికుల పొట్టగొట్టే 279 జీఓ రద్దు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికుల పర్మినెంట్, సమాన పనికి సమాన వేతనం తదితర డిమాండ్లపై మున్సిపల్ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె సోమవారం ఐదో రోజు కూడా కొనసాగింది. ప్రభుత్వ నిర్బంధకాండ, అక్రమ అరెస్టులు, అధికారుల బెదిరింపులు, అధికార పార్టీ నాయకుల దాడులతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

10/09/2018 - 00:14

విజయవాడ, అక్టోబర్ 8: రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తుల నిల్వకు గోదాముల కొరతను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న గోదాముల నిల్వ సామర్థ్యాన్ని రెట్టింపు చేసేందుకు లక్ష్యంగా నిర్ణయించింది. వ్యవసాయ ఉత్పత్తులు నిల్వ చేసేందుకు సరిపడా గోదాములు లేకపోవడంతో రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను తక్కువ ధరకే విక్రయించాల్సి వస్తోంది.

10/09/2018 - 00:13

తిరుపతి, అక్టోబర్ 8: అన్ని రకాల క్రీడలకు వేదికగా విశాఖ, అమరావతి, తిరుపతి పట్టణాల్లో స్పోర్ట్స్ సిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర క్రీడల శాఖా మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. సోమవారం ఉదయం తిరుపతి ఎస్వీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను మంత్రి సందర్శించారు. ఈసందర్భంగా క్రీడాకారులతో కలిసి బ్యాడ్మింటన్ ఆడారు. జిమ్‌ను, స్విమ్మింగ్‌పూల్‌ను సందర్శించారు.

10/09/2018 - 00:13

అమరావతి, అక్టోబర్ 8: రాష్ట్రంలో 15వ ఆర్థిక సంఘం సభ్యులు మంగళవారం నుంచి పర్యటించనున్నారు. ఈ నెల 9న ఉదయం ఢిల్లీ నుంచి విమానంలో బయల్దేరి మధ్యాహ్నం 2.15కి తిరుపతి చేరుకుంటారు. భోజన విరామానంతరం మధ్యాహ్నం 3.45 గంటలకు తిరుచానూర్ పద్మావతీ ఆలయాన్ని సందర్శిస్తారు. 5గంటలకు తిరుమలకు చేరుకుని రాత్రికి బస చేస్తారు. బుధవారం ఉదయం స్వామివారిని దర్శించుకుని ఉదయం 11.30 గంటలకు శ్రీకాళహస్తి చేరుకుంటారు.

10/09/2018 - 00:11

విజయవాడ, అక్టోబర్ 8: ప్రధాని నరేంద్రమోదీ కనుసన్నల్లో కేంద్ర ఎన్నికల సంఘం నడుస్తూ రాజ్యాంగ విరుద్ధమైన చర్యలకు పాల్పడుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ విమర్శించారు. విజయవాడ దాసరిభవన్‌లో సోమవారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీలో వైసీపీ ఎంపీలు వారి పదవులకు రాజీనామాలు చేయగా ఏర్పడిన ఖాళీలకు ఎందుకు ఎన్నికలు నిర్వహించట్లేదని ప్రశ్నించారు.

10/09/2018 - 00:10

విజయవాడ, అక్టోబర్ 8: కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలో త్వరలో శాశ్వత భూధార్ సంఖ్యను కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. భూసేవ కింద భూధార్ ప్రాజెక్టును పైలట్ ప్రాజెక్టుగా అమలుకు కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం, ఉయ్యూరు నగర పంచాయతీలను ఎంపిక చేసింది. జగ్గయ్యపేట మండలంలో పైలట్ ప్రాజెక్టు విజయవంతం కావడంతో శాశ్వత సంఖ్యను కేటాయించేందుకు రంగం సిద్ధం చేస్తోంది.

10/09/2018 - 00:10

మళ్లీ అధికారం మాదే
* జగన్ కాశీ యాత్ర చేసుకోవాలి
* మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు
=======================================

10/09/2018 - 00:09

విజయవాడ, అక్టోబర్ 8: రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఆధునిక సాంకేతిక పరిజానాన్ని ఉపయోగిస్తున్న నేపథ్యంలో నూతన నియామకాల నిబంధనల్లో మార్పులు అవసరమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పుణేఠ వ్యాఖ్యానించారు. వెలగపూడి సచివాలయంలో ఆయన తన కార్యాలయంలో ఈ-ప్రగతి, ఆర్టీజీ, కాగిత రహిత కార్యాలయాలపై సోమవారం సమీక్ష నిర్వహించారు.

10/09/2018 - 00:08

మూడేళ్లలో రూ. 1000 కోట్ల పెట్టుబడి
లిడ్‌క్యాప్, సీఎల్‌ఆర్‌ఐ,
సీఎస్‌ఐఆర్ మధ్య అవగాహన ఒప్పందం
కాలుష్య రహిత పరిశ్రమలు నెలకొల్పాలని ముఖ్యమంత్రి ప్రతిపాదన
=======================================

Pages