S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

05/09/2019 - 22:13

న్యూఢిల్లీ, మే 9: వరుసగా రెండోరోజు విఫణి వీధిలో బంగారం ధరలు మెరిశాయి. దేశ రాజధాని ఢిల్లీలో పది గ్రాములు (తులం) బంగారం ధర గురువారం రూ. 40 పెరిగి మొత్తం ధర రూ. 32,890కి చేరింది. స్థానిక జువలరీ వ్యాపారుల నుంచి డిమాండ్ పెరగడంతోబాటు అంతర్జాతీయంగా సైతం సానుకూల పరిస్థితులు నెలకొనడం బంగారం ధరలు పెరిగేందుకు దోహదం చేసినట్టు అఖిల భారత సరాఫా అసోసియేషన్ తెలిపింది.

05/09/2019 - 22:12

ముంబయి, మే 9: దేశంలోని ప్రధాన ప్రాంతాల రూట్లలో ఈనెల 11 నుంచి బిజినెస్ క్లాస్ టికెట్లను ఆఫర్ చేస్తున్నట్టు ప్రైవేటు విమాన యాన సంస్థ స్పైస్ జెట్ గురువారం నాడిక్కడ తెలిపింది. దేశీయంగా సరసమైన టికెట్ ధరలను అందజేస్తున్న ఈ సంస్థ సరికొత్త ఆఫర్‌ను బోయింగ్ 737 నిర్వహణల ద్వారా ఆరంభించనున్నట్టు తెలిపింది.

05/09/2019 - 04:16

మదనపల్లె: చిత్తూరు జిల్లాలో లభించే చింతపండుకు దక్షిణాధి రాష్ట్రాలలో డిమాండ్ పెరిగింది. గత ఏడాది మినహా ఐదారేళ్లుగా సరైన ధర లేక దిగాలుపడిన చింతపండు రైతులు, వ్యాపారులకు ఈఏడాది అశాజనకమైన ధరలు లభిస్తున్నాయి. గింజలు తీసి శుభ్రం చేసిన ఎండిన చింతపండుకు అప్పట్లో రూ.100లు లభించగా నేడు రూ.150లు ధర పలుకుతోంది.

05/09/2019 - 04:12

రాజమహేంద్రవరం, మే 8: పౌల్ట్రీ పరిశ్రమ వేసవి కష్టాలను ఎదుర్కొంటోంది. మాంసం కోసం ఉపయోగించే బ్రాయిలర్ కోళ్లు బరువు తగ్గడం, ఉష్ణోగ్రత తీవ్రతకు చనిపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. మరోపక్క గుడ్లు కోసం నిర్వహించే లేయర్ ఫారం కోళ్లు సైతం చనిపోతుండటం, దిగుబడి తగ్గడం, దాణా ధరలు పెరిగిపోవడం వంటి సమస్యలు చుట్టుముడుతున్నాయి. రాష్ట్రంలో రోజుకు 5 కోట్ల నుండి 6 కోట్ల వరకు గుడ్లు ఉత్పత్తవుతాయి.

05/09/2019 - 01:04

హైదరాబాద్, మే 8: తెలంగాణ పరిశ్రమల రంగానికి మహర్దశపట్టింది. పెట్టుబడుల వెల్లువ నిరాటంకంగా కొనసాగుతోంది. టీఎస్ ఐపాస్ పారిశ్రామిక విధానం సూపర్ హిట్టయింది. గత ఐదేళ్లలో టీఎస్ ఐపాస్ పారిశ్రామిక విధానానికి ఆకర్షితులై పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చాయి. రాష్ట్ర పరిశ్రమల శాఖ తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. టీఎస్ ఐపాస్‌ను కేసీఆర్ సర్కార్ 2015 జనవరి 1వ తేదీన ఆవిష్కరించింది.

05/08/2019 - 23:10

న్యూఢిల్లీ: భారత్-చైనా దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలకు రంగం సిద్ధమైంది. ఇరు దేశాల అధికారులు బుధవారం ఇక్కడ సమావేశమై వివిధ అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలు ఈ చర్చలో కీలకం కానున్నాయి. చైనా కస్టమ్స్, సాధారణ పాలన శాఖ ఉప మంత్రి లీ కుయొ తమ దేశ బృందానికి నాయకత్వం వహిస్తారు.

05/08/2019 - 23:09

న్యూఢిల్లీ, మే 8: మైనింగ్ దిగ్గజం వేదాంత చత్తీస్‌గఢ్‌లోని యూనిట్‌లో ఉత్పత్తి మిలియన్ టన్నుల మైలురాయికి చేరింది. ఇక్కడ వెలికితీస్తున్న బొగ్గు ఏడాదికి బిలియన్ టన్నులు ఉంటుందని ఆ కంపెనీ బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. 2015లో పెరిగిన బొగ్గు గనుల వేలంలో చత్తీస్‌గఢ్‌లోని చోటియా బ్లాక్‌ను వేదాంత పాడుకుంది.

05/08/2019 - 23:07

న్యూఢిల్లీ, మే 8: టెలికాం రంగం అభివృద్ధి దేశంలో స్థిరంగా కొనసాగుతోంది. విస్తారమైన మార్కెట్ దేశంలో ఉన్నప్పటికీ పోటీ కూడా అంతే తీవ్రంగా ఉంది. దీంతో వివిధ మొబైల్ కంపెనీలు సరికొత్త ప్రణాళికలతో ముందుకు వస్తున్నాయి. సరికొత్త ప్రణాళికలను ఎప్పటికప్పుడు సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రత్యర్థుల కంటే మెరుగైన సేవలను అందించడం ద్వారా ఖాతాదారులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.

05/08/2019 - 23:05

ముంబయి, మే 8: భారత స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. అంతర్జాతీయ సూచీలు ప్రతికూల ధోరణిని ప్రదర్శించడంతో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజి (బీఎస్‌ఈ)లో సెనె్సక్ వేగంగా 487.50 పాయింట్లు పతనమై 37,789.13 పాయింట్లకు పడిపోయింది. జాతీయ స్టాక్ మార్కెట్ (ఎన్‌ఎస్‌ఈ)లో నిఫ్టీ కూడా నష్టాలను చవిచూసింది. 138.45 పాయింట్లు పతనమై 11,359.45 పాయింట్లుగా నమోదైంది.

05/08/2019 - 23:04

న్యూఢిల్లీ, మే 8: ఖాతాదారులకు మెరుగైన సేవలను అందించడానికి వీలుగా భారత్‌పే సంస్థ కొత్త యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. యూపీఐ క్యూఆర్ కోడ్స్ ప్రాతిపదికగా ఈ యాప్ పనిచేస్తుంది. వ్యాపారవేత్తలు తమతమ ఖాతాదారులకు సంబంధించిన నగదు, అరువు, కొనుగోళ్లు, ఇతరత్రా అంశాల్లో ఈ యాప్‌లో నిక్షిప్తం చేయవచ్చు. అదేవిధంగా చెల్లింపు లింకులను ఖాతాదారులకు పంపవచ్చు.

Pages