S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

01/12/2019 - 23:46

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,128.00
8 గ్రాములు: రూ.25,024.00
10 గ్రాములు: రూ. 31,280.00
100 గ్రాములు: రూ.3,12,800.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,345.455
8 గ్రాములు: రూ. 26,763.64
10 గ్రాములు: రూ. 33,454.55
100 గ్రాములు: రూ. 3,34,545.5
వెండి
8 గ్రాములు: రూ. 331.20

01/11/2019 - 21:02

న్యూఢిల్లీ, జనవరి 11: వాటాల బై బ్యాక్‌కు ఇన్ఫోసిస్ సిద్ధమైంది. 8,260 కోట్ల రూపాయల విలువైన వాటాలను తిరిగి కొనాలని పాలక మండలి నిర్ణయించినట్టు ఇన్ఫోసిస్ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. 13,000 కోట్ల రూపాయల పెట్టుబడుల కేటాయింపులో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.

01/11/2019 - 21:01

ముంబయి, జనవరి 11: లావాదేవీలకు ఈవారం చివరి రోజైన శుక్రవారం స్వల్ప నష్టంతో స్టాక్ మార్కెట్ ముగిసింది. నాలుగు రోజుల వరుస లాభాలకు గురువారం గండిపడిన విషయం తెలిసిందే. అయితే, అంతర్జాతీయ మార్కెట్ సూచీలు సానుకూల ధోరణులను ప్రదర్శిస్తున్న నేపథ్యంలో, బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లోనూ లాభాలు నమోదవుతాయన్న అభిప్రాయం వ్యక్తమైంది.

01/11/2019 - 20:55

హైదరాబాద్, జనవరి 11: జీఎస్‌టీ మినహాయింపును రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షలుగా రెట్టింపు చేయడం పట్ల ‘్ఫక్కీ’ హర్షం వ్యక్తం చేసింది. దీంతో సింప్లిఫైడ్ కంపోజిషన్ స్కీంతో పాటు తన పరిథిలోకి సర్వీస్ ప్రొవైడ్లను తీసుకుని రావడం ద్వారా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా ఎంటర్‌ప్రైజ్‌లకు గొప్ప ప్రయోజనం చేకూరుతుందని ‘్ఫక్కీ’ ప్రెసిడెంట్ సందీప్ సోమాని అన్నారు.

01/11/2019 - 20:53

న్యూఢిల్లీ, జనవరి 11: కంపెనీకి ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా వ్యవహరించే అవకాశం కిరణ్ మజుందార్ షాకు ఇన్ఫోసిస్ రెండోసారి కల్పించింది. ఏప్రిల్ ఒకటి నుంచి అమె అధికారికంగా బాధ్యతలు తీసుకుంటారు. సుమారు మూడు సంవత్సరాలు పాటు ఆమె ఈ పదవిలో ఉంటారు. ఆమెకు ఉన్న అపారమైన అనుభవం, వివిధ అంశాలపట్ల అవగాహన కంపెనీకి ఎంతగానో ఉపయోగపడతాయని ఇన్ఫోసిస్ చైర్మన్ నందన్ నీలెకనీ ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు.

01/11/2019 - 20:51

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,128.00
8 గ్రాములు: రూ. 25,024.00
10 గ్రాములు: రూ. 31,280.00
100 గ్రాములు: రూ. 3,12,800.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,345.455
8 గ్రాములు: రూ. 26,763.640
10 గ్రాములు: రూ. 33,454.550
100 గ్రాములు: రూ. 3,34,545.50
వెండి
8 గ్రాములు: రూ. 331.20

01/11/2019 - 02:30

విజయవాడ(సిటీ): ప్రైవేటు ఆపరేటర్ల పోటీని ఎదుర్కోవడంతోపాటు మెరుగైన సేవలను అందించి ప్రయాణికులకు మరింత చేరువయ్యేందుకు ఆర్టీసీ యాజమాన్యం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని వీలైనన్ని ఎక్కువ ఏసీ సర్వీసులను నడిపేందుకు రంగం సిద్ధం చేసింది. కొత్తగా వివిధ రకాల 84 ఏసీ బస్సులను కొనుగోలు చేసింది. వీటిలో ఇంద్ర 48, అమరావతి 4 బస్సులు ఉన్నాయి.

01/11/2019 - 00:31

న్యూఢిల్లీ, జనవరి 10: చిన్న వర్తకులకు శుభవార్త. ఇంతకాలం వార్షిక టర్నోవర్ రూ.20 లక్షలుంటే వస్తు సేవా పన్నును చెల్లించే పరిమితిని రూ.40 లక్షలకు పెంచుతూ వస్తు సేవా పన్ను మండలి నిర్ణయం తీసుకుంది. అలాగే కాంపోజిషన్ స్కీం కింద ఉన్న గరిష్టపరిమితిని రూ.1.5 కోట్లకు పెంచారు. ఈ వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. గురువారం వస్తుసేవా పన్ను మండలి సమావేశం జరిగింది.

01/10/2019 - 23:45

ముంబయి, జనవరి 10: గత డిసెంబర్ మాసంలో మనదేశంలో ఉద్యోగ నియామకాల శాతం పెరిగింది. అంతకు క్రితం సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఈ నియామకాలు 8 శాతం అధికంగా జరిగాయి. ప్రధానంగా మోటారు వాహనాలు, సహకార రంగాలతోబాటు మానవ వనరుల విభాగాల్లో ఈ నియామకాలు అధికంగా జరిగాయని నౌకరీ వెబ్‌సైట్ అధ్యయన నివేదిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

01/10/2019 - 23:44

ముంబయి, జనవరి 10: బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో వరుసగా నాలుగు రోజులు లాభాలను ఆర్జించిపెట్టిన లావాదేవీలు గురువారం నీరసించాయి. బుల్ రన్ కొనసాగుతుందని అంతా ఊహించగా, అందుకు భిన్నంగా అమ్మకాలు, కొనుగోళ్ల మధ్య ఊగిసలాడింది. చివరికి 106.41 పాయింట్లు (0.29 శాతం) నష్టపోయి 36,106.50 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 33.55 పాయింట్లు (0.31 శాతం) పతనమై, 10,821.60 పాయింట్లుగా నమోదైంది.

Pages