S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

01/10/2019 - 23:43

పనాజీ, జనవరి 10: సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని గోవా ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకుగాను 500 క్లస్టర్ గ్రామాలను ప్రత్యేకంగా ఎంపిక చేసినట్టు ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి విజయ్ సర్దేశాయ్ గురువారం నాడిక్కడ వెల్లడించారు. వ్యవసాయ రంగంలో రాష్ట్రాన్ని ‘బ్రాండ్ గోవా’గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు.

01/10/2019 - 23:40

ముంబయి, జనవరి 10: బ్రాండ్ మార్కెటింగ్ ప్రచార వేధికల్లో ప్రఖ్యాత సామాజిక మాధ్యమ యాప్ ఇన్‌స్టాగ్రామ్ అగ్రభాగాన్ని ఆక్రమించింది. మార్కెట్‌ను ప్రభావితం చేసే స్థాయికి చేరిందని తాజా అధ్యయన నివేదిక వెల్లడించింది. ఫేస్‌బుక్ ఫొటో, వీడియో షేరింగ్ సామాజిక మాధ్యమ సేవా విభాగంగా ఉన్న ఈ ఇన్‌స్టాగ్రాంలో 77 శాతం బ్రాండెడ్ వస్తువులు నమోదై ఉన్నాయి.

01/10/2019 - 23:40

న్యూఢిల్లీ, జనవరి 10: ప్రైవేటురంగంలోని బంధన్ బ్యాంకు గురువారం త్రైమాసిక వ్యాపార గణాంకాలను వెల్లడించింది. గడచిన డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికి ఈ బ్యాంకు రూ.331.25 కోట్ల లాభాలను గడించింది. అంతకు క్రితం సంవత్సరం ఇదే కాలానికి బేరీజు వేసుకుంటే ఈ లాభాలు 10.3 శాతం అధికం. గత అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు బ్యాంకు మొత్తం ఆదాయం 1,883.85 కోట్ల రూపాయలు పెరిగింది.

01/10/2019 - 23:38

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,128.00
8 గ్రాములు: రూ.25,024.00
10 గ్రాములు: రూ. 31,280.00
100 గ్రాములు: రూ.3,12,800.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,345.455
8 గ్రాములు: రూ. 26,763.64
10 గ్రాములు: రూ. 33,454.55
100 గ్రాములు: రూ. 3,34,545.5
వెండి
8 గ్రాములు: రూ. 332.00

01/10/2019 - 04:14

విజయవాడ: రాష్ట్రంలో ఫిన్‌టెక్ రంగానికి సీఐఐ సహకారం అందించేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు ఐటీ శాఖ మంత్రి లోకేష్ సమక్షంలో సీఐఐ, ఏపీ ఫిన్‌టెక్ వ్యాలీ మధ్య బుధవారం ఒప్పందం కుదిరింది. ఒప్పందంలో భాగంగా ఆర్బీఐ, దేశంలోని వివిధ ఫైనాన్స్ వ్యవస్థలు, ఫైనాన్స్ కంపెనీలతో సమన్వయ వేదికను సీఐఐ ఏర్పాటు చేయనుంది.

01/10/2019 - 02:38

న్యూఢిల్లీ: కేంద్రప్రభుత్వం పరిశ్రమల అభివృద్ధికి చేపట్టిన ముద్ర స్కీం వల్ల మహిళలు మంచి లబ్ధి పొందుతున్నారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సంఘటిత రంగంలో పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను ఉపయోగించుకునేందుకు మహిళలు ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు.

01/09/2019 - 23:31

ముంబయి, జనవరి 9: భారత స్టాక్ మార్కెట్ బుధవారం మరింత పుంజుకుంది. లాభాలను కొనసాగిస్తూ వచ్చిన సెనె్సక్స్ మరోసారి 36,000 పాయింట్లను అధిగమించింది. లావాదేవీలు మొదలైనప్పటి నుంచి సానుకూల ధోరణులు కనిపించడంతో, మదుపరులు కూడా స్టాక్స్ కొనుగోళ్లకు ఆసక్తిని ప్రదర్శించారు. మధ్యలో కొన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ, మొత్తం మీద ట్రేడింగ్ ఆశాజనకంగానే కొనసాగింది.

01/09/2019 - 23:29

ముంబయి, జనవరి 9: ఇప్పటి వరకు ముమ్మరంగా జరుగుతున్న భారత రొయ్యల ఎగుమతులు 2019లో సుమా రు 7నుంచి 10 శాతం నెమ్మదించే అవకాశం ఉందని రేటిం గ్ ఏజెన్సీ ఇక్రా నివేదిక హెచ్చస్తోంది. 2013 నుంచి 2017 వరకు వరుసగా నాలుగేళ్లపాటు రొయ్యల ఎగుమతుల్లో గణనీయమైన అభివృద్ధి చోటుచేసుకుంది. గడచిన నాలుగేళ్లలో మనదేశ ఎగుమతులు ప్రతి యేటా సుమారు 17 శాతం పెరిగాయని ఆ నివేదిక వెల్లడించింది.

01/09/2019 - 23:27

హైదరాబాద్, జనవరి 9: అమెరికాలోని తమ సబ్సిడిరీ కంపెనీకి సరఫరా చేసిన అనస్తేషియా ఇంజక్షన్లకు సంబంధించిన 13,918 కార్టన్లను సన్‌ఫార్మాస్యూటికల్ స్వచ్ఛందంగా వెనక్కి రప్పిస్తోంది. తాము సరఫరా చేసిన వెక్యురోనియమ్ బ్రొమైడ్ 10 ఎంజీ, 20 ఎంజీ ఇంజక్షన్లలోని కణరూప ద్రవ్యంలో గాజు అవశేషాలను గుర్తించినందున వాటిని స్వచ్ఛందంగా వెనక్కి రప్పిస్తున్నట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి.

01/09/2019 - 23:25

న్యూఢిల్లీ, జనవరి 9: కొల్‌కతాకు చెందిన గోల్డన్ పరివార్ హోల్డింగ్ అండ్ డెవలపర్స్ సంస్థతోబాటు దానికి సంబందించిన ఏడు ప్రమోటింగ్ సంస్థలు ప్రజల నుంచి నిధులు సమీకరించకూడదంటూ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ఆంక్షలు విధించింది. ఈ సంస్థలు అక్రమ పద్ధతుల్లో నిధుల సమీకరణ చేస్తున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో సెబీ ఈ ఆంక్షల కొరడా ఝళిపించింది.

Pages