S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

01/14/2019 - 23:39

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,156.00
8 గ్రాములు: రూ.25,248.00
10 గ్రాములు: రూ. 31,560.00
100 గ్రాములు: రూ.3,15,600.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,375.401
8 గ్రాములు: రూ. 27,003.208
10 గ్రాములు: రూ. 33,754.01
100 గ్రాములు: రూ. 3,37,540.1
వెండి
8 గ్రాములు: రూ. 331.20

01/14/2019 - 04:43

ముంబయి: స్టాక్ మార్కెట్ ఎటు వైపు వెళుతున్నదనే ప్రశ్న అటు మదుపరులను, ఇటు బ్రోకర్లను తీవ్రంగా వేధిస్తున్నది. లాభాలను నమోదు చేస్తున్న సమయంలోనే హఠాత్తుగా నష్టాలను ఎదుర్కోవడం, నష్టాలు తప్పవని నిర్ధారణకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా లాభాల బాట పట్టడం ఇటీవల కాలంలో సాధారణమైంది. గత వారం చివరిలో నష్టాలతో ముగిసిన సెనె్సక్స్ ఈవారం ఎలాంటి ఫలితాలను నమోదు చేస్తుందనేది ఆసక్తి రేపుతున్నది.

01/13/2019 - 23:48

ముంబయి, జనవరి 13: కేంద్ర ప్రభుత్వ ఒత్తిడో లేక తమకు స్వతంత్ర ప్రతిపత్తి ఉందని నిరూపించుకోవడానికి చేసే ప్రయత్నమో తెలియదుగానీ, ఫోరెక్స్ మార్కెట్‌లో ఆర్‌బీఐ జోక్యం పెరిగిపోయింది. ఒక ఏడాది కాలంలో కొనుగోలు చేసిన డాలర్ల కంటే అమ్మిన డాలర్ల విలువ ఎక్కువగా ఉన్నప్పుడు, అలాంటి అమ్మకాలు జరిగిన సంస్థ లేదా వ్యక్తిని నెట్ సెల్లర్ అంటారు.

01/13/2019 - 23:46

కోల్‌కతా, జనవరి 13: విద్యుత్ ఉత్పత్తిలో నిర్ధారిత లక్ష్యాలను చేరుకోవాలంటే, మరింత బొగ్గు అవసరమవుతుందని, ప్రస్తుతం ఉన్న లోటును భర్తీ చేసే విధంగా సరఫరా చేయాలని నేషనల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎన్‌సీఎల్)ను ఎన్‌టీపీసీ కోరుతున్నది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్‌టీపీసీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గుర్‌దీప్ సింగ్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు.

01/13/2019 - 23:44

న్యూఢిల్లీ, జనవరి 13: గత వారం గ్లోబల్ మార్కెట్ ఒడిదుడుకుల మధ్య కొనసాగినప్పటికీ, చివరికి 0.2 శాతం లాభాలతో ముగిసింది. అయితే, ట్రేడింగ్ సమయంలో ఎదురైన అనుభవాలను విశే్లషించి, కొత్త వారంలో ప్రపంచ మార్కెట్ ఆచితూచి అడుగు వేయనుంది. అమెరికా, చైనా దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధానికి ఇంకా తెరపడలేదు. ఇరు దేశాలకు చెందిన ప్రతినిథుల సమావేశం వివరాలుగానీ, తీసుకున్న నిర్ణయాలుగానీ ఇంకా బహిర్గతం కాలేదు.

01/13/2019 - 04:34

లండన్: యూరోపియన్ యూనియన్ (ఈయూ)తో ఆర్థిక పరమైన ఒప్పందాలను రద్దు చేసుకొని, విడిపోవాలన్న యునైటెడ్ కింగ్డమ్ (యూకే) ప్రయత్నం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం కనిపిస్తున్నది. ‘బ్రెగ్జిట్’గా అందరికీ తెలిసిన ఈ వ్యవహారం చాలాకాలంగా నానుతున్నది. అయితే, ఇటీవల ప్రజాభిప్రాయ సేకరణ జరగడంతో, వాటి ఫలితాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తిని రేపుతున్నది.

01/12/2019 - 23:52

ముంబయి, జనవరి 12: త్వరలో కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి సురేష్ ప్రభు ప్రకటించారు. అంతర్జాతీయ పారిశ్రామిక, వాణిజ్య రంగంతో అనుసంధానానికి వీలుగా కొత్త పారిశ్రామికవిధానం ఉంటుందన్నారు. ప్రపంచంలోని అన్ని దేశాలతో వాణిజ్య లావాదేవీలు చేసేందుకు వీలుగా ప్రణాళికను ఖరారు చేస్తామన్నారు.

01/12/2019 - 23:50

న్యూఢిల్లీ, జనవరి 12: బంగారం మార్కెట్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయి. పదిగ్రాముల పసిడి ధర వారాంతానికి రూ.275 తగ్గి రూ.32వేల దిగువకు పడిపోయింది. అంతర్జాతీయంగా మార్కెట్లు బలహీనంగా ఉండడం, స్థానిక ఆభరణం వర్తకుల నుండి పెద్దగా డిమాండ్ లేకపోవడంతో బంగారం ధరల్లో ఒడిదుడుకులు ఉన్నట్లు మార్కెట్ వర్కాలు అభిప్రాయం వ్యక్తం చేశాయి. వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. కేజీ వెండి ధరపై రూ.650 తగ్గింది.

01/12/2019 - 23:48

న్యూఢిల్లీ, జనవరి 12: దేశంలో నాల్గవ అతి పెద్ద ప్రైవేట్ బ్యాంక్ యస్ బ్యాంక్ నాన్ ఎగ్జిక్యూటివ్ పార్ట్‌టైం చైర్మన్‌గా బ్రహ్మ దత్ నియమితులయ్యారు. ఈ మేరకు బ్రహ్మదత్ నియామకాన్ని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖరారు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆయన ఈ పదవిలో 2020 జూలై 4వ తేదీ వరకు ఉంటారు. బ్రహ్మదత్ 2013 జూలై నుంచి యస్ బ్యాంక్ బోర్డులో ఉంటున్నారు. గత ఐదున్నరేళ్లుగా అన్ని సబ్ కమిటీల్లో ఆయన పనిచేశారు.

01/12/2019 - 23:47

ముంబయి, జనవరి 12: నిర్మాణ రంగ సంస్థ ‘అరవింద్ స్మార్ట్ స్పేసెస్’ ఈ ఏడాది సుమారు 250 కోట్ల రూపాయలు పెట్టుబడులతో సంస్థను విస్తరించాలని నిర్ణయించింది.

Pages