S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

01/18/2019 - 04:17

ముంబయి: గత రెండు రోజుల మాదిరిగానే గురువారం కూడా ముంబయి స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో లావాదేవీలు లాభనష్టాల మధ్య ఊగిసలాడాయి. అయితే, చివరికి 52.79 పాయింట్లు (0.15 శాతం) పెరిగిన సెనె్సక్స్ 36,374.08 పాయింట్ల వద్ద ముగిసింది. అదే విధంగా నిఫ్టీ 10,905.20 పాయింట్లు (0.14 శాతం) పెరగడంతో ట్రేడింగ్ ముగిసే సమయానికి 10,905.20 పాయింట్లుగా నమోదైంది.

01/17/2019 - 23:41

న్యూఢిల్లీ, జనవరి 17: జాతీయ బులియన్ మార్కెట్‌లో గురువారం బంగారానికి డిమాండ్ పెరిగింది. పది గ్రాముల ధర 33,190 రూపాయలుగా మొదలైన మార్కెట్‌లో దేశీయ జ్యువెలరీ వర్తకులు, వ్యక్తుల కొనుగోళ్లు పెరిగాయి. దీనితో 110 రూపాయలు పెరిగిన పది గ్రాముల పసిడి ధర 33,300 రూపాయలకు చేరింది. అయితే, వెండి మాత్రం నష్టాలను ఎదుర్కొంది. కిలో వెండి ఏకంగా 300 రూపాయలు తగ్గడంతో, 40,200 రూపాయలకు పడిపోయింది.

01/17/2019 - 23:39

న్యూఢిల్లీ, జనవరి 17: ఫిన్‌టెక్ స్టార్టప్ ఇన్‌స్టామోజో తన ప్రస్తుత పెట్టుబడిదారుల నుంచి ఏడు మిలియన్ డాలర్లు (రూ.50కోట్లు) సమీకరించినట్టు బుధవారం నాడిక్కడ తెలిపింది. ఎనీపే, కలారి, బీనెక్ట్స్‌తోబాటు ఏంజెల్ ఇనె్వస్టర్ రష్మీక్వాట్రా సంస్థలు ఈ పెట్టుబడులు పెట్టాయని సంస్ధ వివరిచింది.

01/17/2019 - 23:38

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,166.00
8 గ్రాములు: రూ.25,328.00
10 గ్రాములు: రూ. 31,660.00
100 గ్రాములు: రూ.3,16,600.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,386.096
8 గ్రాములు: రూ. 27,088.768
10 గ్రాములు: రూ. 33,860.96
100 గ్రాములు: రూ. 3,38,609.6
వెండి
8 గ్రాములు: రూ. 332.00

01/17/2019 - 23:37

న్యూఢిల్లీ, జనవరి 17: తమ వాటా 25శాతానికి తగ్గకుండా నిబంధనలు ఏర్పాటుచేస్తే తమ కంపెనీ జెట్ ఎయిర్ వేస్‌లో రూ.700 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ఆ విమానయాన సంస్థ చైర్మన్ నరేష్ గోయెల్ గురువారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు తెలిపారు.ప్రస్తుతం జెట్ ఎయిర్ సంస్థ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన సంగతి తెలిసిందే.

01/17/2019 - 02:16

న్యూఢిల్లీ: భారత్‌లోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీకి అరుదైన గౌరవం దక్కింది. గ్లోబల్ థింకర్స్(ప్రపంచ ఆలోచనాపరుల) జాబితాలో స్థానం లభించింది. ప్రతిష్టాత్మకమైన జాబితాలో అంబానీతోపాటు అలీబాబా ఫౌండర్ జాక్‌మా, అమేజాన్ సీఈవో జెఫ్ బెజోస్, ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టిన్ లగార్డేలున్నారు. గ్లోబల్ థింకర్స్ 2019 జాబితాను సంస్థ అధికారిక వెబ్‌సెట్‌లో పొందుపరిచింది.

01/17/2019 - 02:09

న్యూఢిల్లీ, జనవరి 16: ప్రభుత్వ రంగ బ్యాంకు ‘ఎగ్జిమ్ బ్యాంకు’కు ఆర్థికంగా బలోపేతం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకుగాను రెండేళ్ల కాలంలో 6వేల కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందజేయాలని నిర్ణయించింది. ఈ సాయం అందితే ఈ బ్యాంకు మూలధనం మొత్తం 20వేల కోట్ల రూపాయలకు చేరుతుంది.

01/17/2019 - 02:03

న్యూఢిల్లీ, జనవరి 16: ప్రైవేట్ సెక్టార్‌లోని డీసీబీ బ్యాంకు మూడో త్రైమాసికంలో మంచి ఫలితాలను సాధించింది. గత ఏడాది డిసెంబర్ 31తో పూర్తయ్యే మూడో త్రైమాసికంలో 6.1 కోట్ల స్థూలలాభంతో 50.8 శాతం అధిక లాభాలను ఆర్జించింది. రుణాలపై గత త్రైమాసికంలో 685.72 కోట్ల ఆదాయం రాగా, ఈ త్రైమాసికంలో అది 871.78 కోట్లకు చేరుకుందని బ్యాంకు ఉన్నతాధికారులు తెలిపారు.

01/17/2019 - 00:56

ముంబయి, జనవరి 16: భారత స్టాక్ మార్కెట్‌లో బుధవారం నాటి ట్రేడింగ్ నష్టాలు తప్పవన్న రీతిలో కొనసాగింది. అయితే, అంతర్జాతీయ సూచీలు సానుకూల ధోరణను ప్రదర్శించడంతో, నష్టాల నుంచి తప్పించుకొని, స్వల్ప లాభంతో బయటపడింది. 26,370.74 పాయింట్లతో మొదలైన మార్కెట్ ట్రేడింగ్ అనిశ్చిత పరిస్థితుల్లో నడిచింది. అత్యధికం 36,462.03 పాయింట్లుకాగా, అత్యల్పం 36,278.61 పాయింట్లు.

01/16/2019 - 22:58

చమురు, గ్యాస్ నిల్వలను పొదుపుగా వాడుకొని, భవిష్యత్ తరాలు సమస్యలు ఎదుర్కోకుండా చూడడంతోపాటు

Pages