S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

01/09/2019 - 23:25

న్యూఢిల్లీ, జనవరి 9: ప్రైవేట్ బ్యాంకింగ్ రంగానికి చెందిన ఇండస్ ఇండ్ బ్యాంకు ఈ ఏడాది మూడవ త్రైమాసిక కాలానికి 5.2 శాతం మేర నికర లాభాల్లో వృద్ధిరేటును సాధించినట్లు ప్రకటించింది. తమ బ్యాంకు రూ.985.03 కోట్ల మేర లాభాలను సాధించిందని పేర్కొన్నారు. అంతకు ముందు ఏడాది తమ బ్యాంకు ఇదే కాలానికి రూ.936.25 కోట్ల నికర లాభాలను సాధించింది. మూడవ త్రైమాసిక కాలంలో రూ.7232.32 కోట్ల రుణాలను ఇచ్చామని చెప్పా రు.

01/09/2019 - 23:24

న్యూఢిల్లీ, జనవరి 9: విమానాల్లో ప్రయాణం చేసే వారికి ఇకపై ఉచిత ట్రావెలింగ్ ఇన్సూరెన్స్ వర్తించనుంది. భారతీ ఏఎక్స్‌ఏ జనరల్ ఇన్సూరెన్స్‌తో కలిసి ఇండియన్ రైల్వేస్ కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) ఈ సదుపాయాన్ని అదించనుంది. ఈ విషయాన్ని బుధవారం ఒక ప్రకటనలో ఐఆర్‌సీటీసీ స్పష్టం చేసింది. అయితే, తమ ద్వారా విమానం టికెట్లు కొనుగోలు చేసిన వారికే ఈ సౌకర్యాన్ని వర్తింప చేస్తామని వివరించింది.

01/09/2019 - 23:24

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,128.00
8 గ్రాములు: రూ.25,024.00
10 గ్రాములు: రూ. 31,280.00
100 గ్రాములు: రూ.3,12,800.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,345.455
8 గ్రాములు: రూ. 26,763.64
10 గ్రాములు: రూ. 33,454.55
100 గ్రాములు: రూ. 3,34,545.5
వెండి
8 గ్రాములు: రూ. 332.20

01/09/2019 - 04:29

హైదరాబాద్: మార్కెట్‌లో పత్తి ధర తగ్గుతోందని, అందువల్ల రైతులకు ఇబ్బంది లేకుండా కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) లభించేలా మార్కెటింగ్, సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా), మార్క్‌ఫెడ్ అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి. పార్థసారథి ఆదేశించారు. జిల్లాస్థాయి అధికారులతో మంగళవారం ఆయన సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

01/08/2019 - 22:47

న్యూఢిల్లీ, జనవరి 8: పది కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపుమేరకు మంగళవారం జరిగిన సార్వత్రిక సమ్మె కారణంగా బ్యాంకుల లావాదేవీలకు పాక్షికంగా ఆటంకం ఏర్పడింది. రెండు రోజుల సమ్మెకు అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ), భారత బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య (బీఈఎఫ్‌ఐ) మద్దతు ప్రకటించాయి. బ్యాంకుల్లో కీలకంగా వ్యవహరిస్తున్న ఈ సంఘాల ప్రభావం రోజువారీ విధులపై పడింది.

01/09/2019 - 18:00

ముంబయి: ఈక్విటీలు వరుసగా మూడోరోజూ లాభాల బాట పట్టాయి. బీఎస్‌ఈ సెనె్సక్స్ 130 పాయింట్లు ఎగబాకి 35,980 వద్ద ముగిసింది. అలాగే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సైతం 231.98 పాయింట్లు లాభపడి 36,212.91 వద్ద ముగిసింది.నిఫ్టీ సైతం 53 పాయింట్లు లాభపడి 10,733.25కు తగ్గినప్పటికీ తర్వాత కోలుకుని 10,855.15 వద్ద లాభాలతోనే ముగిసింది.

01/08/2019 - 22:43

వాషిగ్టన్, జనవరి 8: అంతర్జాతీయ మానిటరీ ఫండ్ చీఫ్ ఎకానమిస్ట్‌గా ప్రఖ్యాత భారత-అమెరికన్ ఆర్థిక శాస్తవ్రేత్త గీతా గోపీనాథ్ బాధ్యతలు చేపట్టారు. ఈ ప్రతిష్టాత్మక ఆర్థిక సంస్థలో ఈ అత్యున్నత స్థానాన్ని చేపట్టిన తొలి మహిళ ఈమే కావడం గమనార్హం. ఈ నలభై ఏడేళ్ల ఇండో అమెరికన్ గత వారం బాధ్యతలు స్వీకరించారు. ప్రపంచీకరణ వల్ల తలెత్తిన సమస్యలను పరిష్కరించే విషయంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆమె భావిస్తున్నారు.

01/08/2019 - 22:42

న్యూఢిల్లీ, జనవరి 8: భారత్‌తో సంబంధాలను బలోపేతం చేసుకోవడంలో భాగంగా యూరియా, పెట్రోకెమిక ల్స్ పరిశ్రమల్లో పెట్టుబడులను ఇరాన్ ఆహ్వానించింది. ఎరువులను తమ దేశ ప్రజలకు న్యాయమైన ధరలకు అందించేందుకు ఇరాన్ కృషి చేస్తోందని, ఇందులో భాగంగా భారతీయ పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలను ఆ దేశం ఆహ్వానించిందని ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి మొహమ్మద్ జావేద్ జారిఫ్ తెలిపారు.

01/08/2019 - 22:49

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,128.00
8 గ్రాములు: రూ.25,024.00
10 గ్రాములు: రూ. 31,280.00
100 గ్రాములు: రూ.3,12,800.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,345.455
8 గ్రాములు: రూ. 26,763.64
10 గ్రాములు: రూ. 33,454.55
100 గ్రాములు: రూ. 3,34,545.5
వెండి
8 గ్రాములు: రూ. 331.60

01/08/2019 - 02:51

న్యూఢిల్లీ, జనవరి 7: వ్యవసాయ ఉత్పాదక రంగాలు గణనీయమైన ప్రగతిని సాధించిన నేపథ్యంలో కొత్త ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7.2 శాతానికి పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Pages