S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

01/16/2019 - 22:56

న్యూఢిల్లీ, జనవరి 16: పండుగ సీజన్‌లో పసిడి ధరల పరుగు కొనసాగుతోంది. వరుసగా మూడోరోజూ ధర పెరగడంతో దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల ధర రూ.33,190కి చేరింది. బులియన్ మార్కెట్‌లో బుధవారం తులం బంగారం (10 గ్రాములు)పై 65 రూపాయలు పెరిగింది. దేశీయ జువలరీ వ్యాపారుల నుంచి డిమాండ్ పెరగడంతోనే ఇలా మూడు రోజులుగా బంగారం ధర పెరగుతూ వచ్చిందని వాణిజ్య రంగ నిపుణులు చెబుతున్నారు.

01/16/2019 - 22:54

న్యూఢిల్లీ, జనవరి 16: కార్ల అమ్మకాల్లో మారుతీ సుజికీ అగ్రస్థానాన్ని ఆక్రమించిది. డిసెంబర్‌లో మొత్తం 1,55,159 కార్లు అమ్ముడుకాగా, వాటిలో 83,729 కార్లు మారుతీ సుజికీవే కావడం విశేషం.

01/16/2019 - 22:52

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 2,907.00
8 గ్రాములు: రూ.23,256.00
10 గ్రాములు: రూ. 29,070.00
100 గ్రాములు: రూ.2,90,700.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,109.091
8 గ్రాములు: రూ. 24,872.728
10 గ్రాములు: రూ. 31,090.910
100 గ్రాములు: రూ. 3,10,909.10
వెండి
8 గ్రాములు: రూ. 319.20

01/16/2019 - 22:52

న్యూఢిల్లీ, జనవరి 16: మొబైల్ బ్యాంకింగ్ ద్వారా లావాదేవీలు క్రమంగా పెరుగుతున్నాయి. 2017 నవంబర్‌తో పోలిస్తే, గత ఏడాది నవంబర్ నాటికి ఈ లావాదేవీల విలువ రెట్టింపయింది. 1,05,424 కోట్ల రూపాయల నుంచి 2,45,859 కోట్ల రూపాయలకు చేరింది. 2017 నవంబర్ కంటే డిసెంబర్‌లో కేవలం 33 కోట్ల రూపాయల పెరుగుదల నమోదైంది. అయితే, ఆతర్వాత క్రమంగా పెరుగుతూ వచ్చింది.

01/15/2019 - 04:38

ముంబయి: బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో ఈవారం మొదటి రోజు లావాదేవీలు పతనంతో ముగిశాయి. గత వారం చివరిలో నష్టాలను ఎదుర్కొన్న స్టాక్ మార్కెట్ సోమవారం కూడా కోలుకోలేదు. 30 షేర్ ఇండెక్స్ 156.28 పాయింట్లు (0.43 శాతం) కోల్పోయి 35,853.56 పాయింట్ల వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. 57.35 పాయింట్లు (0.53 శాతం) పతనమై, 10,537.60 పాయింట్లకు చేరింది.

01/14/2019 - 23:42

న్యూఢిల్లీ, జనవరి 14: వాటాల విషయంలో మైండ్‌విజయన్ కేపిటల్ కంపెనీ ఉద్దేశపూర్వకంగా మోసానికి పాల్పడిందని భారత స్టాక్ మార్కెట్‌ను నియంత్రీకరించే సెక్యూరిటీస్ అండ్ ఎక్ఛ్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ప్రకటించింది. పది ఖాతాలను ప్రత్యేకంగా తప్పుపడుతూ 34 లక్షల రూపాయల జరిమానా విధించింది.

01/14/2019 - 23:41

ముంబయి, జనవరి 14: ప్రైవేటు ఈక్విటీలు (పీఈ), వెంచర్ మూలధనం (వీసీ)పై 2018లో పెట్టుబడులు పెరిగాయి. దేశం మొత్తం మీద ఈ పెట్టుబడులు సుమారు 35 శాతం అంటే 35.1 బిలియన్ డాలర్ల మేర పెరిగాయి. 2017 లో పెరిగిన 26.1 బిలియన్ డాలర్ల పెట్టుబడులకంటే ఇది అథికం. అతిపెద్ద వాణిజ్య ఒప్పందాల కారణంగా ఈ పెట్టుబడులు గతేడాది పెరిగాయని ఆర్థిక నిపుణులు అంచనావేస్తున్నారు.

01/14/2019 - 23:41

న్యూఢిల్లీ, జనవరి 14: కార్పొరేట్ బ్యాంకులతో సమానమైన ప్రగతి సాధించే దిశగా ప్రభుత్వ రంగ బ్యాం కులను క్రమక్రమంగా ప్రభుత్వ వాటాలను (ఈక్విటీలను) 52 శాతానికి తగ్గించుకోవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ రంగ బ్యాం కుల్లో సహజంగానే ప్రభుత్వ వాటాలు అధికంగా ఉంటాయి. ఐతే కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి జరగాలంటే ప్రభు త్వ వాటాలు తగ్గించాలన్నది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వ్యూహం.

01/14/2019 - 23:40

ముంబై, జనవరి 14: ఎస్సెల్ ఫారెక్స్, వైజ్‌మాన్ ఫారెక్స్ సంస్థల్లో 57.35 మిలియన్ డాలర్ల పెట్టుబడులతో ఆ సంస్థల్లో సుస్థిర స్థానాన్ని ఆక్రమించడం ద్వారా ఆర్థిక సేవలను మరింత విస్తరించాలని ఎబిక్స్‌కాష్ సంస్థ సోమవారం నాడిక్కడ నిర్ణయించింది. ఈమేరకు భారత్‌కు చెందిన వైజ్‌మాన్ ఫారెక్స్ సంస్థతో ‘ఎబిక్స్‌క్యాష్ వరల్డ్ మనీ’ సంస్థ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

01/14/2019 - 23:40

న్యూఢిల్లీ, జనవరి 14: పసిడి ధర దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం పది గ్రాములపై 225 రూపాయలు పెరిగింది. మొత్తం ధర రూ.33,100 పలికింది. పండుగ సీజన్ కావడంతో స్థానిక వ్యాపారుల నుంచి డిమాండ్ పెరగడంతోబాటు, అంతర్జాతీయ మార్కెట్‌లో సైతం సానుకూల పరిస్థితులు నెలకొనడం బులియన్ మార్కెట్‌కు ఊతమిచ్చిందని విశే్లషకులు భావిస్తున్నారు. అలాగే వెండి ధరల్లో సైతం పెరుగుదల నమోదైంది.

Pages