S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

01/19/2019 - 22:53

ఇరాక్‌లో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, తరుగుతున్న ఉద్యోగావకాశాలకు నిరసనగా ఆందోళనకు దిగిన ప్రజలు శనివారం బాస్రాలోని స్థానిక పాలక మండలి భవనం ముందున్న బారికేడ్లను దగ్ధం చేశారు. ఇరాక్ ఆర్థిక వ్యవస్థ దారుణంగా పతనమవుతోంది. దీనితో నిరుద్యోగులు, నష్టాలను ఎదుర్కొంటున్న చిరు వ్యాపారులు ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ భారీ ప్రదర్శలు నిర్వహిస్తున్నారు.

01/19/2019 - 22:50

న్యూఢిల్లీ, జనవరి 19: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) సుమారు 8,800 కోట్ల రూపాయలు (1.25 బిలియన్ డాలర్లు) అంతర్జాతీయ మార్కెట్ నుంచి బాండ్లద్వారా సేకరించనుంది. ఈమొత్తాన్ని బ్యాంకు వాణిజ్య విస్తరణకు వినియోగించడం జరుగుతుందని ఆ బ్యాంకు అధికారులు వెల్లడించారు.

01/19/2019 - 22:48

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,182.00
8 గ్రాములు: రూ.25,456.00
10 గ్రాములు: రూ. 31,820.00
100 గ్రాములు: రూ.3,18,200.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,403.209
8 గ్రాములు: రూ. 27,225.672
10 గ్రాములు: రూ. 34,032.09
100 గ్రాములు: రూ. 3,40,320.9
వెండి
8 గ్రాములు: రూ. 332.00

01/19/2019 - 22:47

న్యూఢిల్లీ, జనవరి 19: పర్యావరణానికి హాని కలిగించే కంపెనీలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ (ఎన్‌జీటీ) కొరడా ఝళిపిస్తున్నది. అందుకు నిదర్శనంగా ఇటీవలే జర్మనీ కార్ల కంపెనీ వోక్స్‌వ్యాగన్‌కు పరిహారం కోరుతూ ఆదేశాలు జారీ చేయడాన్ని పేర్కోవాలి. వోక్స్‌వాగన్ తయారు చేస్తున్న డీజిల్ కార్లు పర్యావరణానికి హాని కల్గిస్తున్నాయని ఎన్‌జీటీ మండిపడింది. 100 కోట్ల రూపాయలు డిపాజిట్ చేయాలని ఆదేశించింది.

01/18/2019 - 20:23

న్యూఢిల్లీ, జనవరి 18: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (రిల్)కు చెందిన చెందిన షేర్లు శుక్రవారం రెండు శాతం లాభాల వృద్ధిని నమోదు చేసి, మార్కెట్‌కు ఊతమిచ్చాయ. ప్రైవేటు రంగంలో కేవలం త్రైమాసికంలోనే రూ.10వేల కోట్ల లాభాలు గడించిన సంస్థగా రికార్డు సృష్టించడంతో ఈ సంస్థ వాటాల పెరుగుదలకు ఊతం లభించింది.

01/18/2019 - 20:21

ముంబయి, జనవరి 18: భారత స్టాక్ మార్కెట్‌లో లావాదేవీలకు ఈవారం చివరి రోజైన శుక్రవారం కూడా అనిశ్చితి కొనసాగింది. లాభనష్టాల మధ్య ఊగిసలాడిన సెనె్సక్స్ చివరికి నామమాత్రపు లాభంతో బయటపడింది. మొదటి నుంచి మదుపరులు అనాసక్తిని ప్రదర్శించడం, అంతర్జాతీయ సూచీల్లో సానుకూల ధోరణులు లేకపోవడం వంటి అంశాలు స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపాయి.

01/18/2019 - 20:19

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (రిల్) శుక్రవారం దూకుడుగా ముందుకు దూసుకెళ్లింది. ఆ కంపెనీ స్టాక్స్ ఏకంగా 4.43 శాతం లాభాలను ఆర్జించాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో 10,000 కోట్ల రూపాయలకుపైగా త్రైమాసిక లాభాన్ని ప్రకటించిన భారత తొలి కంపెనీగా రికార్డు సృష్టించిన రిల్ షేర్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.

01/18/2019 - 20:18

కోల్‌కతా, జనవరి 18: దేశ స్థూలోత్పత్తి (జీడీపీ) పరిమాణం పెరుగుతున్న దృష్ట్యా ఆర్థిక రంగంలో మరింతగా కరెన్సీ ఆవశ్యకత ఏర్పడుతోందని రిజర్వు బ్యాంకుకు చెందిన అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. 2016 నవంబర్‌లో జరిగిన డీమోనిటరైజేషన్ సమయంలో 500, 1000 కరెన్సీ నోట్లను ప్రభుత్వం రద్దు చేసినపుడు పెద్దయెత్తున కరెన్సీ లోటు ఏర్పడిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

01/18/2019 - 20:16

ముంబయి, జనవరి 18: దాదాపు రూ.80వేల కోట్లు పెట్టుబడులను వెనక్కు తీసుకునే ‘డిసినె్వస్ట్‌మెంట్’ లక్ష్యాలను కేంద్ర ప్రభుత్వం వంద శాతం అందుకునే అవకాశాలు లేవని ఆర్థిక రంగ నిపుణులు అంచనావేస్తున్నారు. ఇందులో దాదాపు 20వేల కోట్ల రూపాయలు తగ్గవచ్చని ఇందుకు ఈ సంవత్సరం ఆర్థిక లోటు 3.5శాతానికి చేరుకున్న ఆర్థిక లోటే కారణమని అంటున్నారు.

01/18/2019 - 20:16

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 2,907.00
8 గ్రాములు: రూ.23,256.00
10 గ్రాములు: రూ. 29,070.00
100 గ్రాములు: రూ.2,90,700.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,109.091
8 గ్రాములు: రూ. 24,872.728
10 గ్రాములు: రూ. 31,090.910
100 గ్రాములు: రూ. 3,10,909.10
వెండి
8 గ్రాములు: రూ. 319.20

Pages