S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

02/18/2018 - 01:39

పాల్వంచ, ఫిబ్రవరి 16: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ కర్మాగారం రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ కాంతులను వెదజల్లుతూ తెలంగాణ రాష్ట్రానికే తలమానికంగా నిలుస్తోంది. పాల్వంచతో పాటు జిల్లా కీర్తి ప్రతిష్ఠలను దశదిశలా విస్తరింపజేసి దేశ పారిశ్రామిక అభివృద్ధిలో తనవంతు పాత్ర నిర్వహిస్తూ ప్రగతి పథంలో ముందుకు సాగుతోంది.

02/18/2018 - 01:31

విజయవాడ, ఫిబ్రవరి 17: స్మార్ట్ ఫోన్ అనుభవాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లే దిశలో మోటోరొలా సరికొత్త స్మార్ట్ ఫోన్ లిమిటెడ్ ఎడిషన్ మోటో జెడ్ 2 ఫోర్స్‌ను, టర్బో పవర్ ప్యాక్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది.

02/18/2018 - 01:30

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 17: రాజమహేంద్రవరం ఎంపీ మాగంటి మురళీమోహన్ చొరవతో దేశంలోనే తొలిసారిగా అత్యాధునిక సాంకేతిక పరికరాలతో ఉచిత వైద్యం రూపుదాల్చింది. ఎంపీ మాగంటి మురళీమోహన్ ఎంపీ నిధులు రూ.1.30 కోట్లతోనూ, రూ.70 లక్షల నిధులతో డాక్టర్ గన్ని భాస్కరరావు ఆధ్వర్యంలో జిఎస్‌ఎల్ ట్రస్ట్ సంస్థ సుమారు రూ. 2 కోట్ల నిధులతో అత్యాధునిక మొబైల్ కేన్సర్ ఆస్పత్రిని అందుబాటులోకి తెస్తున్నారు.

02/17/2018 - 06:23

ముంబయి, ఫిబ్రవరి 16: అంతర్జాతీయ స్టాక్ మార్కెట్‌లో సానుకూల ఫలితాలు కనిపిస్తున్నప్పటికీ దేశీయంగా పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం వెలుగుచూసిన నేపథ్యంలో, దీని ప్రభావం మరికొన్ని బ్యాంకులపై సుదీర్ఘకాలం ఉండొచ్చన్న మదుపరుల ఆందోళన నేపథ్యంలో స్టాక్‌మార్కెట్‌లో వరుసగా మూడోరోజూ గందరగోళం కొనసాగింది. మదుపరులు ఇంకా అనిశ్చితిలోనే ఉన్నారు. మొత్తంమీద ట్రేడింగ్‌లో వారాంతం నష్టాలనే నమోదు చేసింది.

02/17/2018 - 06:15

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16:విదేశాల్లో వ్యూహాత్మక ఖనిజాల సేకరణ లక్ష్యంగా గనుల కొనుగోలుకు ప్రభుత్వరంగ సంస్థలైన నాల్కో, హెచ్‌సీఎల్, ఎమ్‌ఈసీఎల్‌లతో కలసి జాయింట్ వెంచర్ సంస్థను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈమేరకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. దేశంలో లభించని, ఒకవేళ ఉన్నా స్వల్పస్థాయిలోనే లభిస్తున్న ఖనిజాల కోసం ప్రభుత్వం ప్రతిపాదనలు రూపొందిస్తోంది.

02/17/2018 - 06:14

విశాఖపట్నం, ఫిబ్రవరి 16: సవాళ్లు ఎదురైనప్పటికీ విశాఖ పోర్టు ట్రస్టు (వీపీటీ) కార్గో హ్యాండ్లింగ్‌లో లక్ష్యాన్ని అధిగమిస్తోందని చైర్మన్ ఎంటీ కృష్ణబాబు వెల్లడించారు. విశాఖలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్గో హ్యాండ్లింగ్‌లో వీపీటీ నాలుగవ స్థానం సాధించిందన్నారు.

02/17/2018 - 06:14

పనాజీ, ఫిబ్రవరి 16:దేశంలోని విమానాశ్రయాల్లో ప్రస్తుతం ఉన్న టెర్మినళ్లను విస్తరించడం, కొత్తగా నిర్మించడమే లక్ష్యంగా ఆ ఆర్థిక సంవత్సరంలో (2018-19) రూ. 15వేల కోట్ల రూపాయల మేరకు పెట్టుబడులు పెట్టాలని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) నిర్ణయించింది.

02/17/2018 - 06:13

అమరావతి, ఫిబ్రవరి 16: రెండున్నరేళ్ల కాలానికి సరిపడా ప్రోత్సాహకాలు, ఐదు సమావేశాల్లో ఐదు నెలల్లో ఆమోదం పొంది విడుదల కావడంతో పరిశ్రమ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. శుక్రవారం పరిశ్రమల శాఖ కమిషనర్ సిద్ధార్థ్‌జైన్ నేతృత్వంలో జరిగిన 18వ రాష్టస్థ్రాయి కమిటీ సమావేశంలో 81 యూనిట్లకు రూ.151.4 కోట్ల ప్రోత్సాహకాలు విడుదల చేశారు.

02/17/2018 - 06:12

అనంతపురం, ఫిబ్రవరి 16: కరవుకు నిలయమైన అనంతపురం జిల్లాలో పంట పొలాలను సస్యశ్యామలం చేసేందుకు ఆటోమేషన్ సిస్టమ్ ద్వారా లిఫ్ట్ కమ్ డ్రిప్ ఇరిగేషన్ (ఎత్తిపోతలు, తుంపర్ల సేద్యం)కు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. బృహత్తరమైన ఈ పథకం ఆసియా ఖండంలోనే తొలి అత్యాధునిక సేద్య విధానంగా రికార్డులకెక్కనుంది. కర్ణాటక రాష్ట్రంలోని భాగల్‌కోట్ జిల్లా రాంతాల్ గ్రామంలో లిఫ్ట్ కమ్ డ్రిప్ ఇరిగేషన్ పథకం కొనసాగుతోంది.

02/16/2018 - 16:01

ముంబై: దేశీయస్టాక్‌మార్కెట్లు అనూహ్యంగా భారీ నష్టాల్లో ముగిశాయి. ప్రధానంగా పీఎస్‌యూ బ్యాంక్‌ షేర్లకు పీఎన్‌బీ మెగా స్కాం సెగ తగిలింది. దీంతో ఫైనాన్షియల్‌ సంస్థలు,బ్యాంకింగ్‌ షేర్లలో సెల్లింగ్‌ ప్రెజర్‌ నెలకొంది. అలాగే మెటల్‌, ఆటో రంగాల నష్టాలు మార్కెట్లను ప్రభావితం చేశాయి. ఒక్క ఐటీ,పార్మ తప్ప అన్ని సెక్టార్లలో నష్టాలే.

Pages