S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

02/15/2018 - 13:42

న్యూఢిల్లీః పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్‌లో ప్రధాన అనుమానితుడిగా ఉన్న వజ్రాల వ్యాపారి నిరవ్ మోదీ ఇల్లు, ఆఫీసులు, షోరూమ్‌లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడి చేసింది. ముంబై, ఢిల్లీలలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నది. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు చెందిన ముంబై బ్రాంచ్‌లో ఏకంగా 11360 కోట్ల కుంభకోణం బయటపడిన విషయం తెలిసిందే.

02/15/2018 - 01:16

అమరావతి, ఫిబ్రవరి 14: ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన కాగితం తయారీ సంస్థ ‘ఆసియా పల్ప్ అండ్ పేపర్’ (ఏపీపీ) రాష్ట్రంలో అడుగుపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసిన ఏపీపీ ప్రతినిధులు భారతదేశంలోనే అతి పెద్ద కాగిత తయారీ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసేందుకు తమ ఆసక్తిని వ్యక్తం చేశారు.

02/15/2018 - 06:25

రూ. 11వేల కోట్లకు పైగా మోసపూరిత లావాదేవీలు జరిగినట్లు కనుగొన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ ముంబయిలోని ఒక బ్రాంచ్ పీఎన్‌బీని మోసగించినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న లగ్జరీ డైమండ్ జ్యుయెలరి బ్రాండ్ వ్యవస్థాపకుడు, క్రియేటివ్ డైరెక్టర్ నీరవ్ మోదీ. 2017 నవంబర్ 8న ఢిల్లీలో బ్రిటన్ యువరాజు చార్లెస్‌తో కలిసి ఒక కార్యక్రమంలో పాల్గొన్నప్పటి చిత్రమిది.

02/15/2018 - 01:13

విజయవాడ, ఫిబ్రవరి 14: విజయవాడ వద్ద జనవరిలో తమ మొదటి చేప మేత ప్లాంట్‌ను ప్రారంభించిన తరువాత కార్గిల్ సంస్థ ఇప్పుడు తమ మొదటి టెక్నాలజీ అప్లికేషన్ సెంటర్‌ను కృష్ణా జిల్లా కైకలూరు సమీపంలో బుధవారం ప్రారంభించింది. ఈ టెక్నాలజీ అప్లికేషన్ సెంటర్ ద్వారా ఆక్వాకల్చర్ రైతులు నూతన ఆవిష్కరణలు పొందడంలో సహాయపడటంతో పాటుగా ఆరోగ్యకరమైన సముద్ర ఉత్పత్తులు పెంచడానికి తగిన పరిష్కారాలను అందించనుంది.

02/15/2018 - 01:12

ఖమ్మం, ఫిబ్రవరి 14: ప్రభుత్వాల నిర్ణయాలతో ఉన్నత విద్యా కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులపై అధిక భారం పడుతోంది. ప్రవేశ పరీక్షల దరఖాస్తు రుసుములు గత ఎడాదితో పోలిస్తే 80శాతం వరకు పెరగనున్నాయి. దీని ద్వారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులపై లక్షలాది రూపాయల భారం పడనున్నది.

02/15/2018 - 01:11

ముంబయి, ఫిబ్రవరి 14: నిరర్ధక ఆస్తుల సమస్య పరిష్కారం విషయంలో రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) బ్యాంకులకు కఠినమయిన మార్గదర్శకాలను జారీ చేయడంతో దేశీయ స్టాక్ మార్కెట్లలో బ్యాంకింగ్ షేర్ల ధరలు పడిపోవడంతో పాటు తరువాత మదుపరులు లాభాల స్వీకరణకు పూనుకోవడం వల్ల మార్కెట్ కీలక సూచీలు బుధవారం పతనమయ్యాయి. ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) తన శాఖలలో రూ.

02/14/2018 - 01:26

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: దేశవ్యాప్తంగా వస్తు సేవా పన్ను రాబడి ఎప్పటికప్పుడు ఇనుమడిస్తోంది. పన్నుల ఎగవేత నిరోధక చర్యలను మరింత పటిష్టంగా అమలు చేస్తే జీఎస్టీ ద్వారా నెలకు లక్ష కోట్ల రూపాయల మేర పన్ను వసూలయ్యే అవకాశం ఉందని తాజా లెక్కలను బట్టి స్పష్టమవుతోంది.

02/14/2018 - 00:28

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: రాష్ట్ర సుంకాల ఉపశమన పథకాల (రెమిషన్ ఆఫ్ స్టేట్ లెవీస్-ఆర్‌ఓఎస్‌ఎల్) కోసం ఉద్దేశించిన కేటాయింపులను ఈసారి బడ్జెట్‌లో ఏకంగా 39 శాతం మేరకు పెంచడంతో వస్త్ర పరిశ్రమకు సంబంధించి ఎగుమతులు పెరుగుతాయని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ చెప్పారు.

02/14/2018 - 00:21

విశాఖపట్నం, ఫిబ్రవరి 13: వేసవి విద్యుత్ అవసరాలకు సంబంధించి అంచనాలు సిద్ధమవుతున్నాయి. దీనిపై సంస్థ యాజమాన్యం లెక్కలు కడుతోంది.

02/14/2018 - 00:21

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: ప్రపంచంలో సాంకేతిక సన్నద్ధత, మానవ-సాంకేతిక అనుసంధానం, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో భారత్‌కు చెందిన సంస్థలు ముందంజలో ఉన్నాయని ఓ సర్వే స్పష్టం చేసింది. అభివృద్ధి చెందిన దేశాలైన సింగపూర్, ఆస్ట్రేలియాలను కాదని భారత్ ఈ విషయంలో దూసుకుపోతోందని, దేశంలోని 38 శాతం సంస్థలు ఇప్పటికే ఈ విధానాలను అమలు చేశాయని ఆ సర్వేలో తేలింది.

Pages