S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

11/08/2016 - 00:15

హైదరాబాద్, నవంబర్ 7: కిశోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్ గ్రూప్.. హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్‌కు చెందిన రిటైల్, అనుబంధ వ్యాపారాలను హస్తగతం చేసుకుంది. ఈ మేరకు బియానీ సోమవారం ఇక్కడ జరిగిన విలేఖరుల సమావేశంలో తెలియజేశారు. మొత్తం స్టాక్ డీల్‌లో జరిగిన ఈ లావాదేవికి సంబంధించి ఇరు సంస్థల మధ్య ఓ ఒప్పందం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబానికి చెందినదే హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్.

11/08/2016 - 00:12

ముంబయి, నవంబర్ 7: దేశీయ స్టాక్ మార్కెట్లు ఎట్టకేలకు వరుస నష్టాల నుంచి కోలుకున్నాయి. సోమవారం లాభాల్లో ముగిశాయి. హిల్లరీ క్లింటన్‌కు ఎఫ్‌బిఐ నుంచి క్లీన్‌చిట్ రావడం మార్కెట్లను ఉత్సాహపరిచింది. ప్రస్తుత అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ట్రంప్ ముందంజలోకి రావడానికి హిల్లరీ వ్యక్తిగత ఈ-మెయిల్ సర్వర్ వ్యవహారంపై ఎఫ్‌బిఐ విచారణ కూడా ఓ కారణమే.

11/08/2016 - 00:10

ముంబయి, నవంబర్ 7: దేశీయ ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసిఐసిఐ బ్యాంక్ ఏకీకృత నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో 13 శాతం క్షీణించింది. ఒక్కసారిగా ఎగిసిన మొండి బకాయిల (నిరర్థక ఆస్తులు లేదా ఎన్‌పిఎ) కారణంగా ఈసారి 2,979 కోట్ల రూపాయలకే పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) జూలై-సెప్టెంబర్‌లో 3,419 కోట్ల రూపాయలుగా ఉంది.

11/08/2016 - 00:06

కాకినాడ, నవంబర్ 7: సముద్ర ఉత్పత్తుల్లో డిమాండ్ ఉన్న మండ పీతల పెంపకంపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం రంగం సిద్ధం చేస్తోంది. మండ పీతలకు దేశ, విదేశాల్లో ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, వీటిని పెంచడానికి ముందుకువచ్చే రైతులను ప్రోత్సహించనున్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని సముద్ర తీర ప్రాంతం, నదీ పరివాహక ప్రాంతాల్లో లభించే మండ పీతలకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది.

11/08/2016 - 00:05

హైదరాబాద్, నవంబర్ 7: ఐటి సేవల సంస్థ సైయెంట్.. బ్రిటన్‌కు చెందిన డిజిటల్ మ్యాపింగ్, గ్రౌండ్ సర్వే ప్రొవైడర్ బ్లామ్ ఏరోఫిల్మ్స్ సంస్థను సొంతం చేసుకోవడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు సోమవారం హైదరాబాద్ ఆధారిత సైయెంట్ ఓ ప్రకటనలో తెలియజేసింది. నిరుడు బ్లామ్ ఆదాయం 6 మిలియన్ పౌండ్లుగా ఉన్నట్లు వివరించింది.

11/08/2016 - 00:05

హైదరాబాద్, నవంబర్ 7: అంకుర సంస్థలను (స్టారప్‌లు) ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నా, దానికి అనుసరించాల్సిన విధి విధానాలు తెలియక ఇబ్బంది పడుతున్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఊతంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ ఆరు నెలల కోర్సును ప్రారంభించింది. ఇప్పటికే మూడు బ్యాచ్‌లు పూర్తి చేసిన యూనివర్శిటీ.. నాలుగో బ్యాచ్ అభ్యర్థులకు శిక్షణ ఇవ్వబోతోంది.

11/07/2016 - 08:08

న్యూఢిల్లీ, నవంబర్ 6: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఈ వారం భారతీయ స్టాక్ మార్కెట్లను అమితంగా ప్రభావితం చేస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతోపాటే దేశీయ ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసిఐసిఐ బ్యాంక్, ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ..

11/07/2016 - 08:06

ఆదోని, నవంబర్ 6: చైనా నుంచి పట్టు దిగుమతిని తగ్గించి, దేశంలోనే పట్టు ఉత్పత్తిని పెంచడం ద్వారా పట్టు పరిశ్రమను అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని జాతీయ సిల్క్ బోర్డు చైర్మన్ కెఎం హనుమంతరాయప్ప తెలిపారు. ఆయన ఆదివారం కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని బిజెపి కార్యాలయంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.

11/07/2016 - 08:05

న్యూఢిల్లీ, నవంబర్ 6: భారతీయ మార్కెట్ల నుంచి విదేశీ మదుపరుల పెట్టుబడుల ఉపసంహణ కొనసాగుతోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రభావం భారత్‌సహా ప్రపంచ స్టాక్ మార్కెట్లపై కనిపిస్తున్నది తెలిసిందే. హిల్లరీ క్లింటన్‌పై డొనాల్డ్ ట్రంప్ ముందంజలో కనిపిస్తుండటంతో మదుపరులు తమ పెట్టుబడు లకు ప్రత్యామ్నాయ మార్గాలను అనే్వషిస్తు న్నారు. దీంతో స్టాక్ మార్కెట్లు నష్టపోతుండగా, విదేశీ పెట్టుబడులు తరలిపోతున్నాయ.

11/07/2016 - 08:04

ముంబయి, నవంబర్ 6: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ).. వచ్చే నెల నిర్వహించే ద్రవ్యసమీక్షలో కీలక వడ్డీరేట్లను మరింతగా తగ్గించవచ్చని ప్రముఖ విదేశీ బ్రోకరేజ్ సంస్థ హెచ్‌ఎస్‌బిసి అంచనా వేసింది. క్రిందటి ద్రవ్యసమీక్షలోనూ ఆర్‌బిఐ.. రెపో, రివర్స్ రెపో రేట్లను పావుశాతం తగ్గించిన నేపథ్యంలో అదే ధోరణి డిసెంబర్ ద్రవ్యసమీక్షలోనూ కొనసాగించే వీలుందని హెచ్‌ఎస్‌బిసి పేర్కొంది. వడ్డీరేట్లు తగ్గుతాయా?

Pages