S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

09/27/2019 - 22:07

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27: గతంలో ఎన్నడూ లేనంతగా చోటుచేసుకున్న కార్పొరేట్ పన్నుల కోత వల్ల మన దేశం వాణిజ్యపరంగా ఇతర దేశాలతో పోటీపడేలా ఎదిగేందుకు, పెట్టుబడులు పెరిగేందుకు దోహదపడుతుందని ‘ఐహెచ్‌ఎస్ మార్కిట్’ అధ్యయన నివేదిక పేర్కొంది. ప్రత్యేకించి ఆసియా దేశాల్లో పోటీతత్వం పెరుగుతుందని అంచనా వేసింది.

09/27/2019 - 22:07

ముంబయి, సెప్టెంబర్ 27: వాణిజ్య కమ్యూనిటీపై ప్రజలకు విశ్వాసాన్ని పోగొట్టేందుకే ప్రభుత్వం వివిధ దర్యాప్తు సంస్థలతో వరుస దాడులు, శోధనలు నిర్వహించి, లుక్‌అవుట్ నోటీసులు జారీ చేయిస్తోందని వ్యాపార వేత్త పిరమాల్ గ్రూప్ సంస్థల యజమాని అజయ్ పిరమాల్ శుక్రవారం నాడిక్కడ ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్టకేలకు ఆయన వౌనం వీడి ప్రభుత్వ ఉద్దేశాలపై విమర్శలు గుప్పించారు.

09/27/2019 - 22:06

హైదరాబాద్, సెప్టెంబర్ 27: వ్యాపార రంగంలో దూసుకుపోతున్న సింగరేణి సంస్థకు సాంకేతిక సహకారం అందివ్వడానికి ఆస్ట్రేలియా ముందకు వచ్చింది. శుక్రవారం సింగరేణి సంస్థ సీఎండీ శ్రీ్ధర్‌తో ఆస్ట్రేలియాకు చెందిన ట్రేడ్ అండ్ ఇనె్వస్ట్‌మెంట్ కమిషనర్ డాక్టర్ మాథీవ్ డర్మన్ భేటీ అయ్యారు. హైదరాబాద్ సింగరేణి భవన్‌లో సీఎండీతో ఆస్ట్రేలియా ప్రతినిధులు పాల్గొన్నారు.

09/27/2019 - 05:58

ముంబయి : సంక్షోభంలో చిక్కుకున్న పంజాబ్-మహారాష్ట్ర సహకార బ్యాంక్ (పీఎంసీ) ఖాతాదారులకు ఎట్టకేలకు సొమ్ము విత్‌డ్రా చేసుకునే విషయంలో ఆర్బీఐ ఆంక్షలను సడలించింది. గత మంగళవారం నాడు విధించిన విత్‌డ్రాయల్ పరిమితి రూ. 1000 నుంచి రూ.10,000కు పెంచుతూ గురువారం ఆర్బీఐ ఆదేశాలను జారీ చేసింది. చింది. ఇందువల్ల ఈ బ్యాంకుకు చెందిన 60 శాతం ఖాతాదారులకు ప్రయోజనం కలుగుతుందని ఆర్బీఐ అధికారులు తెలిపారు.

09/27/2019 - 05:53

విజయవాడ, సెప్టెంబర్ 26: విజయవాడ ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా జరిగే దసరా మహోత్సవాలను తిలకించేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది భక్తులు విచ్చేస్తుంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని విజయవాడ నుంచి ఇతర ప్రాంతాలకు...

09/27/2019 - 05:38

విజయవాడ(సిటీ), సెప్టెంబర్ 26: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సులను నడిపేందుకు అద్దె బస్సులు కావాలంటూ ఆర్టీసీ ఓపెన్ టెండర్లను ఆహ్వానించింది. మొదటి దశలో కొన్ని ప్రాంతాలకు పైలట్ ప్రాజెక్టుగా ఎలక్ట్రిక్ బస్సులను నడపాలని నిర్ణయించిన ఆర్టీసీ అందుకోసం కావాల్సిన బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకునేందుకు ప్రణాళికలను సిద్దం చేసింది.

09/27/2019 - 01:43

విజయవాడ, సెప్టెంబర్ 26: బహిరంగ మార్కెట్‌లో ఉల్లి ధరలను నియంత్రించేందుకు జిల్లాలోని రైతుబజార్లలో కేజీ రూ. 25లకే ఉల్లిపాయలను అందుబాటులో ఉంచామని జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ అన్నారు. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో నగరంలోని స్వరాజ్ మైదాన్ రైతుబజార్‌లో గురువారం కిలో రూ. 25లకే ఉల్లిపాయలు వినియోగదారులకు అందించే ప్రత్యేక కౌంటర్లను కలెక్టర్, జాయింట్ కలెక్టర్ మాధవీలత ప్రారంభించారు.

09/27/2019 - 05:40

ముంబయి, సెప్టెంబర్ 26: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం కోలుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పరిస్థితులతోబాటు సెప్టెంబర్ సిరీస్ డెరివేటివ్స్ గడువుముగిసిపోవడం వంటి కారణాలు దేశీయ మార్కెట్లకు ఊతం ఇచ్చాయని విశే్లషకులు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా బ్యాంకింగ్, ఇంధన, వాహన రంగాల స్టాక్స్ బాగా లాభపడ్డాయి.

09/26/2019 - 22:50

*చిత్రం...ప్రైవేటు రంగంలోని బ్యాంకుల ప్రతినిధులతో గురువారం కీలక చర్చలు జరుపుతున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

09/26/2019 - 22:48

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26: డిజిటలైజేషన్‌లోప్రపంచ దేశాలతో భారత్ పోటీ పడుతూ ముందుకెళుతోంది. ఇప్పటి వరకు ఈ విషయంలో ఉన్న 48వ ర్యాంకునుంచి 44వ ర్యాంకుకు ఎగబాకింది. ప్రధానంగా ఆధునిక డిజిటల్ సాంకేతికలను అందిపుచ్చుకుని అభివృద్థి చెందేందుకు అనుగుణంగా విజ్ఞానాన్ని, భవిష్యత్ ప్రణాళికలను సమకూర్చుకుంటోందని ‘ఐఎండీ వరల్డ్ డిజిటల్‌నెస్ ర్యాంకింగ్ 2019’ (డబ్ల్యుడీసీఆర్) అధ్యయన నివేదిక పేర్కొంది.

Pages