S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

09/15/2016 - 05:51

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: అనీల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్), ఎయిర్‌సెల్ ఏకమవుతున్నాయి. ఎయిర్‌సెల్‌తో తమ వైర్‌లెస్ టెలికామ్ వ్యాపారాన్ని విలీనం చేసేందుకు ఆర్‌కామ్ బుధవారం అంగీకరించింది. దీంతో 65,000 కోట్ల రూపాయలకుపైగా ఆస్తులతో దేశీయ టెలికామ్ రంగంలో నాలుగో అతిపెద్ద సంస్థగా ఆర్‌కామ్, ఎయిర్‌సెల్ కలయికతో ఏర్పడే సంస్థ ఆవిర్భవించనుంది.

09/15/2016 - 05:49

విశాఖపట్నం (గాజువాక), సెప్టెంబర్ 14: విశాఖ ఉక్కు కర్మాగారానికి పూర్తిస్థాయిలో హిందీ భాష అమలుకు కృషి చేస్తున్నం దుకుగాను ప్రతిష్ఠాత్మక రాజభాషా పురష్కారం దక్కింది. స్టీల్ ప్లాంట్ సిఎండి, ఇతర అధికారుల కృషి, పట్టుదల వలన కర్మాగారంలో అన్ని విభాగాల్లో హిందీ భాష అమలు జరుగుతోంది.

09/15/2016 - 05:48

హైదరాబాద్, సెప్టెంబర్ 14: ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ జీవిత బీమా సంస్థ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపిఒ)ను ఈ నెల 19వ తేదీన జారీ చేయనుంది. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఒక్కో ఈక్విటీ షేర్ ధరను 300 రూపాయల నుంచి 334 రూపాయల మధ్య నిర్ణయంచింది.

09/15/2016 - 05:48

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: టోకు ద్రవ్యోల్బణం గత నెలలో రెండేళ్ల గరిష్ఠానికి ఎగిసింది. పప్పు్ధన్యాలతోపాటు కొన్నిరకాల తయారీ ఉత్పత్తుల అధిక ధరల కారణంగా ఆగస్టులో టోకు ధరల సూచీ (డబ్ల్యుపిఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 3.74 శాతంగా నమోదైంది. ఇక అంతకుముందు నెల జూలైలో ఇది 3.55 శాతంగా ఉంటే, నిరుడు ఆగస్టులో మైనస్ 5.06 శాతంగా ఉంది. 2014 నవంబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు మైనస్‌లోనే ఉన్నది తెలిసిందే.

09/15/2016 - 05:47

ముంబయి, సెప్టెంబర్ 14: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. మంగళవారం బక్రీద్ సందర్భంగా సెలవు అవగా, సోమవారం సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి. ఈ క్రమంలో బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 18.69 పాయింట్లు పెరిగి 28,372.23 వద్ద స్థిరపడితే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 11 పాయింట్లు అందుకుని 8,726.60 వద్ద నిలిచింది.

09/14/2016 - 16:06

ముంబయి: మంగళవారం భారీగా కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లు బుధవారం స్వల్పంగా కోలుకున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 66.91 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 11 పాయింట్ల లాభంతో 8,726 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ 19 పాయింట్లు లాభపడి 28,372 వద్ద ముగిసింది.

09/14/2016 - 06:05

విశాఖపట్నం, సెప్టెంబర్ 13: నౌకా నిర్మాణ రంగంలో రష్యా ప్రభుత్వరంగ సంస్థ యునైటెడ్ షిప్ బిల్డింగ్ కార్పొరేషన్ పెట్టుబడులు పెట్టనుంది. రక్షణ రంగంలో నౌకల తయారీ, ఏపి కేంద్రంగా ప్రాజెక్టు ఏర్పాటుపై ఇండో-రష్యా ప్రతినిధులు విశాఖలో మంగళవారం ద్వైపాక్షిక చర్చలు జరిపారు.

09/14/2016 - 06:02

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: హ్యుందాయ్ మోటార్ ఇండియా.. దేశీయ మార్కెట్‌కు మంగళవారం ఓ సరికొత్త వాహనాన్ని పరిచయం చేసింది. ఇప్పటికే ఉన్న తమ హచ్‌బ్యాక్ ఎలైట్ ఐ20ని ఆటోమేటిక్ వేరియంట్‌లో తీసుకొచ్చింది. ఢిల్లీ ఎక్స్‌షోరూం ప్రకారం దీని ధర 9.01 లక్షల రూపాయలు.

09/14/2016 - 06:02

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: ప్రభుత్వరంగ బొగ్గు ఉత్పాదక దిగ్గజం కోల్ ఇండియా లిమిటెడ్ ఏకీకృత నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016- 17) తొలి త్రైమాసికం (ఏప్రిల్- జూన్)లో 3,065.28 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) ఇదే వ్యవధిలో 3,596.93 కోట్ల రూపాయల లాభాన్ని సంస్థ అందుకుంది. దీంతో ఈసారి లాభం 14.7 శాతం క్షీణించినట్లైంది.

09/14/2016 - 06:01

హైదరాబాద్, సెప్టెంబర్ 13: పారిశ్రామికవేత్తలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని, పరిశ్రమల్లో రాష్ట్రాన్ని నెంబర్ వన్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తోందని అధికార టిఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఎంపి కవిత తెలిపారు. ఎఫ్‌ట్యాప్సీ భవన్‌లో మంగళవారం తెలంగాణ ఇండస్ట్రియలిస్ట్స్ ఫెడరేషన్ (టిఐఎఫ్), తెలంగాణ జాగృతి స్కిల్స్ ట్రైనింగ్ సెంటర్ మధ్య ఒప్పందం కుదిరింది.

Pages