S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

01/23/2016 - 02:38

భీమవరం, జనవరి 22: డాలర్ల పంటగా పేరున్న రొయ్యల సాగుకు గోదావరి జిల్లాల్లో పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. ఈ జిల్లాల్లో వరిసాగులో నష్టాలను చవిచూస్తున్న రైతన్నలకు ఆక్వా పరిశ్రమ ఊతమిస్తోంది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను ప్రకృతి కరుణించక తరచూ దక్కించుకోలేకపోతున్న రైతన్నలకు ఆక్వాసాగు ప్రత్యామ్నాయంగా నిలిచింది.

01/23/2016 - 02:36

న్యూఢిల్లీ, జనవరి 22: బహుళ వ్యాపార దిగ్గజం ఐటిసి లిమిటెడ్ స్టాండలోన్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015-16) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో స్వల్పంగా పెరిగింది. ఈసారి 2,652.8 కోట్ల రూపాయలుగా నమోదైతే, గత ఆర్థిక సంవత్సరం (2014-15) అక్టోబర్-డిసెంబర్‌లో ఇది 2,635 కోట్ల రూపాయలుగా ఉంది. నికర అమ్మకాలు ఈసారి 9,102.7 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 8,800.2 కోట్ల రూపాయలుగా ఉన్నాయి.

01/23/2016 - 02:36

హైదరాబాద్, జనవరి 22: ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ నష్టాలను తగ్గించేందుకు పంపిణీ లైన్ల వ్యవస్థను 6 వేల కోట్ల రూపాయలతో పటిష్ఠం చేయాలని, దీని నిమిత్తం ప్రణాళికను ఖరారు చేసినట్లు ఏపి ట్రాన్స్‌కో సిఎండి కె విజయానంద్ ప్రకటించారు. అమరావతిలో కూడా విద్యుత్ పంపిణీ వ్యవస్థ పటిష్టం చేస్తామని, భూగర్భ విద్యుత్ పంపిణీ లైన్లను నిర్మిస్తామన్నారు.

01/23/2016 - 02:35

తడ, జనవరి 22: నెల్లూరు-చిత్తూరు జిల్లాల సరిహద్దుల్లో ఉన్న శ్రీసిటీలో శుక్రవారం పారిశ్రామిక వ్యర్థాలతో కూడిన నీటిని శుద్ధిచేసే యంత్ర పరికరాల కర్మాగారానికి భూమి పూజ నిర్వహించారు. అంతర్జాతీయ ఖ్యాతి పొందిన నెదర్లాండ్స్ పక్యూస్ గ్రూపునకు చెందిన పక్యూస్ ఎన్విరానిమెంట్ టెక్నాలజీ ఇండియా పేరుతో శ్రీసిటీలో కర్మాగారాన్ని నిర్మించ తలపెట్టామని సంస్థ కంట్రోలర్ శుభ గణేషన్ తెలిపారు.

01/23/2016 - 02:32

హైదరాబాద్, జనవరి 22: పారిశ్రామిక రంగం అభివృద్ధి, పరిశోధనలకూ వీలుగా తెలంగాణ పారిశ్రామిక విధా నం రూపొందిస్తామని పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. శుక్రవారం ఇక్కడ తెలంగాణ, ఆంధ్రపదేశ్ రాష్ట్రాల్లో ‘పాలిమర్ పరిశ్రమలో కొత్త అవకాశాలు’ అనే అంశంపై జరిగిన సమావేశాన్ని మంత్రి ప్రారంభించారు.

01/23/2016 - 02:31

న్యూఢిల్లీ, జనవరి 22: ఈ ఏడాది భారత జిడిపి వృద్ధిరేటు 7.3 శాతంగా ఉండొచ్చని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. వచ్చే ఏడాది ఇది 7.5 శాతానిక పెరుగుతుందని పేర్కొంది. శుక్రవారం ఐక్యరాజ్య సమితి వెల్లడించిన ప్రపంచ ఆర్థిక నివేదికలో ప్రపంచంలో భారత్ జిడిపి వృద్ధిరేటు అన్ని దేశాల కంటే వేగంగా ఉందని చెప్పింది. దక్షిణాసియా దేశాల్లో భారత్ జిడిపి వాటా 70 శాతానికిపైగా ఉన్నది తెలిసిందే.

01/23/2016 - 02:30

ముంబయి, జనవరి 22: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం మళ్లీ లాభాల్లోకి వచ్చాయి. మదుపరుల పెట్టుబడుల జోరుతో భారీ లాభాలను అందుకున్నాయి. దీంతో 20 నెలలకిపైగా కనిష్ట స్థాయి నుంచి సూచీలు కోలుకోగా, తిరిగి బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 24వేల స్థాయిని, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 7,400 స్థాయిని చేరుకున్నాయి.

01/23/2016 - 02:29

న్యూఢిల్లీ, జనవరి 22: దేశీయ ఆటోరంగ సంస్థ టాటా మోటార్స్.. రాబోయే ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో 20కిపైగా ప్యాసింజర్, వాణిజ్య వాహన మోడళ్లను ప్రదర్శించాలని భావిస్తోంది. ‘్ఢల్లీ ఆటో ఎక్స్‌పోలో టాటా మోటార్స్ 20కిపైగా ఆధునిక, సమకాలీన ప్యాసింజర్, వాణిజ్య వాహన మోడళ్లను ప్రదర్శించాలన్న ఉత్సాహాన్ని కనబరుస్తోంది.’ అని శుక్రవారం విడుదలైన ఓ ప్రకటనలో ఆ సంస్థ పేర్కొంది.

01/23/2016 - 02:29

న్యూఢిల్లీ, జనవరి 22: దేశీయ ఇంజినీరింగ్ ఎగుమతులు గత నెల డిసెంబర్‌లో 16 శాతం క్షీణించి 5.8 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. 2014 డిసెంబర్‌లో ఇవి 6.9 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఈ మేరకు శుక్రవారం కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది. డిసెంబర్‌లో భారత ఎగుమతులు 15 శాతం పడిపోయి 22.2 బిలియన్ డాలర్లుగా ఉన్నది తెలిసిందే.

01/22/2016 - 05:19

న్యూఢిల్లీ, జనవరి 21: దేశంలో ప్రజలకు పప్పుధన్యాలను సరఫరా చేయడం ఇప్పటికీ ‘సవాలుగానే’ కొనసాగుతోందని ఆహార శాఖ మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద మొత్తంలో పప్పులను నిల్వచేసి ఈ సవాలును అధిగమించేందుకు ప్రభుత్వం దిగుమతులను కొనసాగిస్తుండటంతో పాటు రైతుల నుంచి ఇప్పటివరకూ 15 వేల టన్నుల పప్పు్ధన్యాలను సేకరించిందని ఆయన గురువారం వెల్లడించారు.

Pages