S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐడియా

11/02/2017 - 19:34

చలికాలంలో చర్మం పొడిబారి పోతుంది. పగుళ్లు రావటంతో అసౌకర్యంగా ఉంటుంది. ఈ కాలంలో చర్మాన్ని సంరక్షించుకోవటానికి సులువైన పద్ధతులేమిటో తెలుసుకుందాం..
గ్లిజరిన్ చర్మ సమస్యలకు చక్కగా పనిచేస్తుంది. ముఖ్యంగా చలికాలంలో పొడిచర్మం బారిన పడకుండా ఉండాలంటే గ్లిజరిన్ వాడటం మంచిది.

11/01/2017 - 19:46

బాదం, పిస్తా, వాల్‌నట్స్ రక్తపోటును నియంత్రణలో వుంచుతాయి. గుండె, మెదడు ఆరోగ్యానికి మంచివి. కానీ వీటిలో అధిక ఫ్యాట్, కేలరీలు వుంటాయి. కనుక డిన్నర్ తర్వాత తీసుకుంటే బరువు పెరగడానికి కారణమవుతాయి. అందుకే సాయంత్రం వేళల్లో రోజుకు ఐదారు నట్స్ మించకుండా తినాలి. ఇక అంజీర, ఆప్రికాట్స్‌ను ఎర్లీమార్నింగ్ తీసుకోవడం మంచిది. దీనివల్ల జీవక్రియలను ప్రేరేపించినట్టు అవుతుంది.

10/27/2017 - 19:38

బ్రేక్‌ఫాస్ట్‌ను మిస్ కావద్దన్నది వైద్య నిపుణుల వాదన. హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకుల అధ్యయనంలో తేలిందేమంటే..బ్రేక్‌ఫాస్ట్‌ను తీసుకోని వారికి గుండెపోటు లేదా ప్రాణాపాయ ముప్పు 27 శాతం ఎక్కువగా వుందని. బ్రేక్‌ఫాస్ట్ తీసుకోకపోవడం వల్ల ఆకలి బాగా పెరిగిపోతుంది. దాంతో మధ్యాహ్నం తీసుకునే లంచ్ పరిమాణం అధికమవుతుంది. ఇది బ్లడ్ సుగర్ పెరగడానికి దారితీస్తుంది.

10/26/2017 - 19:55

అధిక ఉష్ణోగ్రతపై వంట చేసేటపుడు ఉత్పన్నమయ్యే పొగ వల్ల కంటిశుక్లం సరిగా పనిచేయదు. నూనెతో కూరలు వండేటపుడు విడుదలయ్యే పొగ వల్ల కార్భన్ మోనాక్సైడ్, హైడ్రోకార్బన్స్ తదితరమైనవి విడుదలవుతాయి. ఇవి పొగలో కలిసి కంటి శుక్లానికి హానిచేస్తాయ.

10/25/2017 - 19:38

రోజుకో యాపిల్ తింటే డాక్టర్‌తో పనిలేద్న మాట వినే వుంటారు. ఎందుకంటే యాపిల్‌లో ఉండేవన్నీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేవి. మరీ ముఖ్యంగా ఇందులో పెక్టిన్ అనే ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను, కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. మలబద్ధకపు సమస్యను దూరం చేస్తుంది. అందుకే ఆరోగ్య ప్రదాతల్లో ఈ పండు కూడా ఒకటి. కానీ యాపిల్‌ను రాత్రివేళల్లో తినకపోవడమే మంచిది.

10/24/2017 - 19:35

పేదవాడి నుంచి సంపన్నుల వరకు అందరూ ఇష్టపడే పండు ఇది. అరటి పండులో పొటాషియం అధికంగా వుంటుంది. శరీర రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో ఈ పండు కీలక పాత్ర పోషిస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. కండర బలోపేతానికి పనిచేస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థకు మేలు కలిగిస్తుంది. ఇది సహజ యాంటాసిడ్‌గా పనిచేస్తుంది. కడుపులో మంట ఉంటే బాగా పండిన ఒక అరటి పండు తింటే తగ్గుతుంది.

10/20/2017 - 18:06

కంటికి ఇంపుగా కనిపించే క్యారెట్ తింటే అనేక అనారోగ్య సమస్యలను మన నుంచి దూరం చేసుకున్నట్లే. రోజూ ఓ క్యారెట్ చొప్పున తింటే శరీర ఛాయ పెరుగుతుంది. అంతేకాదు శరీరంలో తేమశాతం పెరుగుతోంది. అల్సర్, గ్యాస్ లాంటి సమస్యలు రెండు నెలల్లోనే అదుపులోకి వస్తాయి. ఇందులో లభించే బీటాకెరోటిన్ అనే పదార్థం విటమిన్ ఎఏ2గా మారుతోంది. 1ఎ1 విటమిన్ కంటికి ఎంతోఅవసరం. కంటి సమస్యలు దరిచేరవు.

10/17/2017 - 19:40

అలెర్జీ సమస్యలు కనిపిస్తే ఇమ్యునాలిజస్టు లేదా ఎండీని సంప్రదించాలి. కుటుంబ ఆరోగ్య చరిత్ర, శారీరక పరిశీలన, చర్మ పరీక్ష, రక్తపరీక్షల ద్వారా వైద్యులు అలెర్జీ కారకాలను గుర్తిస్తారు. తర్వాత దాన్ని కంట్రోల్ చేసేందుకు ట్రీట్‌మెంట్‌కు ప్లాన్ చేస్తారు. ఇంజెక్షన్లు, టాబ్‌లెట్లు సూచించవచ్చు.

10/06/2017 - 23:30

ఆధునిక సమాజంలో ఆడపిల్లలకు యుక్తవయసు రాకుండానే పెళ్లి చేసేసి అత్తారింటికి పంపాలని తల్లిదండ్రులు అనుకోవటంలేదు. వారిని ఓ స్థాయికి తీసుకువచ్చి సమాజంలో గౌరవప్రదమైన జీవితం ఇవ్వాలని ఆరాటపడుతున్నారు. కాలేజీలకు వెళ్లిన యువతులు పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ దశలో ఉండేవారు. ఈ వయసులో రక్తహీనతతో బాధపడుతుంటారు. పది 10మంది యువతులలో ముగ్గురు ఈ రక్తహీనతతో బాధపడుతున్నట్లు తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయ.

10/06/2017 - 23:30

కలబంద (అలోవెర) రసం ఫ్యాట్‌ను కరిగించే సామర్థ్యాన్ని కలిగి వుంటుంది. గ్రీన్ టీలో కలుపుకొని కూడా దీనిని తీసుకోవచ్చు. సహజంగా బరువు తగ్గించుకోవాలనుకుంటున్నారా? ఆరోగ్యకర ఆహార ప్రణాళిక, వ్యాయామాలతో పాటూ కలబంద రసాన్ని కూడా క్రమంగా తీసుకోండి. ఎందుకంటే బరువు తగ్గించడంలో ఇది గొప్పగా పనిచేస్తుంది.
కొవ్వును కరిగించడంలో..

Pages