S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

06/28/2017 - 00:48

బీజింగ్, జూన్ 27: భారత సైన్యాలు సిక్కిం ప్రాంతంలో సరిహద్దులను అతిక్రమించిందని చైనా ఆరోపిస్తూ, వారిని తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. అంతేకాదు, సరిహద్దుల్లో ఉద్రిక్తత కారణంగానే మానస సరోవర్ యాత్రకు వెళ్తున్న భారతీ యాత్రికుల కోసం నాథులా పాస్ మార్గాన్ని మూసివేసినట్లు స్పష్టం చేసింది.

06/27/2017 - 01:57

వాషింగ్టన్, జూన్ 26: హిజ్‌బుల్ ముజాహిదీన్ అధినేత సయ్యద్ సలాహుద్దీన్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా అమెరికా విదేశాంగ విభాగం ప్రకటించింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ల సమావేశానికి ముందే సోమవారం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. సలాహుద్దీన్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడం అన్నది భారత్ సాధించిన ఘన విజయంగా పేర్కొంటున్నారు.

06/27/2017 - 01:20

వాషింగ్టన్, జూన్ 26: మూడేళ్ల పాలనలో తమ ప్రభుత్వంపై ఒక్క అవినీతి ఆరోపణ లేదని, మచ్చలేని స్వచ్ఛమైన పాలనను అందిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఎన్నికల్లో ప్రజలు ప్రభుత్వాలను మట్టికరిపించారంటే దానికి ప్రధాన కారణం అవినీతేనని ఆయన పేర్కొన్నారు. భారతీయులు అవినీతిని అసహ్యించుకుంటారని అన్నారు. ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఇక్కడి ప్రవాస భారతీయులతో ఏర్పాటుచేసిన సమావేశంలో మోదీ మాట్లాడారు.

06/27/2017 - 01:15

వాషింగ్టన్, జూన్ 26: అమెరికాతో భారతదేశ వ్యూహాత్మక అనుబంధం అనిర్వచనీయమైందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. అమెరికా పర్యటన సందర్భంగా ఆయన వాల్‌స్ట్రీట్ జర్నల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాల గురించి ప్రస్తావించారు. ఉగ్రవాదం, విప్లవాత్మక ఆలోచనలు, సంప్రదాయేతర రక్షణ ప్రమాదాల నుంచి ప్రపంచాన్ని రక్షించటంపై రెండు దేశాలూ కలిసి పని చేస్తున్నాయని మోదీ అన్నారు.

06/27/2017 - 01:06

వాషింగ్టన్, జూన్ 26: వలసలపై నిషేధం విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఆ దేశ సుప్రీం కోర్టులో స్వల్ప ఊరట లభించింది. ముస్లింల ప్రాబల్యం అధికంగా ఉన్న ఆరు దేశాలను లక్ష్యంగా చేసుకుని ట్రంప్ విధించిన ఈ నిషేధాన్ని అమెరికా సుప్రీం కోర్టు సోమవారం పాక్షికంగా అమలులోకి తీసుకొచ్చింది. ఈ అంశంపై సుప్రీం కోర్టు అక్టోబర్‌లో పూర్తిస్థాయి విచారణ జరిపే వరకూ ఈ నిషేధం అమలులో ఉంటుంది.

06/27/2017 - 00:48

వాషింగ్టన్, జూన్ 26: ఉగ్రవాదం నిజస్వరూపాన్ని ప్రపంచ దేశాలకు భారత్ కళ్లకు కట్టిందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. అందుకే ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద కేంద్రాల్ని నిర్మూలించేందుకు భారత్ జరిపిన లక్షిత దాడులను ఎవరూ ప్రశ్నించలేదన్నారు.

06/26/2017 - 02:02

లాహోర్, జూన్ 25: రహదారిపై బోల్తాపడ్డ ట్యాంకర్ నుంచి కారుతున్న పెట్రోల్‌ను తీసుకెళ్దామన్న ఆశ 151 మంది ప్రాణాలను బలిగొంది. ఈ సంఘటన లాహోర్‌కు 400 కిలోమీటర్ల దూరంలోని అహ్మద్‌పూర్ షర్కియాప్రాంతంలో ఆదివారం ఉదయం జరిగింది. కరాచి నుంచి లాహోర్ వెళ్తున్న పెట్రోల్ ట్యాంకర్ టైరు పేలిపోవడంతో రహదారిపై బోల్తాపడింది.

06/26/2017 - 01:53

వాషింగ్టన్, జూన్ 25: అన్ని విధాలుగా వ్యాపారానుకూల దేశంగా భారత్ ఆవిర్భవించిందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఆదివారం ఇక్కడ జరిగిన అమెరికా కంపెనీల సీఇఓల సమావేశంలో మాట్లాడిన మోదీ భారత్‌లో భారీగా పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు. వచ్చే నెల నుంచి అమలుకానున్న జిఎస్‌టితో పెట్టుబడులకు మరింత సానుకూల పరిస్థితులు ఏర్పడతాయని ఉద్ఘాటించారు.

06/26/2017 - 01:52

వాషింగ్టన్,జూన్ 25: భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య సోమవారం జరిగే శిఖరాగ్ర సమావేశం అనేక కోణాల్లో ఆసక్తిని కలిగిస్తోంది. ఇటీవల కాలంలో తీవ్రస్థాయి అలజడి సృష్టించిన హెచ్-1బి వీసాలు, పౌర అణు ఇంధన ఒప్పందం, నాసా-ఇస్రోలు సంయుక్తంగా తలెట్టిన ఎర్త్ ఇమేజింగ్ ఉపగ్రహం వంటి అనేక ద్వైపాక్షిక అంశాలు మోదీ-ట్రంప్ మధ్య జరిగే చర్చల్లో ప్రస్తావనకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.

06/26/2017 - 00:51

చిత్రం.. అమెరికాకు పయనమవుతున్న ప్రధాని నరేంద్ర మోదీకి లిస్బన్‌లో వీడ్కోలు పలుకుతున్న పోర్చుగల్ ప్రధాని ఆంటోనియో కోస్టా.

Pages