S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

06/26/2017 - 00:49

వాషింగ్టన్, జూన్ 25: ప్రధాని నరేంద్ర మోదీని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘నిజమైన మిత్రుడు’గా అభివర్ణించారు. సోమవారం శే్వతసౌధంలో ప్రధాని మోదీతో వ్యూహాత్మక అంశాలను చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ‘శే్వతసౌధంలో ప్రధాని నరేంద్ర మోదీకి సోమవారం స్వాగతం చెప్పేందుకు ఎదురు చూస్తున్నాను.

06/26/2017 - 00:43

కాబూల్, జూన్ 25: అఫ్గానిస్తాన్‌లో భారత్ నిర్మించిన సల్మా డ్యామ్ చెక్‌పోస్టు వద్ద తాలిబన్లు ఉగ్రదాడికి పాల్పడటంతో 10మంది పోలీసులు దుర్మరణం చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. హీరత్ ప్రావిన్స్‌లోని సల్మా డ్యామ్ చెక్‌పోస్టు వద్ద శనివారం పొద్దుపోయిన తర్వాత తాలిబన్లు దాడిచేసి పోలీసులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారని అధికారులు తెలిపారు.

06/26/2017 - 00:43

జెరూసలెం, జూన్ 25: భారత ప్రధాని నరేంద్ర మోదీ జూలై 4నుంచి మూడు రోజుల పాటు తమ దేశంలో జరపబోతున్న పర్యటన ఇరు దేశాల మధ్య మైత్రీబంధాన్ని మరింతగా బలోపేతం చేయగలదన్న ఆశాభావాన్ని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఏ భారత ప్రధాని ఇజ్రాయెల్‌లో పర్యటించని నేపథ్యంలో మోదీ పర్యటన ప్రాధాన్యత మరింతగా పెరిగింది.

06/26/2017 - 00:38

వాషింగ్టన్, జూన్ 25: అంతరిక్ష పరిశోధనల అంచనాలకు, ఊహలకు అందకుండా మిస్టరీ గ్రహంగా కొనసాగుతున్న ప్లానెట్ 10 మన సౌరవ్యవస్థ అంచుల్లో దాగి ఉండవచ్చునని శాస్తవ్రేత్తలు చెబుతున్నారు. అంగారక గ్రహాన్ని పోలిన ఓ గ్రహం మన సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తున్న విషయాన్ని భారత శాస్తవ్రేత్తతో కూడిన రోదసి నిపుణుల బృందం గుర్తించింది.

06/25/2017 - 04:31

రియాద్, జూన్ 24: ముస్లింలకు పవిత్ర మాసమైన రంజాన్‌లో మక్కా మసీదు పేల్చివేసి, విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదులు చేసిన ఆత్మాహుతి దాడి యత్నాన్ని సౌదీ భద్రతా దళాలు భగ్నం చేశాయి. శనివారం మక్కా పరిసర ప్రాంతాల్లోని అజ్యాద్ అల్ మసాఫి, జెద్దాలలో భద్రతా దళాలు గస్తీ కాస్తున్న సమయంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తి తారసపడ్డాడు.

06/25/2017 - 03:12

వాషింగ్టన్, జూన్ 24: మూడు దేశాల పర్యటనకోసం శనివారం బయలుదేరిన ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం అమెరికా చేరుకుంటారు. కాగా, ప్రధాని మోదీ అమెరికా పర్యటన నేపథ్యంలో భారత్‌ను అగ్రరాజ్యం పెద్దగా పట్టించుకోవడం లేదంటూ వస్తున్న వార్తలను ట్రంప్ ప్రభుత్వం కొట్టిపారేసింది.

06/25/2017 - 03:08

బీజింగ్, జూన్ 24: దక్షిణ చైనాలోని సిచువాన్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకొంది. శనివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో భారీ ఎత్తున కొండ చరియలు విరిగి పడ్డంతో కొండప్రాంత గ్రామమైన జిన్మో శిథిలాల కింద పూర్తిగా కూరుకు పోయింది. చాలా ఎత్తునుంచి వందలాది టన్నుల కొండచరియలు విరిగి పడ్డంతో గ్రామంలోని అరవైకి పైగా ఇళ్లు పూర్తిగా నేలమట్టమైనాయి.

06/25/2017 - 01:27

దక్షిణ చైనా సిచువాన్ రాష్ట్రంలో శనివారం కొండ చరియలు విరిగిపడటంతో జిన్మో గ్రామం శిథిలాల కింద కూరుకుపోయింది. ప్రమాదంలో 120 మందికిపైగా శిథిలాల కింద గల్లంతయ్యారు. ఇప్పటివరకు ఐదు మృతదేహాలను వెలికితీశారు. శిధిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు

06/25/2017 - 01:20

లిస్బన్ / వాషింగ్టన్, జూన్ 24: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యంత కీలకమైన మూడు దేశాల విదేశీ పర్యటన పోర్చుగల్‌తో ప్రారంభమైంది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తరువాత, ఆయనతో మోదీ తొలిసారి భేటీ కానున్నారు. ఇరుదేశాలకూ ఇది కీలకమైన సమావేశం కానుంది.

06/25/2017 - 00:49

వాషింగ్టన్, జూన్ 24: అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో జరిగే శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధాన మంత్రి హెచ్-1బి వీసాల అంశాన్ని ప్రస్తావించినట్లయితే దానిపై స్పందించేందుకు సిద్ధంగా ఉన్నామని అమెరికా స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్షుడితో మోదీ సోమవారం వైట్‌హౌస్‌లో భేటీ కానున్న నేపథ్యంలో ట్రంప్ ప్రభుత్వంలోని సీనియర్ అధికారి ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు.

Pages