S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

03/06/2017 - 07:15

న్యూయార్క్/ న్యూఢిల్లీ, మార్చి 5: అమెరికాలో హైదరాబాద్ టెకీ శ్రీనివాస్ కూచిభొట్ల హత్యతో మొదలయిన జాతి విద్వేష దాడులు కొనసాగుతుండటం పట్ల భారతీయ సమాజం తీవ్ర ఆందోళన చెందుతోంది.

03/06/2017 - 04:35

న్యూయార్క్, మార్చి 5: హైదరాబాద్ టెకీ శ్రీనివాస్ కూచిభొట్ల హత్యోదంతాన్ని మరువక ముందే అమెరికాలో మరో భారతీయ సంతతికి చెందిన వ్యక్తి జాతి విద్వేష తూటాలకు గురై, తీవ్రంగా గాయపడ్డాడు. దీప్ రాయ్ అనే 39 ఏళ్ల భారతీయ సంతతికి చెందిన అమెరికా జాతీయుడయిన సిక్కు వ్యక్తిపై ముఖానికి పాక్షికంగా మాస్కు ధరించి వచ్చిన దుండగుడు కాల్పులు జరిపాడు.

03/05/2017 - 02:53

వాషింగ్టన్, మార్చి 4: భారత్, అమెరికా సంబంధాల పట్ల ట్రంప్ పాలనా యంత్రాంగం చాలా సానుకూల దృక్పథంతో ఉందని, ఇరు దేశాల బంధాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అమితమైన ఆసక్తిని ప్రదర్శిస్తోందని భారత విదేశాంగ కార్యదర్శి జైశంకర్ తెలిపారు.

03/05/2017 - 02:40

వాషింగ్టన్, మార్చి 4: భారత్‌లో విదేశీ విరాళాలు స్వీకరిస్తున్న స్వచ్ఛంద సంస్థలపై, మత స్వేచ్ఛపై ఆంక్షలు విధించడం, అవినీతి, పోలీసు, భద్రతా దళాల అధికార దుర్వినియోగం వంటివి మానవ హక్కుల ఉల్లంఘనల్లో ఉన్నాయని అమెరికా ప్రభుత్వం రూపొందించిన నివేదిక వెల్లడించింది.

03/05/2017 - 02:39

వాషింగ్టన్, మార్చి 4: అమెరికాలోని కాన్సాస్‌లో జరిగిన కాల్పుల ఘటనను వ్యక్తిగత చర్యగా పరిగణించాలని భారత విదేశాంగ కార్యదర్శి జైశంకర్ అన్నారు. అమెరికా నేవీకి చెందిన వ్యక్తి జరిపిన ఈ కాల్పుల్లో హైదరాబాద్ టెకీ శ్రీనివాస్ కూచిభొట్ల మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల ఘటనను వ్యక్తిగత చర్యగా పరిగణించాలని, అమెరికా పాలనా వ్యవస్థ, అమెరికా సమాజం ఈ దుశ్చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ఆయన పేర్కొన్నారు.

03/05/2017 - 02:38

వాషింగ్టన్, మార్చి 4: హెచ్-1బి వీసాల సమస్య తమకు ప్రధానమైనది కాదని, ట్రంప్ ప్రభుత్వం చేపట్టబోయే విస్తృతస్తాయి ఇమిగ్రేషన్ సంస్కరణల ప్యాకేజిలో భాగంగానే ఇది ఉంటుందని అమెరికా మన దేశానికి హామీ ఇచ్చింది.

03/05/2017 - 02:16

వాషింగ్టన్, మార్చి 4: నిత్యం వివాదాస్పద ప్రకటనలు చేస్తూ వార్తల్లోకి ఎక్కుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో వివాదాస్పద ప్రకటన చేశారు. తనకన్నా ముందు అధ్యక్షుడుగా ఉండిన బరాక్ ఒబామా అధ్యక్ష ఎన్నికలకు ముందు న్యూయార్క్‌లోని తన కార్యాలయం ఫోన్‌ను ట్యాపింగ్ చేశారని ఆయన ఆరోపించారు. అంతేకాదు, ఈ వ్యవహారాన్ని ఆయన ‘వాటర్‌గేట్’ కుంభకోణంతో పోల్చారు.

03/05/2017 - 01:47

న్యూయార్క్, మార్చి 4: అమెరికాలో జాత్యహంకార దాడిలో తెలుగు యువ ఇంజనీర్ శ్రీనివాస్ మరణ వార్తనుంచి తేరుకోకముందే మరో భారతీయ వ్యాపారిని దుండగులు దారుణంగా కాల్చి చంపారు. సౌత్ కరోలినా రాష్ట్రంలోని లాంకాస్టర్ కౌంటీలో హర్నీష్ పటేల్ (43) గురువారం రాత్రి 11.33 గంటల ప్రాంతంలో దుకాణం మూసేసి ఇంటికి తిరిగి వెళ్తుండగా ఆయన ఇంటికి సమీపంలోనే గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు.

03/05/2017 - 01:42

న్యూయార్క్, మార్చి 4: హెచ్-1బి వీసాల ప్రీమియం ప్రాసెసింగ్‌ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. పెండింగ్‌లో ఉన్న రెగ్యులర్ హెచ్-1బి వీసాల దరఖాస్తుల పరిశీలనను పూర్తి చేసేందుకు ఈ చర్య తీసుకొన్నట్లు అమెరికా సిటిజన్‌షిప్, ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యుఎస్‌సిఐఎస్)విభాగం తెలియజేసింది. ఆరునెలల పాటు ఈ తాత్కాలిక రద్దు ఉండవచ్చని కూడా ఆ విభాగం తెలియజేసింది.

03/04/2017 - 02:53

వాషింగ్టన్, మార్చి 3: భారత్ వంటి దేశాలకు అమెరికా ఉద్యోగాల తరలిపోతున్నాయని గత కొంత కాలంగా పేర్కొంటున్న అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అలాంటి చర్యలను నిరోధించడానికి ఉపక్రమించారు. ట్రంప్ ప్రభుత్వం ఇందుకోసం ఒక బిల్లును శుక్రవారం అమెరికా కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టింది.

Pages