S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

08/17/2016 - 15:36

దిల్లీ: కాశ్మీర్‌ అంశంపై ప్రత్యేకంగా చర్చించడానికి పాకిస్థాన్‌ ఇచ్చిన ఆహ్వానాన్నితిరస్కరిస్తూ భారత హైకమిషనర్‌ పాకిస్థాన్‌ విదేశాంగ శాఖ కార్యదర్శికి లేఖ పంపించారు. కాశ్మీర్‌ భారత అంతర్గత అంశమని, పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ అంశంలోనే చర్చకు అవకాశం ఉంటుందని భారత్‌ గతంలోనే తెలిపింది. కాశ్మీర్‌ అంశంపై చర్చకు రమ్మని ఇటీవల పాక్‌ విదేశాంగ శాఖ కార్యదర్శి భారత హైకమిషనర్‌కు లేఖ పంపిన సంగతి తెలిసిందే.

08/17/2016 - 00:16

ఇస్లామాబాద్, ఆగస్టు 16: కాశ్మీర్ ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను ప్రపంచ దేశాలు గుర్తించాల్సిన అవసరముందని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ అన్నారు. అక్కడి ప్రజలు జరుపుతున్న స్వాతంత్య్ర పోరాటానికి తమ మద్దతు కొనసాగుతుందని మరోసారి స్పష్టం చేశారు. మంగళవారం పాక్ ఆక్రమిత కాశ్మీర్ మాజీ అధ్యక్షుడు సర్దార్ మహమ్మద్ యాకూబ్ ఖాన్‌ను కలిసినప్పుడు షరీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

08/17/2016 - 00:14

వాషింగ్టన్, ఆగస్టు 16: పాకిస్తాన్ కబంధ హస్తాల నుంచి తమను విముక్తం చేయాలంటూ బలూచిస్తాన్ ప్రజలు అంతర్జాతీయ మద్దతు కోసం పిలుపునిచ్చారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ అందించిన స్నేహ హస్తం నేపథ్యంలో బలూచ్ ప్రజలు ఇప్పుడు అమెరికా, ఐరోపా దేశాల మద్దతు కోరుతున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం తమను అణచివేస్తోందని, దానినుంచి తమను రక్షించాలని అభ్యర్థించారు.

08/17/2016 - 00:10

న్యూయార్క్, ఆగస్టు 16: ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడానికి మానవ హక్కుల ముసుగు వేసుకునే దేశాలు తీవ్రమైన నయవంచకులని కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎంజె అక్బర్ పరోక్షంగా పాక్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు. ఉగ్రవాదమే మానవ హక్కులకు అతి పెద్ద శత్రువని, అన్ని మతాలు సమానవైనవని, ఏ మతం కూడా మిగతా మతాలకన్నా ఎక్కువ కాదని నమ్మే దేశం భారత్ అని అన్నారు.

08/17/2016 - 02:27

న్యూయార్క్, ఆగస్టు 16: అంతర్జాతీయ వేదికపై స్వరభారతి ఎంఎస్ సుబ్బులక్ష్మికి అపూర్వమైన స్వరార్చన జరిగింది. భారతజాతి గర్వించదగ్గ మహాగాయనికి విశ్వసంగీత చక్రవర్తి ఏఆర్ రహమాన్ ఐక్యరాజ్యసమితి వేదికగా అపురూపమైన నివాళిని అర్పించారు. 70వ భారత స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ హాల్‌లో కిక్కిరిసిన ప్రేక్షకుల మధ్య రహమాన్ తన సంగీత విన్యాసంతో ఉర్రూతలూగించారు.

08/16/2016 - 13:11

న్యూయార్క్‌: న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితిలో ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్‌. రెహమాన్‌ తన పాటకచేరీతో అభిమానుల్ని సమ్మోహితుల్ని చేశారు. ఐక్యరాజ్యసమితి వేదికపై భారతదేశ 70వ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు రెహమాన్‌ కార్యక్రమంతో ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్‌లో సుబ్బులక్ష్మి శత జయంతి రానున్న సందర్భంగా కచేరీ ప్రారంభించే ముందు రెహమాన్‌ ఆమెకి నివాళులర్పించారు.

08/16/2016 - 03:22

బీజింగ్/వాషింగ్టన్, ఆగస్టు 15: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రపంచమంతటా భారతీయుల్లో దేశభక్తి భావం వెల్లివిరిసింది. జాతీయ పతకావిష్కరణలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలతో సోమవారం వారు 70వ స్వాతంత్య్ర దిన వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించుకున్నారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా భారత్‌లోని భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబిస్తూ ఈ కార్యక్రమాలు జరిగాయి.

08/16/2016 - 03:21

ఖాట్మండు, ఆగస్టు 15: నేపాల్‌లో సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 31 మంది దుర్మరణం చెందారు. 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. మధ్య నేపాల్‌లోని కవ్రేలో బిర్టా-డెయిరల్ హైవే నుంచి 300 మీటర్ల లోయలోకి ప్రయాణికుల బస్సు బోల్తా కొట్టింది. ప్రమాదం జరిగే సమయంలో బస్సులో 85 మంది ప్రయాణికులున్నట్టు అధికారులు వెల్లడించారు. ప్రాధమిక సమాచారం ప్రకారం 31 మంది మృతి చెందారని విచారణ అధికారి ధన్ బహదూర్ తెలిపారు.

08/15/2016 - 12:32

కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ నగరంలో అమెరికా దౌత్య కార్యాలయం వద్ద సోమవారం ఉదయం బాంబు పేలుడు సంభవించింది. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు దౌత్య కార్యాలయానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. పేలుడు కారణంగా భారీసంఖ్యలో వాహనాలు ధ్వంసమయ్యాయని, ఆస్తి, ప్రాణ నష్టం గురించి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసు అధికారులు చెబుతున్నారు.

08/15/2016 - 08:00

జెనీవా, ఆగస్టు 14: బంగ్లాదేశ్ అవతరణకు సహకరించినట్లుగానే తమకు సహాయం చేయాలని బలోచ్ రిపబ్లికన్ పార్టీ వ్యవస్థాపక అధినేత బ్రహుందగ్ బుగ్తి భారత్‌ను కోరారు. బలోచిస్తాన్ ప్రజలు స్వదేశంలో దిక్కులేని వారిగా, నిస్సహాయులుగా జీవిస్తున్నారని పేర్కొంటూ, లిబియా, సిరియాలలో జోక్యం చేసుకోగలిగిన అంతర్జాతీయ సమాజం బలోచిస్తాన్‌లో ఎందుకు జోక్యం చేసుకోకూడదని ప్రశ్నించారు.

Pages