S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

06/09/2016 - 23:46

లండన్, జూన్ 9: లండన్‌లో ఓ కొత్త హోటల్ వినూత్న పంథాలో వెలసింది. ‘బున్యాదీ’ అన్న హిందీ పేరుతో ఏర్పాటు చేసిన ఈ హోటల్ లండన్‌లో తొలి నగ్న హోటల్‌గా ప్రారంభమైంది. బున్యాదీ అంటే పునాది అని అర్థం అని యజమానులు తెలిపారు. హోటల్‌కు వచ్చే వినియోగదారులు పూర్తి సహజత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకునేందుకే ఈ హోటల్‌ను ప్రారంభించినట్లు వారు వెల్లడించారు.

06/09/2016 - 17:12

మాస్కో: యుద్ధ విమానం మాస్కో సమీపంలో గురువారం కుప్పకూలడంతో పైలట్‌ మరణించాడని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కూలిన సమయంలో అందులో ఆయుధాలు ఏమీ లేవని, కూలిన చోట ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.

06/09/2016 - 17:08

ఆరిజోనా : అమెరికాలోని ఆరిజోనా అడవుల్లో గురువారం కార్చిచ్చు చెలరేగింది. సమీప ప్రాంతంలో వందల మందిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 2013లోనూ ఇదే ప్రాంతంలో మంటలు చెలరేగడంతో 19 మంది మరణించారు.

06/09/2016 - 13:34

మెక్సికో: అయిదు దేశాల్లో పర్యటన ముగిసిన అనంతరం భారత ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఉదయం మెక్సికో నుంచి భారత్‌కు బయలు దేరారు. ఈ నెల 4న ఆయన విదేశీ పర్యటనకు బయలుదేరి ఆఫ్ఘనిస్థాన్, ఖతార్, అమెరికా, స్విట్జర్లాండ్, మెక్సికోలో పర్యటించారు. ఆయా దేశాల అధినేతలతో దౌత్యపరమైన చర్చలు జరిపి పలు ఒప్పందాలను ఖరారు చేశారు. అమెరికాలో అత్యున్నత చట్టసభలో ఆయన మాట్లాడి అందరినీ ఆకట్టుకున్నారు.

06/09/2016 - 12:58

మెక్సికో : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి బుధవారం రాత్రి మెక్సికో అధ్యక్షుడు ఎన్రిక్ పెనా నీటో ఆత్మీయంగా స్వాగతం పలికారు. ఆ తర్వాత మెక్సికో సిటీలోని ఓ రెస్టారెంట్‌కు తీసుకెళ్ళారు. అప్పుడు కూడా ప్రోటోకాల్‌ను పక్కనబెట్టి మెక్సికో అధ్యక్షుడే స్వయంగా కారు నడుపుతూ మోదీని రెస్టారెంట్‌కు తీసుకెళ్ళారు. ఆ రెస్టారెంట్‌లో ఇద్దరూ శాకాహార భోజనం చేశారు.

06/09/2016 - 07:00

వాషింగ్టన్, జూన్ 8: ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటుకు భారత దేశం బలమైన ఇంధనశక్తిగా, ఇంజనుగా పనిచేసేందుకు సంసిద్ధంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉద్ఘాటించారు. భారత ఆర్థిక వ్యవస్థ ఎంతగా విస్తరిస్తే, అంతగానూ ప్రపంచానికి బహుళ ప్రయోజనాలు సిద్ధిస్తాయని బుధవారం ఇక్కడ జరిగిన భారత అమెరికా వ్యాపార మండలి సమావేశంలో స్పష్టం చేశారు. ‘‘ప్రస్తుత ప్రపంచ వృద్ధి రేటును పెంచేందుకు బలమైన ఇంజను కావాలి..

06/09/2016 - 06:58

లాస్ ఏంజిల్స్, జూన్ 8: అమెరికా రాజకీయ చరిత్రలోనే ఒక ప్రధాన రాజకీయ పార్టీ తరఫున అధ్యక్ష పదవికి అభ్యర్థిత్వాన్ని దక్కించుకున్న తొలి మహిళగా హిల్లరీ క్లింటన్ బుధవారం చరిత్ర సృష్టించారు. న్యూజెర్సీ, న్యూమెక్సికో, డకోటా రాష్ట్రాల్లో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో ఆమె డెమోక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి అర్హతను సంపాదించారు.

06/09/2016 - 06:23

................
మన బంధం ప్రపంచానికే బలం మా పొరుగునే ఉగ్రవాద కుంపటి
విధ్వంసం, విద్వేషమే దాని లక్ష్యం మారుమాట లేకుండా మట్టుబెట్టాలి
ప్రవాస భారతీయులు స్నేహవారధులు మాకు రాజ్యాంగమే పవిత్ర గ్రంథం
అంబేద్కర్‌కు మీ రాజ్యాంగమే స్ఫూర్తి ఉద్వేగ, ఉత్తేజ భరితంగా మోదీ ప్రసంగం
ఆద్యంతం కరతాళ ధ్వనులే మేడిసన్ స్క్వేర్‌ను తలపించిన అమెరికా కాంగ్రెస్

06/09/2016 - 06:16

వాషింగ్టన్, జూన్ 8: భారత వైమానిక కేంద్రం పఠాన్‌కోట్‌పై దాడికి కుట్ర పన్నిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్‌కు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తీవ్ర స్వరంతో విజ్ఞప్తి చేశారు. పఠాన్‌కోట్‌పై జరిగిన దాడిని ఎనిమిదేళ్ల క్రితం ముంబయి మహానగరంపై జరిగిన ఉగ్రవాద దాడితో పోల్చిన ఒబామా ‘కుట్రదారులపై ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలి’అని పాక్‌ను ఆదేశించారు.

06/08/2016 - 14:53

న్యూయార్క్‌: అమెరికాలోని న్యూయార్క్‌ నగరం మాడిసన్‌ స్క్వేర్‌ గార్డెన్‌ స్ట్రీట్‌కు ప్రపంచ బాక్సింగ్‌ దిగ్గజం మహ్మద్‌ అలీగా నామకరణం చేశారు. మూడు దశాబ్దాల పాటు పార్కిన్‌సన్‌ వ్యాధితో పోరాడిన అలీ 74 ఏళ్ల వయసులో ఈ నెల 3న కన్నుమూసిన సంగతి తెలిసిందే. అలీ అభిమానులు పెద్ద సంఖ్యలో మాడిసన్‌ స్క్వేర్‌కు చేరుకుని ఆయన పేరుతో ఉన్న ‘మహ్మద్‌ అలీ వే’ స్ట్రీట్‌ సైన్‌ బోర్డును ఏర్పాటు చేశారు.

Pages