S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచి మాట

02/15/2017 - 20:50

సమాజంలో ఒక వ్యక్తి ఉన్నత శిఖరాల నధిరోహించడం అంత తేలిక కాదు. అట్లాగే వ్యక్తులందరూ ఒకలా ఉండరు. శైశవదశ నుండి, విద్యార్థి, ఉద్యోగి దశల తరువాత జీవితపు చివరి దశలలో మంచి వ్యక్తిగా మిగిలిపోవడం ఎన్నో అంశాలమీద ఆధారపడి ఉంటుంది.

02/14/2017 - 21:12

మన దేశం ధర్మప్రధానమైన దేశం. శాంతి సౌఖ్యాలు వర్థిల్లాలంటే ధర్మాచరణ ఎంతైనా అవసరం. ధర్మాచరణకు సత్యవచనం ప్రామాణికమైనదని శాస్తవ్రచనం. అందువలననే చతుర్విధ పురుషార్థాలలో (్ధర్మార్థ కామ మోక్షాలు) ధర్మానికి ప్రధమ స్థానం ఇవ్వబడింది. ధర్మాచరణకు మంచి విద్య అనివార్యం. విద్య జ్ఞానాన్ని కలిగిస్తుంది. అజ్ఞానమనే అంధకారాన్ని తొలగిస్తుంది. విద్యలేనివాడు వింత పశువు అంటారు.

02/12/2017 - 21:11

మనిషి ఉదయం నిద్రలేచిన దగ్గరనుండి మరలా రాత్రినిద్రపోయే వరకు ఎనె్నన్నో దినచర్యలు, ఎన్నో పనులు తాను స్వయంగా చేసుకుపోవాలి. మరికొన్ని ఇతరులచే చేయించాలి. వృత్తిపరంగా, కుటుంబ పరంగా ఈ పనులు (కర్మలు) కార్యక్రమాలకై ఇంటా, బయటా, ఎందరినో కలియాలి. తనను ఎందరో కలియవలసి ఉంటుంది.

02/11/2017 - 21:20

కారణజన్ముల ఆలోచనలు ఉదాత్తమైన గొప్ప విషయాలపై లగ్నం కాబడి ఉంటాయి. స్వామి వివేకానందుని మనస్సు చిన్నతనం నుండీ భగవంతుని ఉనికిని అనే్వషిస్తూ ఉండేది. నిరంతరం ఆధ్యాత్మిక చింతనతో తపించిపోయేవారు. భగవంతుడు ఉన్నాడా? ఉంటే కనపడతాడా? అని తమలో తాము మదనపడుతూ ఉండేవారు. మతమునకు సరైన నిర్వచనము లభించక సతమతమైపోయేవారు. కనబడిన గొప్ప పండితులను, మత పెద్దలను భగవంతుని గురించి ప్రశ్నించి విఫలమయ్యారు.

02/10/2017 - 21:23

ధర్మాన్ని ఆచరిస్తే దైవాన్ని పూజించినట్లే అంటారు పునీతులు. ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. ధర్మో రక్షతి రక్షితః అని వేదాలు ఘోషిస్తున్నాయి. అది దైవదత్తం. అదే మానవునకు మహోత్తమమైన విత్తం.

02/09/2017 - 22:58

ఉపదేశం అంటే ఒకరు, మరొకరికి దగ్గరగా కూర్చుని చెప్పే మంచిమాటలు. శ్రీమదాంధ్ర మహాభారతం శాంతి పర్వంలో భీష్మాచార్యులవారిని ధర్మరాజు, పితామహా! మానవుడు సుఖం పొందే మార్గం ఏదీ? అని ప్రశ్నించాడు. దానికి సమాధానంగా భీష్ముడు ఒక పుత్రునికీ, తండ్రికీ మధ్య జరిగిన సంవాదమును ఉదాహరణగా చెబుతూ సమాధానం వినమన్నాడు. రాజా! స్వాధ్యాయాన్ని నిరంతరం అధ్యయనం చేసే ఒక ద్విజునికి మేధావి అనే సార్థక నామధేయుడైన పుత్రుడున్నాడు.

02/08/2017 - 23:25

తెలుగు శతక కర్త నుడివినట్లు, మనిషికి- తన కోపమె తనకు శత్రువు. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు వాక్రుచ్చినట్లు ‘‘ఈలోకంలో, ఐహిక విషయాలనే ప్రాథమికంగా ఆలోచించే వ్యక్తికి, వాటిమీద ఆసక్తి బాగా కలుగుతుంది. ఇది కోరికలకు దారితీస్తుంది. కోరికలవలన కోపము, దానివలన అవివేకం కలుగుతుంది. కోపం మూలంగా అవివేకం, అజ్ఞానం పెరిగి, మతిభ్రమణం, మతిమరుపు, బుద్ధి నాశనం సంభవిస్తాయి. చివరకు అది వ్యక్తి నాశనానికి దారితీస్తుంది.

02/07/2017 - 21:25

మంచి సంకల్పం అనేది మంచి కార్యఫలితాలకి ఆదిగురువు. మన మనసులో మంచి సంకల్పం అనే బీజం పడితే అది మొలకై, మొక్కై ఎదగడానికి గట్టి కృషి, పట్టుదల, కార్యదీక్ష కలిసి సమిష్టిగా పనిచేస్తాయి.

02/05/2017 - 21:05

మన సంఖ్యాశాస్త్రంలో మొదటి పది అంకెలు- (సున్న, ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది) వీటిలో ఒక్కొక్క అంకెకు ఒక్కొక్క ప్రత్యేకత / విశిష్టత ఉన్నది. సున్న (శూన్యం)- ఈ విశ్వానికి, రెండు - ద్వంద్వ ప్రవృత్తులకు ప్రతీకలుగా ఉన్నాయి. ఒక మూడు అంకెకు ఉన్న ప్రఖ్యాత విశిష్టతలు ముల్లోకాలు, ముక్కంటి, త్రిమూర్తులు, త్రిగుణాలు, త్రిశూలం మొదలైనవి.

02/05/2017 - 03:53

పూర్వం శే్వతకి అనే రాజర్షి ఉండేవాడు. ఆయన జనకుడిలాగా రాజ్యపాలన చేస్తూనే ఋషి ధర్మాలను అనుసరించేవాడు. ఆయన ఒకసారి వేల సంఖ్యలో యజ్ఞయాగాదులు చేశాడు. ఆ యాగాలలో సమర్పింపబడిన నెయ్యిని స్వీకరించిన అగ్నిదేవుడికి అజీర్తి వ్యాధి పట్టుకున్నది. ఎవరిని అడిగినా ఖాండవ వనంలో ఔషధ మూలికలను సేవిస్తేనే ఇది నయమవుతుందని చెప్పారు. సేవించడం అంటే భస్మం చెయ్యడమే. తన యజమాని ఇంద్రునిది ఆ ఖాండవం.

Pages