S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచి మాట

05/02/2016 - 03:52

‘శరీర మాధ్యం ఖలు ధర్మసాధనమ్’ అన్న వేదోక్తి ప్రకారం మానవునికి లభించిన ఈ శరీరమనే ఉపాధి ధర్మసాధనకు మాత్రమే వినియోగించాలి. కాని నేడు కలియుగ ప్రభావం వలన ధర్మమనే మాటకు సరి అయిన నిర్వచనం తెలియక సతమతమవుతున్నారు. పూర్వజ్ఞానం విజ్ఞాన శాస్తమ్రుగా ఆవిర్భవించినప్పటినుండి మానవులలో స్థిరత్వము లోపించింది. ఉత్కృష్టమైన మానవ జన్మను స్వజాతి నాశనము కొరకు వినియోగిస్తున్నారు.

04/30/2016 - 22:30

భగవంతుడు జ్యోతిస్వరూపుడు. నిర్వికారుడు. అతడు పరమ బ్రహ్మస్వరూపుడు. తేజస్వి. మహానుభావులంతా అతనే్న ఉపాసిస్తారు. అతని ప్రకాశం వల్లనే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. అతడు స్వయం ప్రకాశకుడు. అతనినుండే ప్రకృతి ఉద్భవించింది. ప్రకృతినుండి మహత్తత్వం ప్రకటితమైంది. దాని లోపల సూర్యచంద్రులు ఆశ్రయించుకుని ఉన్నారు. భగవానుడు సావధానుడై సూర్యచంద్రులను, భూమ్యాకాశాలను దర్శిస్తున్నాడు. అతనినుండియే దిక్కులు పుట్టాయి.

04/29/2016 - 21:56

‘దు ష్టం ముఖం యస్యసః దుర్ముఖ’ అని అమరకోశ వాఖ్య. సనాతన ధర్మాన్ని కాపాడుటకు ఆదిత్యుడు దుర్ముఖుడవుతాడట. రావణాసురుడికి పది తలకాయల మొఖమే కాదు పది నోర్లతో దురహంకార మాటలు కూడా ఉండేవి. అహంకారంతో, తలబిరుసుగలవాన్ని దుర్ముఖ అని రామాయణం చెబుతున్నది. ఈ అహంకారం వల్ల పది తలకాయల రావణాసురుడు రాముడి చేత ఒక తల కూడా లేకుండా చేసుకున్నాడు. ఐదు తలకాయల బ్రహ్మదేవుడు సహితం శివుని చేత చతుర్ముఖుడైనాడు.

04/28/2016 - 21:30

న హి కశ్చిత్ క్షణమపి.... అంటూ భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినది అక్షరసత్యం. మనిషిగా పుట్టిన ప్రతీ ఒక్కరూ ఏ కాలంలోనైనా క్షణమాత్రం కూడా కర్మను చేయకుండా వుండలేరు. కర్మ చేయుటలో వయోభేదం, లింగభేం ఉండదు. మనుష్యులందరూ ప్రకృత జనితములైన గుణములకు లోబడి కర్మలు చేస్తూంటారు.

04/28/2016 - 00:13

ఈ ప్రపంచంలో జరిగే యుద్ధాలు, విధ్వంసాలు అనేక అనర్థాలకు, కరువు కాటకాలకు, ఎడతెగని దుఃఖాలకు హేతువులని అనేక యుద్ధాల అనంతర పరిణామలా, అనుభవాలు చెబుతున్నాయి. ఓడినవారు గెలిచినవారు కూడా తరువాత పాశ్చాత్తాప దగ్ధులు అవుతారు. అందుకు మహాభారత యుద్ధం మనకు మంచి ఉదాహరణ! విజయం సాధించిన పాండవులు కూడా ఎందరో బంధువుల్ని, మిత్రుల్ని, పుత్రుల్ని కోల్పోయారు.

04/26/2016 - 22:19

కౌశికుడను ఒక బ్రాహ్మణుడు తపస్సు చేసుకుందామని అరణ్యాలకు బయలుదేరినాడు. అతనికి వృద్ధులై రుూ కొడుకు తప్ప మరెవరు దిక్కులేని తల్లిదండ్రులున్నారు. వారు కుమారుని తమ అనంతరం తపస్సుకు వెళ్లమని చెప్పి బ్రతిమాలుకున్నారు. కౌశికుడు వినలేదు. ఆ ముసలి తల్లిదండ్రులను అలా దిక్కుమాలిన స్థితిలో దిగవిడచి తపస్సునకు వెళ్లి ఒక నిర్జన ప్రదేశంలో ఊరుకు దూరంగా ఒక చెట్టు క్రింద తపస్సు చేయుట ప్రారంభించాడు.

04/24/2016 - 21:20

మనిషికి పవిత్ర హృదయముంటే భగవంతుడు మనవాడే. ఈ సృష్టిలోని జీవులనుద్ధరించుటకు భగవంతుడు పొందని రూపం లేదు. చేప రూపం ధరించి వేదాలను, మహాఋషులను కాపాడాడు. తాబేలు రూపం ధరించి సముద్ర మథనానికి తోడ్పడ్డాడు. సూకర అవతారమెత్తి హిరణ్యాక్షున్ని వధించి భూదేవిని రక్షించాడు. నరసింహావతారమెత్తి హిరణ్యకశిపుని సంహరించి ప్రహ్లాదుని కాపాడాడు. వామనావతారముతో మహాబల సంపన్నుడైన బలి చక్రవర్తిని పాతాళానికి త్రొక్కాడు.

04/24/2016 - 01:04

మహాభారతంలోని ప్రధాన పాత్రలను పక్కకు పెడితే విశిష్ట వ్యక్తిత్వంగల వ్యక్తులుగా ఇరువురు మనకు గోచరిస్తారు. ఒకరు విదురుడు, రెండవవాడు సంజయుడు.

04/22/2016 - 20:52

ధర్మం నాలుగు పాదాలు నడవటానికి దేవదేవుడు శ్రీమహావిష్ణువు దశావతారాలు దాల్చాడు. ధర్మం నశించినపుడు ధర్మ సంస్థాపన కోసం అవతారాలు ఎత్తి ధర్మాన్ని కాపాడతానని శ్రీకృష్ణ్భగవానుడు స్వయంగా చెప్పాడు. అందులో భాగమే రామావతారం.
వైకుంఠం నుంచి కదలి వచ్చి అయోధ్యలోని దశరథ మహారాజుకు జ్యేష్ఠపుత్రునిగా అవతరించాడు శ్రీరామచంద్రస్వామి.ఆయన చరిత్రనే రామాయణ కావ్యం.

04/21/2016 - 21:48

రామాయణ, మహాభారతం మానవజాతికి రెండు కళ్లు. రెండు వేర్వేరు కాలాలలోని మానవ జాతి చరిత్రలు. ‘రామాయణం’ 24వ మహాయుగం (43 లక్షల 20 వేల సంవత్సరాల కాల పరిమాణం)లోని త్రేతాయుగానికి చెందినది కావడంవల్ల ప్రస్తుతం మనం 28వ మహాయుగంలో చివరిదైన కలియుగంలోనివారం కాబట్టి దాదాపు ఒక కోటి 70 లక్షల సంవత్సరాల నాటి గాథ.

Pages